సీఎం కేసీఆర్‌ను కలిసి విజ్ఞప్తి.. ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ పోటీపై కాంగ్రెస్‌లో అయోమయం
అభ్యర్థుల ఖరారుపై టీఆర్‌ఎస్‌లో టెన్షన్
రాజధానిలో జిల్లా ముఖ్య నేతల భేటీ
జిల్లా నేతకే అభ్యర్థిత్వం కోసం పట్టు
ఎమ్మెల్సీ ఎన్నిక పై రాజకీయ పార్టీల్లో కదలిక
వరంగల్ : శాసనమండలి ఎన్నికల సందడి ఊపందుకుంది. నల్లగొండ-ఖమ్మం- వరంగల్ జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నిక నామినేషన్ల ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. దీంతో ఎన్నికల్లో గెలుపు కోసం అనుసరించే వ్యూహంపై రాజకీయ పార్టీలు దృష్టి పెట్టాయి. ఉమ్మడి రాష్ట్రంలో శాసనమండలి పునరుద్ధించిన తర్వాత ఈ స్థానానికి రెండుసార్లు ఎన్నికలు జరగ్గా.. రెండుసార్లు టీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థులే విజయం సాధించా రు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వా త జరుగుతున్న గ్రాడ్యుయేట్స్ ఎమ్మె ల్సీ తొలి ఎన్నిక కావడంతో తాజాగా అధికారంలో ఉన్న పార్టీగా టీఆర్‌ఎస్ ఈ ఎన్నికపై ప్రత్యేకంగా దృష్టి పెడుతోంది. సంప్రదాయం ప్రకారం అనుకూల ఫలితాలు వస్తాయనే ఆశాభావంతో ఉన్న టీఆర్‌ఎస్‌లో పోటీ చేసే నాయకుల సంఖ్య ఎక్కువగానే ఉంది.
‘అభ్యర్థిత్వం’పై ఉత్కంఠ
గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి ఎవరనే అంశంపై జిల్లాలకు చెందిన పార్టీ ముఖ్య నేతలు గురువా రం హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. ఉప ముఖ్యమంత్రి కడి యం శ్రీహరి, మంత్రులు చందూలాల్, ఎంపీ సీతారాంనాయక్, ఎమ్మెల్యేలు శంకర్‌నాయక్, ఎమ్మె ల్సీ బి.వెంకటేశ్వర్లు, నాయకులు టి.రవీందర్‌రావు, మర్రి యాదవరెడ్డి, నాగుర్ల వెంకటేశ్వర్లు, సత్యవతిరాథోడ్, ఎం.రవీందర్‌రావు భేటీలో పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలో అభ్యర్థిత్వానికి సంబంధించి జిల్లా నేతలకు అవకాశం ఇవ్వాలనే అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది. అభ్యర్థి ఎవరనే అంశంపై ఒకే పేరును టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు సూచించాలనే అభిప్రాయం వ్యక్తమైం ది. ఈ ముఖ్యనేతలు అందరూ కలిసి సాయంత్రం ముఖ్యమంత్రి కేసీఆర్‌ను క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఎ మ్మెల్సీ ఎన్నికల్లో వరంగల్ జిల్లా నేతకే అవకాశం ఇవ్వాలని కోరారు. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న రవీందర్‌రావు ను పేరును పరిశీలించాలని విజ్ఞప్తి చే శారు. అధినేత నిర్ణయం ఎలా ఉం టుందనే విషయం ఆసక్తిగా మారింది. నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం ఆశిస్తున్న వారిని పరిశీలించి సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. జిల్లా నేత లకు వస్తుందా? నల్లగొండ నేతలకు అవకాశం వస్తుందా అనేది వేచి చూడాలి.
కాంగ్రెస్‌లో పోటీకి ససేమిరా..
గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికకు సం బంధించి బీజేపీ ప్రచారంలో ముం దంజలో ఉంది. గతేడాది నవంబరులోనే ఎర్రబెల్లి రామ్మోహన్‌రావును బీజేపీ తమ అభ్యర్థిగా ప్రకటించింది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా బీజేపీ ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగానే తీసుకుంటోంది. బీజేపీ చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ ఎన్నికలో ప్రచారానికి వినియోగించుకుంటోంది. బీజేపీ ఎమ్మెల్యేలు, పలువురు రాష్ట్ర స్థాయి ముఖ్యనేతలు తరుచు జిల్లా పర్యటకు వస్తున్నారు. నియోజకవర్గాలవారీగా ప్రచారం చేస్తున్నారు. శాసన మండలి ఎన్నికల్లో బీజేపీ మద్దతు ఇస్తున్నట్లు టీడీపీ ప్రకటించింది.
ఖమ్మం జిల్లాలో ఎంపీ, ఎమ్మెల్యేల ప్రాతినిథ్యం ఉన్న పార్టీగా వైఎస్సార్ సీపీ ఈ ఎన్నికలో కీలకంగా వ్యవహరించనుంది. మరోవైపు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్ నల్లగొండ-ఖమ్మం-వరంగల్ జిల్లాల గ్రాాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికపై ఎలాంటి కదలిక కనిపించడంలేదు. సాధారణ ఎన్నికల ఓటమి నైరాశ్యం నుంచి హస్తం పార్టీ నేతలు ఇంకా బయటపడడం లేదు. ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు కాంగ్రెస్‌లో ఎవరు మందుకురావడంలేదని ఆ పార్టీలో నేతలు చెబుతున్నారు. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి సంబంధించి మూడు జిల్లాల్లో కలిపి 2,62,448 మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నికల సంఘం ఫిబ్రవరి 26న ఓటర్ల తుది జాబితా విడుదల చేయనుంది.
మండలి.. సందడి..!
Published Fri, Feb 20 2015 12:44 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement
Advertisement