torch
-
కాంగ్రెస్ ర్యాలీలో అపశ్రుతి.. స్టేజీ కుప్పకూలి కిందపడ్డ నాయకులు..
రాయ్‌పూర్: రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని నిరసిస్తూ ఛత్తీస్‌గఢ్ బిలాస్పూర్లో కాంగ్రెస్ ఆదివారం చేపట్టిన టార్చ్ ర్యాలీలో అపశ్రుతి చోటుచేసుకుంది. స్టేజీపైకి పదుల సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు ఎక్కడంతో బరువు ఆపలేక అది ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో వేదికపై ఉన్నవారంతా కిందపడిపోయారు. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో అంతా ఊపరిపీల్చుకున్నారు. అయితే ఈ ఘటనను కాంగ్రెస్ శ్రేణుల్లో ఒకరు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. దీంతో అది వైరల్‌గా మారింది. స్టేజీ కూలిన వెంటనే అక్కడున్నవారంతా ఉలిక్కిపడ్డారు. అందరూ తేరుకోవడానికి కాస్త సమయం పట్టింది. ఆ తర్వాత ర్యాలీ యథావిధిగా కొనసాగింది. #WATCH | Chhattisgarh: Stage breaks down during torch rally organized by Congress to protest against termination of Rahul Gandhi's membership of Lok Sabha in Bilaspur. (02.04.23) pic.twitter.com/PjnXREl5JN — ANI (@ANI) April 3, 2023 2019లో కర్ణాటకలో ఓ ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో దొంగల ఇంటిపేరు మోదీ అనే ఎందుకు ఉందని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం తెలిపిన గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే ఒకరు రాహుల్‌పై సూరత్ కోర్టులో పరువునష్టం దావా వేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం రాహుల్‌ను దోషిగా తేల్చింది. రెండేళ్ల జైలు శిక్ష కూడా విధించింది. అనంతరం 24 గంటల్లోనే లోక్‌సభ సెక్రెటేరియేట్ రాహుల్ గాంధీని ఎంపీ పదవి నుంచి తొలగిస్తూ అనర్హత వేటు వేసింది. దీంతో దేశంలోని ప్రతిపక్షాలన్ని ఆయను సంఘీభావం తెలిపాయి. కాగా.. సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పును రాహుల్ గాంధీ సవాల్ చేశారు. సోమవారం సోదరి ప్రియాంక గాంధీతో కోర్టుకు వెళ్లారు. రాహుల్‌కు ఈసారైనా అనుకూలంగా తీర్పు వస్తుందో లేదో చూడాలి. చదవండి: జమిలీ ఎన్నికలు తథ్యం.. -
అలా... ఢిల్లీలో మొదలైంది
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్ కోసం ఒలింపిక్స్ మాదిరి ఈసారి భారత్‌లో శ్రీకారం చుట్టిన టార్చ్ రిలే దేశ రాజధానిలో ఘనంగా మొదలైంది. ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం జెండా ఊపి లాంఛనంగా ఈ జ్యోతి రిలేను ప్రారంభించారు. అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) అధ్యక్షుడు అర్కడి వోర్కోవిచ్ తొలి టార్చ్ బేరర్ కాగా... దీనిని అందుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భారత చెస్ సూపర్ గ్రాండ్‌మాస్టర్, ఐదుసార్లు ప్రపంచ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్‌కు అందించారు. ► క్రీడా సమాఖ్య చీఫ్, ప్రధాని, చెస్ దిగ్గజం... ఇలా విభిన్న అతిరథుల మధ్య టార్చ్ రిలే వైభవంగా మొదలైంది. ఇక్కడి నుంచి ఇకపై 40 రోజుల పాటు కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా భారతావనిని ఈ జ్యోతి చుట్టి వస్తుంది. ► వివిధ రాష్ట్రాలకు చెందిన 75 నగరాల్లో టార్చ్ రిలే కార్యక్రమం జరుగుతుంది. లేహ్, శ్రీనగర్, జైపూర్, సూరత్, ముంబై, భోపాల్, పట్నా, కోల్‌కతా, గ్యాంగ్‌టక్, హైదరాబాద్, బెంగళూరు, పోర్ట్‌బ్లెయిర్, కన్యాకుమారిల మీదుగా సాగే రిలే చివరకు ఆతిథ్య వేదిక అయిన తమిళనాడులోని మహాబలిపురంన కు చేరుకుంటుంది. ఏ రాష్ట్రానికి వెళితే అక్క డి గ్రాండ్‌మాస్టర్లు జ్యోతిని అందుకుంటారు. ► చెస్ ఒలింపియాడ్‌కు వందేళ్ల చరిత్ర ఉంది. శతవసంతాల సమయంలో తొలిసారి భారత్ లో ఈ ఈవెంట్ జరుగుతోంది. మొత్తం 188 దేశాలకు చెందిన ప్లేయర్లు పాల్గొంటారు. ► ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ ‘చెస్ పురిటిగడ్డపై చెస్ ఒలింపియాడ్ ప్రప్రథమ టార్చ్ రిలేకు అంకురార్పణ జరగడం గర్వంగా ఉంది. చదరంగం పుట్టిన దేశంలో చెస్ ఒలింపియాడ్ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. ఇలా జ్యోతి రిలే భారత్‌లో మొదలవడం దేశానికే కాదు... చెస్ క్రీడకే గౌరవం పెంచినట్లయింది’ అని అన్నారు. ఈ కార్యక్రమం సందర్భంగా భారత మహిళా తొలి గ్రాండ్‌మాస్టర్ (జీఎం), ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి కోనేరు హంపితో మోదీ కాసేపు సరదాగా చెస్ గేమ్ ఆడారు. ► చెన్నైకి సమీపంలోని మహాబలిపురంలో జూలై 28 నుంచి ఆగస్టు 10 వరకు చెస్ ఒలింపియాడ్ జరుగుతుంది. భారత్ తరఫున ఓపెన్ విభాగంలో రెండు జట్లు, మహిళల విభాగంలో రెండు జట్లు బరిలోకి దిగుతున్నాయి. 2014లో ఓపెన్ విభాగంలో భారత జట్టు తొలిసారి కాంస్య పతకం సాధించింది. కరోనా కారణంగా 2020లో ఆన్లైన్ ఒలింపియాడ్‌లో భారత్, రష్యా సంయుక్త విజేతలు గా నిలువగా... 2021లో మళ్లీ ఆన్‌లైన్‌ఒలింపియాడ్‌లో భారత్‌కు కాంస్యం దక్కింది. -
మా ఎంపిక సరైనదే అంటూ చైనా కొత్త పల్లవి
Winter Olympic 2022: వింటర్ ఒలంపిక్స్‌లో టార్చ్‌బేరర్‌గా గల్వాన్‌లోయ ఘర్షణతో సంబంధం ఉన్న సైనికుడిని ఎంపిక చేయడాన్ని చైనా సమర్థించుకుంది. సదరు సైనికుడిని ప్రమాణాలకు అనుగుణంగా ఎంచుకున్నామని తెలిపింది. ఇందులో రాజకీయ దురుద్దేశాలు చూడవద్దని కోరింది. గల్వాన్ లోయ ఘర్షణలో గాయపడిన కమాండర్ క్వి ఫాబావోను చైనా టార్చ్‌బేరర్‌గా ఎంపిక చేయడంపై విమర్శలు వచ్చాయి. దీనికి నిరసనగా వింటర్ ఒలంపిక్స్ ఆరంభోత్సవాలను భారత్ బహిష్కరించింది. యూఎస్ సైతం చైనా చర్యను తప్పుబట్టింది. అయితే ఇది కేవలం ముందుగా అనుకున్న ప్రమాణాలకు లోబడి తీసుకున్న నిర్ణయమని చైనా విదేశాంగ మంత్రిత్వ ప్రతినిధి ఝావో లిజియన్ చెప్పారు. ఈ విషయాన్ని భారత్ హేతుబద్ద దృష్టితో చూడాలని, అనవసర రాజకీయ విమర్శలు చేయవద్దని కోరారు. అయితే ఒలంపిక్స్లాంటి కార్యక్రమాన్ని కూడా రాజకీయం చేయాలని చూడడం చైనా కోరికని భారత ప్రతినిధి బాగ్చీ విమర్శించారు. -
