బీజేపీ మేనిఫెస్టోను తగలబెట్టిన కాంగ్రెస్ నేతలు
కర్నూలు: ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా కేటాయింపుపై కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఇటీవల చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా దూమారం రేగింది. దీంతో మంగళవారం బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను కర్నూలు కాంగ్రెస్ శ్రేణులు తగలబెట్టి నిరసన వ్యక్తం చేశాయి. అధికారంలోకి వస్తే ఎన్నికలప్పుడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తామని చెప్పి మేనిఫెస్టో విడదుల చేసి ఇప్పుడు మాట మార్చడం సరికాదని కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.