రాయ్పూర్: మరోసారి మావోయిస్టులు పెట్రేగి పోయారు. రాష్ట్రంలోని నారాయణ్ పూర్ జిల్లాలో నాలుగు వాహనాలకు నిప్పుపెట్టి ధ్వంసం చేశారు. ఈ వాహనాలన్ని కూడా కన్స్ట్రక్షన్ విభాగానికి చెందినవే. నారాయణ్ పూర్ -ఓర్చా మధ్య ఓ ప్రైవేటు సంస్థ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించింది. ఈ మార్గంలో మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
నిర్మాణ పనులు పూర్తి చేసుకుని నాలుగు వాహనాలు రోడ్డుపక్కన నిలిపిఉంచగా మొత్తం 20మంది మావోయిస్టులు ఆయుధాలతో వచ్చి సోమవారం ఉదయం వాటికి నిప్పు పెట్టారు. ఈ ఘటన వివరాలు పోలీసులకు తెలిసి అక్కడికి వచ్చే లోపే తిరిగి అడవిలోకి పారిపోయారు.
నాలుగు వాహనాలకు మావోయిస్టులు నిప్పు
Published Mon, Aug 10 2015 1:55 PM | Last Updated on Sun, Sep 3 2017 7:10 AM
Advertisement
Advertisement