చైనాతో వివాదం: మా మద్దతు భారత్‌కే.. స్పష్టం చేసిన అమెరికా
వాషింగ్టన్: గాల్వాన్ ఘర్షణలో పాల్గొన్న సైనికాధికారిని బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ టార్చ్‌బేరర్‌గా ఎంపిక చేయడంపై చైనాతో ఏర్పడ్డ వివాదంలో తమ మద్దతు భారత్‌కేనని అమెరికా పేర్కొంది. పొరుగు దేశాలను బెదిరించే, ఇబ్బంది పెట్టే చైనా చర్యలను గతంలో కూడా తప్పుబట్టామని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెడ్‌ప్రైస్ అన్నారు. ఇలాంటి విషయాల్లో భారత్ వంటి మిత్ర దేశాలకు ఎప్పుడూ మద్దతుగా నిలుస్తామని చెప్పారు. భారత్, చైనా సరిహద్దు వివాదాలను చర్చల ద్వారా శాంతియుతంగా పరిష్కరించుకోవాలన్నదే తమ ఉద్దేశమన్నారు. సీనియర్ యూఎస్ సెనేటర్లు మార్కో రూబియో, జిమ్ రిచ్ కూడా చైనా చర్యను దుయ్యబట్టారు. వింటర్ ఒలింపిక్స్‌కు చైనా రాజకీయ రంగు పూస్తున్న తీరుకు ఇది మరో నిదర్శనమని రూబియో విమర్శించారు. భారత దళాలపై దొంగచాటున దాడికి దిగిన సైనిక బృందంలోని అధికారిని టార్చ్‌బేరర్‌గా ఎంపిక చేయడం కచ్చితంగా రెచ్చగొట్టే ప్రయత్నమేనని ట్వీట్ చేశారు. ఈ విషయంలో చైనా తీరు సిగ్గుచేటని రిచ్ ట్వీట్ చేశారు. భారత్ తన సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు చేసే అన్ని ప్రయత్నాలకూ అమెరికా మద్దతుంటుందన్నారు. 2020 జూన్‌లో లడఖ్‌లోని గాల్వాన్ లోయ వద్ద మన దళాలపై చైనా జరిపిన దొంగచాటు దాడిలో పాల్గొన్న పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అధికారిని శుక్రవారం నాటి ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల టార్చిబేరర్ల బృందంలోకి చైనా ఎంపిక చేయడంపై దుమారం రేగింది. దీనిపై భారత్ తీవ్రంగా మండిపడింది. ఒలింపిక్స్ ప్రారంభ, ముగింపు వేడుకలను బహిష్కరించాలని నిర్ణయించింది. దూరదర్శన్ కూడా ప్రారంభ, ముగింపు వేడుకలను ప్రత్యక్షప్రసారం చేయబోదని ప్రసారభారతి వెల్లడించింది. -
టోక్యో ఒలింపిక్స్ టార్చ్ ఆవిష్కరణ
టోక్యో: వచ్చే ఏడాది ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిచ్చేందుకు సిద్ధమవుతున్న టోక్యో నగరంలో బుధవారం టార్చ్‌ను ఆవిష్కరించారు. ఐదు రేకులతో ఉండే చెర్రీ బ్లాసమ్ పువ్వు ఆకారం ఈ టార్చ్ పైభాగంలో కనిపిస్తుంది. బంగారు వర్ణంలో ఉన్న ఈ టార్చ్ పొడవు 28 అంగుళాలు, బరువు 1.2 కిలోలు. దీన్ని అల్యూమినియం లోహంతో తయారు చేశారు. 2011లో సంభవించిన భూకంపం, సునామీ బాధితుల కోసం తాత్కాలికంగా ఇళ్లను నిర్మిం చగా వచ్చిన వేస్టేజ్ అల్యూమినియం లోహం తో టార్చ్ రూపొందింది. టోక్యోలో ఈ టార్చ్ పరుగు పెట్టనున్న నేపథ్యంలో నగర వీధుల్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దనున్నారు. మార్చి 26న టార్చ్ రిలే మొదలవుతుంది. -
చదవని బైబిల్.. వెలగని కాగడా వంటిదే!
