నామినేషన్లు వేస్తున్న అభ్యర్ధులు, ధ్రువీకరణ పత్రం అందుకుంటున్న అభ్యర్థిని
కల్హేర్(నారాయణఖేడ్): రాష్ట్రంలో ఎక్కడ చూసాని ఎన్నికల సందడే నెలకొంది. విద్యార్థుల్లో సైతం ఎలక్షన్ల జోష్ పెరిగింది. ఈ తరుణంలో గురువారం సిర్గాపూర్ మండల కేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థులకు మాక్ పోలింగ్ నిర్వహించి తద్వార ఓటింగ్ విధానంపై అవగాహన కలిపించారు.
ఇన్‌చార్జి హెచ్‌ఎం సజ్జద్ ఆధ్వర్యంలో విద్యార్థులు ఉత్సహంగా మాక్ పోలింగ్‌లో పాల్గొన్నారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులు దీరారు. నామినేషన్లు దాఖలు చేయడం, బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటు వేయడం, ఓట్ల లెక్కిం పు, ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులకు ధ్రువీకరణ పత్రలు జారీ చేసి, తదితర అంశాలపై అవగాహన కలిపించారు.
ఓట ర్లు, అభ్యర్థులుగా, ఎన్నికల అధికారులుగా విద్యార్థులు వ్యవహరించారు. మాక్ ఎన్నికల సందర్భంగా పాఠశాలలో పూర్తిగా ఎన్నికల వాతవరణం నెలకొంది. పాఠశాల ఉపాధ్యాయులు మహేశ్వర్‌రావు, రహీం, తస్లీం పాషా కార్యక్రమన్ని పర్యవేక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment