జిల్లాలకు పుస్తకాలు పంపిణీ చేస్తున్న వయోజన విద్యాశాఖ
సాక్షి, హైదరాబాద్: సాక్షర భారత్ కార్యక్రమంలో కదలిక వచ్చింది. ఈ పథకం కింద జిల్లా కేంద్రాలకు పుస్తకాలు, మెటీరియల్ తదితరాలను రాష్ట్ర వయోజన విద్యా శాఖ చేరవేస్తోంది. కొంత కాలంగా ఈ పథకం నిలిచిన నేపథ్యంపై జూలై 31న సాక్షి ప్రధాన సంచికలో ‘అటకెక్కిన సాక్షర భారత్’కథనానికి యంత్రాంగం స్పందించి ఈ మేరకు చర్యలు చేపట్టింది. ఈనెల 20న ఎన్‌ఓఐఎస్ (నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్) పరీక్ష నిర్వహించనున్నట్లు ఆ శాఖ ప్రకటించింది. మరోవైపు పక్షం రోజుల్లో పరీక్షలుండగా... ఇంత ఆలస్యంగా పుస్తకాలు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం గమనార్హం.
పుస్తకాలు వచ్చేశాయ్!
Published Sat, Aug 5 2017 4:27 AM | Last Updated on Mon, Sep 11 2017 11:16 PM
Advertisement
Advertisement