• సువార్త గలిలయకు 150 కిలో మీటర్ల దూరంలో యెరూషలేముంటుంది. యేసు బోధ విని బాగుపడేందుకు కాదు, ఆయన బోధల్లో లోపాలెత్తి చూపించి, ఆయనకే ఎదురు బోధ చేసేందుకు వాళ్లంతా అంత ప్రయాసపడి రావడం ఆశ్చర్యకరం!! యేసును చూసి, ఆయన బోధ వినే భాగ్యాన్ని పొందిన ఎంతోమంది నిరక్షరాస్యులు, అజ్ఞానులు తమ జీవితాన్ని ధన్యం చేసుకొంటుండగా, మహా మేధావులుగా ముద్రపడినవారు ఆ భాగ్యాన్ని చేజార్చుకొని, యేసుతో వాతలు వేయించుకొని భ్రష్టులుగానే తిరుగుముఖం పట్టిన పరిసయ్యులనేమనాలి? కొందరంతే!! బోధ చేయడానికి, ఖండించడానికి, గద్దించడానికి ఇతరులకు బుద్ధి చెప్పడానికే తాము పుట్టామన్న దుర్భావనలో ఉంటారు (2 తిమోతి 4:2). కాని దానికి ముందుగా తమలోని అజ్ఞానపు అంధకారాన్ని గుర్తించి సరిచేసుకోలేని గురివింద గింజలు వాళ్లు. అలా పప్పులో కాలేసి చివరికి నరకంలో చేరే మాట అటుంచితే, లోపాలెత్తి చూపడం, విమర్శించడమే వ్యాపారంగా మారి విజ్ఞత లోపించిన తొందరపాటు నిర్ణయాలతో ఈ లోకంలోనే తమ జీవితాన్ని అశాంతితో నరకప్రాయం చేసుకుంటారు వాళ్లు. ఎంత ఉన్నా ఇంకేదో పొందలేకపోతున్నామన్న అభద్రతా, అసంతృప్తి భావన పరోక్షంగా వారి మాటలు, చేతల్లో ధ్వనిస్తూంటుంది. దేవుని బోధలు వినేందుకు ఈనాడు వందల మైళ్లు ప్రయాణించే అవసరం లేదు. దేవుని మాటలు, బోధల సంగ్రహ సారాంశంగా బైబిలు గ్రంథం విశ్వాసులందరికీ అందుబాటులో ఉంది. బైబిలు గ్రంథం జీవితాన్ని సరైన బాటలో నడిపించే కాగడాలాంటిది. అయితే దాన్ని ^è దివినపుడు మాత్రమే అలా వెలిగే కాగడా అవుతుంది. చదవని బైబిలు గ్రంథం, వెలగని కాగడావంటిదే! దైవ భయంతో, వినమ్రతతో, అత్యంత విధేయతతో చదివితే అది జీవితాన్ని కుటుంబాన్ని కూడా ఆనందమయం చేస్తుంది. విమర్శించడానికో, లోపాలు చూడడానికో మిడిమిడి జ్ఞానపు మేధావిలాగా చదివితే మాత్రం జీవితంలో మిగిలేది అంధకారమే, అశాంతే, భ్రష్టత్వమే. – రెవ.డాక్టర్ టి.ఎ. ప్రభుకిరణ్ -
టార్చ్‌తో టీ వేడి చేసుకోవచ్చు...
