mock election
-
బడి నాయకుడు నేనే
సాక్షి, వేపాడ (శ్రీకాకుళం) : ప్రజాస్వామ్య ఎన్నికల విధానంపై విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు ఆదర్శ పాఠశాలలో సోమవారం రహస్య ఓటింగ్ పద్ధతిలో పాఠశాల విద్యార్థి నాయకుడ్ని ఎన్నుకున్నారు. విద్యార్థులను ఆకట్టుకున్న ఈ కార్యక్రమం వేపాడ సమీపంలోని ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ ఎ.ప్రభాకర్ నేతృత్వంలో సోమవారం జరిగింది. పాఠశాల విద్యార్థి నాయకుడు ఎన్నికను రహస్య బ్యాలెట్ పేపర్ పద్ధతిలో నిర్వహించారు. పాఠశాలలో చదువుతున్న 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థులంతా రహస్య బ్యాలెట్ పద్ధతిలో ఓటుహక్కు వినియోగించుకున్నారు. పాఠశాల విద్యార్థి నాయకుడు పదవికి (ఎస్పీఎల్) ఎం.ఎర్నాయుడు, జె.జగదీష్, జి.కన్నంనాయుడు, ఐ.చైతన్య పోటీ చేశారు. పీజీటీ, టీజీటీలైన పి.శివప్రసాద్, జె.అప్పారావు, ఎన్.హైమ, ఎస్కే పర్వీన్‌బేగం ఆధ్వర్యంలో మూడు బూత్‌లను ఏర్పాటుచేసి ఉపాధ్యాయులను బూత్ అధికారులుగా నియమించారు. ఓటింగ్ అనంతరం ఓట్లు లెక్కించగా జి.కన్నంనాయుడు 213 ఓట్లు సాధించి ప్రథమ స్థానంలో, 182 ఓట్లు సాధించిన ఎం.ఎర్నాయుడు రెండోస్థానంలో నిలిచారు. దీంతో పాఠశాల ఎస్పీఎల్గా జి.కన్నంనాయుడు, వైస్ ఎస్పీఎల్గా ఎం.ఎర్నాయుడులను విజేతలుగా ఎన్నికల అధికారి ప్రకటించారు. విజేతలను ప్రిన్సిపల్ ప్రభాకర్, ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు అభినందించారు. ఓటింగ్ పద్ధతిలో విద్యార్థి నాయకుడిని ఎన్నుకోవటంతో ప్రజాస్వామ్యంలో ఓటు వినియోగంపై అవగాహన కలిగిందని విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. ప్రిన్సిపల్ ప్రభాకర్ మాట్లాడుతూ విద్యార్థుల్లో ప్రజాస్వామ్య ఎన్నికలపై అవగాహన కల్పించి చైతన్యపరిచేందుకే ఈ కార్యక్రమం నిర్వహించినట్టు చెప్పారు. -
విద్యార్థుల్లో ఎలక్షన్ జోష్!
కల్హేర్(నారాయణఖేడ్): రాష్ట్రంలో ఎక్కడ చూసాని ఎన్నికల సందడే నెలకొంది. విద్యార్థుల్లో సైతం ఎలక్షన్ల జోష్ పెరిగింది. ఈ తరుణంలో గురువారం సిర్గాపూర్ మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులకు మాక్ పోలింగ్ నిర్వహించి తద్వార ఓటింగ్ విధానంపై అవగాహన కలిపించారు. ఇన్చార్జి హెచ్ఎం సజ్జద్ ఆధ్వర్యంలో విద్యార్థులు ఉత్సహంగా మాక్ పోలింగ్‌లో పాల్గొన్నారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులు దీరారు. నామినేషన్లు దాఖలు చేయడం, బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటు వేయడం, ఓట్ల లెక్కిం పు, ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులకు ధ్రువీకరణ పత్రలు జారీ చేసి, తదితర అంశాలపై అవగాహన కలిపించారు. ఓట ర్లు, అభ్యర్థులుగా, ఎన్నికల అధికారులుగా విద్యార్థులు వ్యవహరించారు. మాక్ ఎన్నికల సందర్భంగా పాఠశాలలో పూర్తిగా ఎన్నికల వాతవరణం నెలకొంది. పాఠశాల ఉపాధ్యాయులు మహేశ్వర్‌రావు, రహీం, తస్లీం పాషా కార్యక్రమన్ని పర్యవేక్షించారు. -
ట్రంప్‌కు ఓటేశాడని ఎంత పనిచేసింది..!
వాషింగ్టన్: అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఓ ఎలిమెంటరీ స్కూల్లో నిర్వహించిన మాక్ ఎలెక్షన్లో ఓ విద్యార్థి డోనాల్డ్ ట్రంప్‌కు ఓటు వేసినందుకు అతని తల్లి ఏకంగా ఇంట్లో నుంచి వెళ్లగొట్టింది. ఈ సంఘటన ఎక్కడ జరిగింది, విద్యార్థి తల్లి వివరాలు తెలియరాలేదు. మొబైల్‌తో తీసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలుడిని హింసించిన ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్ అనూహ్య విజయం సాధించిన సంగతి తెలిసిందే. టెక్సాస్‌లోని ఓ స్కూల్లో మాక్ ఎలెక్షన్ నిర్వహించగా ఆ చిన్నారి ట్రంప్‌కు ఓటేశాడు. ఈ విషయం ఇంట్లో తెలియడంతో అతని తల్లి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ విద్యార్థి దుస్తులను సూట్ కేసులో సర్ది దాన్ని డోర్ దగ్గరకు విసిరేసింది. ట్రంప్‌కు ఓటు వేసినందుకు ఇంట్లో ఉండొద్దని, బయటకు వెళ్లిపోమంటూ ఆ చిన్నారిని దూషించింది. ఇంట్లోంచి వెళ్లనంటూ ఆ విద్యార్థి ఏడుస్తూ డోర్ వద్ద నిలబడ్డాడు. ఆమె సూట్ కేసు బయటకు విసిరి, అతన్ని ఇంట్లోంచి బయటకు నెట్టి డోర్ వేసింది. మళ్లీ ఇంట్లోకి రావద్దని హెచ్చరించింది. ఆ చిన్నారి ఏడుస్తూ సూట్ తీసుకుని రోడ్డుపైకి వెళ్లాడు. ది ఫోర్ట్ బెండ్ కౌంటీ షెరిఫ్ ఆఫీసు ఈ ఘటనపై విచారణ చేపట్టింది. చిన్నారిని బయటకు పంపిన మహిళ ఎవరన్న విషయాన్ని అధికారులు వెల్లడించలేదు. ఈ వీడియో అంతా ఓ జోక్ అని ఆమె అధికారులకు చెప్పింది. అయితే దీన్ని తాము జోక్‌గా భావించడం లేదని, తీవ్రంగా పరిగణిస్తున్నామని అధికారులు చెప్పారు.