ముమ్మరంగా ఏర్పాట్లు
నేడు పోలింగ్ కేంద్రాలకు సామగ్రి, సిబ్బంది
రేపు ఎమ్మెల్సీ ఎన్నికలు
హన్మకొండ అర్బన్ : వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి జిల్లాలో అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్ వాకాటి కరుణ అన్నారు. శుక్రవారం రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కరుణ మాట్లాడుతూ.. ఆదివారం జరిగే పోలింగ్‌కు శనివారం అన్ని పోలిం గ్ కేంద్రాలకు ఎన్నికల సామగ్రి చేరుకునే విధంగా ఏర్పాట్లు చేసినట్లు తెలి పారు. పోలింగ్ అనంతరం బ్యాలెట్ బా క్సులు రిసెప్షన్ కేంద్రాలకు తరలించేం దుకు ఏర్పాట్లు చేశామన్నారు. జిల్లాలో వెబ్‌కాస్టింగ్‌కు అవకాశం లేని ఐదు కేం ద్రాల్లో వీడియో చిత్రీకరణ చేస్తున్నమని పేర్కొన్నారు. ఎస్పీ అంబర్ కిషోర్ ఝా మాట్లాడుతూ.. జిల్లాకు రెండు యూని ట్ల సీఆర్‌పీఎఫ్ బలగాలు చేరుకున్నాయని అవసరం మేరకు సిబ్బందిని నిర్ధేశిత ప్రదేశాల్లో పెడతామన్నారు. చెక్‌పోస్టుల వద్ద భద్రత కట్టుదిట్టం చేసినట్లు తెలిపారు. డీఆర్వో కె.శోభ, డీటీ విశ్వనారాయణ, అధికారులు పాల్గొన్నారు.
గుర్తింపు కార్డు లేకుంటే..
ఎమ్మెల్సీ ఓటు వేసేవారు గుర్తింపు కార్డు(ఎపిక్ కార్డు) లేకపోతే ప్రత్యామ్నాయంగా పోలింగ్ అధికారులకు తొమ్మిది రకాల కార్డుల్లో ఏదో ఒకటి చూపించి ఓటుహక్కును వినియోగించుకోవచ్చు.