సాక్షి, సిటీబ్యూరో వచ్చేనెల 4న మొహర్రం సందర్భంగా ఎలాంటి ఇబ్బందుల్లేకుండా బీబీకాఆలం ఊరేగింపు మార్గం లో, ఇతరత్రా ప్రధాన మార్గాల్లో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాల్సిందిగా మేయర్ మాజిద్‌హుస్సేన్ అధికారులకు సూచించారు. శనివారం కమిషనర్ సోమేశ్‌కుమార్‌తో కలిసి మొహర్రం ఏర్పాట్లపై సమీక్షజరిపారు.
రహదారులు, పారిశుధ్యం, వీధిదీపాల ఏర్పాటులో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. మొహర్రం సందర్భంగా ఎంపికచేసిన మార్గాల్లో ఎల్‌ఈడీ లైట్లు.. పాతబస్తీలో పారిశుధ్యానికి స్పెషల్‌డ్రైవ్ చేపట్టాలన్నారు. ఎలాంటి అసౌకర్యం లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కమిషనర్ ఈ సందర్భంగా అధికారులకు సూచించారు.
మొహర్రం ఏర్పాట్లపై సమీక్ష
Published Sun, Oct 19 2014 12:32 AM | Last Updated on Sat, Sep 2 2017 3:03 PM
Advertisement
Advertisement