ఓ తల్లి ఏడాదిన్నర బాబు అని కూడా చూడకుండా కిరోసిన్ పోసి నిప్పంటించడమే కాకుండా, తనపై కూడా కిరోసిన్ పోసుకుని ఆత్మాహుతి చేసుకుంది
మహబూబ్‌నగర్: ఓ తల్లి ఏడాదిన్నర బాబు అని కూడా చూడకుండా కిరోసిన్ పోసి నిప్పంటించడమే కాకుండా, తనపై కూడా కిరోసిన్ పోసుకుని ఆత్మాహుతి చేసుకుంది. ఈ దారుణం మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట మండలం చామగడ్డ గ్రామంలో బుధవారం సాయంత్రం జరిగింది. ఈ ఘటనలో గ్రామానికి చెందిన మణెమ్మ(27), ఆమె కుమారుడు సంజీవ్‌కుమార్ (18నెలలు) సజీవ దహనమయ్యారు. ఇల్లు కూడా కొంత భాగం దగ్ధమైంది. కుటుంబ కలహాలే ఈ ఘటనకు కారణమని తెలుస్తోంది.