కరెంటు పోతే చీకట్లో ఏది ఎక్కడుందో చూసుకోవడానికి టార్చ్ పనికొస్తుంది గాని, టార్చ్‌తో టీ వేడి చేసుకోవడం ఏంటనుకుంటున్నారా..? ఇక్కడ ఫొటోలో కనిపిస్తున్న టార్చ్ చేతిలో ఉంటే... భేషుగ్గా టీ వేడి చేసుకోవచ్చు. ఒక్క టీ మాత్రమేనా? కాఫీ, సూప్, పులుసు, సాంబార్... వగైరా వగైరాలు ఏవైనా క్షణాల్లోనే వేడి చేసుకోవచ్చు. జేబులో ఇమిడిపోయే ఈ టార్చ్ మామూలు టార్చ్ కాదు. ఇది ఫ్లాష్‌పాయింట్ మినీ మైక్రోవేవ్ ఎక్సోస్టవ్. కప్పులో లేదా బౌల్లో ఏదైనా ద్రవాన్ని పోసి, ఈ టార్చ్‌ను ఆన్‌చేసి, దాని వెలుతురును ద్రవంపైకి ప్రసరింపజేస్తే క్షణాల్లోనే అవి సలసలమని మరుగుతాయి. రీచార్జబుల్ బ్యాటరీల సాయంతో పనిచేసే ఈ టార్చ్ ఉంటే ప్రతిదానికీ స్టవ్ వెలిగించాల్సిన పనే ఉండదు. అయితే, ఇది వాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే, దీని నుంచి వెలువడే వెలుతురు నుంచి పుట్టే వేడి తీవ్రతకు కాగితాల వంటివి క్షణాల్లోనే అంటుకుని కాలి బూడిదైపోతాయి. కాబట్టి, ఇది పిల్లలకు దూరం ఉంచి వాడుకోవడం క్షేమం. -
వాహనాలకు ఆకతాయిల నిప్పు
గుంటూరు: గుంటూరులోని సాయిబాబారోడ్డు లో గుర్తు తెలియని వ్యక్తులు వాహనాలు దహనం చేశారు. మంగళవారం అర్థరాత్రి సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. స్థానికంగా ఓ ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న 6 ద్విచక్రవాహనాలకు దుండగులు పెట్రోల్ పోసి నిప్పుపెట్టారు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులు సమాచారం ఇచ్చారు. కేసునమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు -
నాలుగు వాహనాలకు మావోయిస్టులు నిప్పు
రాయ్‌పూర్: మరోసారి మావోయిస్టులు పెట్రేగి పోయారు. రాష్ట్రంలోని నారాయణ్ పూర్ జిల్లాలో నాలుగు వాహనాలకు నిప్పుపెట్టి ధ్వంసం చేశారు. ఈ వాహనాలన్ని కూడా కన్స్ట్రక్షన్ విభాగానికి చెందినవే. నారాయణ్ పూర్ -ఓర్చా మధ్య ఓ ప్రైవేటు సంస్థ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించింది. ఈ మార్గంలో మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. నిర్మాణ పనులు పూర్తి చేసుకుని నాలుగు వాహనాలు రోడ్డుపక్కన నిలిపిఉంచగా మొత్తం 20మంది మావోయిస్టులు ఆయుధాలతో వచ్చి సోమవారం ఉదయం వాటికి నిప్పు పెట్టారు. ఈ ఘటన వివరాలు పోలీసులకు తెలిసి అక్కడికి వచ్చే లోపే తిరిగి అడవిలోకి పారిపోయారు. -
30 వాహనాలను తగలబెట్టారు
రాంచీ : జార్ఖండ్‌లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. బోకారో జిల్లా బెర్మో ప్రాంతంలో సెంట్రల్ కోల్‌ఫిల్డ్స్ లిమిటెడ్ (సీసీఎల్)ప్రాజెక్టు వద్ద నిలిపి ఉన్న ఆ సంస్థకు చెందిన 30 వాహనాలపై మావోయిస్టులు దాడి చేసి తగలబెట్టారు. అనంతరం వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. సీసీఎల్ సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ విధ్వంసంలో దాదాపు 100 మందికిపైగా మావోయిస్టులు పాల్గొన్నారని పోలీసులు తెలిపారు. సీసీఎల్ ప్రాజెక్ట్ సైట్ వద్దకు శుక్రవారం ఆర్థరాత్రి భారీగా మావోయిస్టులు చేరుకున్నారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లి పోవాలని సీసీఎల్ భద్రత సిబ్బందిని ఆదేశించారు. ఆ తర్వాత వాహనాలను అగ్నికి ఆహుతి చేశారని పోలీసులు తెలిపారు. జార్ఖండ్‌లోని మొత్తం 24 జిల్లాలు ఉన్నాయి. వాటిలో 18 జిల్లాలో మావోయిస్టుల ప్రాబల్యం అధికంగా ఉన్న సంగతి తెలిసిందే. -
