
పురుగులమందు పిచికారీ చేసే ఆధునిక యంత్రం
మఠంపల్లి (హుజూర్‌నగర్) : పత్తి, మిర్చి తోటల్లో పురుగుల మందు పిచికారీ చేసే ఆధునిక యంత్రం మఠంపల్లిలో కనిపించింది. ఆ యంత్రాన్ని శుక్రవారం వైఎస్సార్ సీపీ రైతుసంఘం జిల్లా నాయకులు కర్నె వెంకటేశ్వర్లు పరిశీలించి మాట్లాడారు. ట్రాక్టర్‌ను పోలిన ఈ యంత్రం పత్తి, మిర్చి తోటల్లో పురుగుల మందులు పిచికారీకి అనుకూలంగా ఉంటుందని చెప్పారు. రెండువైపులా రెక్కలు విప్పుకుని సుమారు ఇరువైపులా ఒకేసారి 20 మీటర్ల వెడల్పులో పురుగుల మందులను పిచికా రీ చేస్తుందని పేర్కొన్నారు. ఆరు నిమిషాల వ్యవధిలోనే ఎకరం తోటలో పురుగుల మందు పిచికారి చేస్తుందని చెప్పారు. ఈ యంత్రంతో సమయం ఆదాతో పాటు పురుగుల మందును పిచికారీ చేసే రైతులు అనారోగ్యాల బారిన పడే ప్రమాదం ఉండదని పేర్కొన్నారు. కాగా ఆధునిక యంత్రాన్ని పలువురు రైతులు ఆసక్తిగా తిలకరించారు.
Comments
Please login to add a commentAdd a comment