ఏడాదిన్నర బాబుతోపాటు తల్లి ఆత్మాహుతి
మహబూబ్‌నగర్: ఓ తల్లి ఏడాదిన్నర బాబు అని కూడా చూడకుండా కిరోసిన్ పోసి నిప్పంటించడమే కాకుండా, తనపై కూడా కిరోసిన్ పోసుకుని ఆత్మాహుతి చేసుకుంది. ఈ దారుణం మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట మండలం చామగడ్డ గ్రామంలో బుధవారం సాయంత్రం జరిగింది. ఈ ఘటనలో గ్రామానికి చెందిన మణెమ్మ(27), ఆమె కుమారుడు సంజీవ్‌కుమార్ (18నెలలు) సజీవ దహనమయ్యారు. ఇల్లు కూడా కొంత భాగం దగ్ధమైంది. కుటుంబ కలహాలే ఈ ఘటనకు కారణమని తెలుస్తోంది. -
బీజేపీ మేనిఫెస్టోను తగలబెట్టిన కాంగ్రెస్ నేతలు
కర్నూలు: ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా కేటాయింపుపై కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఇటీవల చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా దూమారం రేగింది. దీంతో మంగళవారం బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను కర్నూలు కాంగ్రెస్ శ్రేణులు తగలబెట్టి నిరసన వ్యక్తం చేశాయి. అధికారంలోకి వస్తే ఎన్నికలప్పుడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తామని చెప్పి మేనిఫెస్టో విడదుల చేసి ఇప్పుడు మాట మార్చడం సరికాదని కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
దుబాయ్ టార్చ్ టవర్‌లో అగ్నిప్రమాదం
-
దుబాయ్ 'టార్చ్' టవర్‌లో అగ్నిప్రమాదం
దుబాయ్ : దుబాయ్‌లో శనివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్రపంచంలోనే ఎత్తైన భవన సముదాయంలో ఒకటైన 'టార్చ్' టవర్‌లో ఈరోజు తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. భవన సముదాయంలోని 59వ అంతస్తులో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగినప్పుడు వేలాదిమంది ఉండగా, అప్రమత్తమైన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని వారిని సురక్షితంగా బయటకు తరలించినట్లు సమాచారం. పెద్ద ఎత్తున ఎగసిపడుతున్న మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. బిల్డింగ్ మధ్య భాగంలో అగ్నిప్రమాదం జరగటంతో భవన సముదాయంలో చిక్కుకున్నవారు కొంతమంది మెట్ల ద్వారా కిందకు రాగా, మరికొందరు బిల్డింగ్ పైకి చేరుకున్నారు. చిక్కుకున్నవారిని సురక్షితంగా బయటకు తరలించేందుకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది యత్నిస్తున్నారు. మరోవైపు బయటకు వచ్చేందుకు అందరూ ఒక్కసారిగా మెట్లమార్గాన్ని ఆశ్రయించటంతో తొక్కిసలాట జరగటంతో పలువురు గాయపడినట్లు తెలుస్తోంది. 60వ అంతస్తు పూర్తిగా అగ్నికి ఆహుతి అయ్యింది. కోట్లలో ఆస్తినష్టం జరిగినట్లు అధికారుల అంచనా. కాగా ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.