sakshara bharath
-
Barefoot Empress: పోరాడే వాళ్లకో ప్రేమలేఖ
‘ఏదైనా సాధించాలనుకుని పోరాడే వాళ్లకు ఈ డాక్యుమెంటరీ ఒక ప్రేమలేఖ’ అంటాడు అంతర్జాతీయ చెఫ్ వికాస్ ఖన్నా. 94 ఏళ్ల వయసులో పట్టుబట్టి కేరళ సాక్షరతా మిషన్‌లో నాలుగో క్లాసు పాసైన కార్తాయని అమ్మ మీద అతడు ‘బేర్‌ఫుట్ ఎంప్రెస్’ పేరుతో డాక్యుమెంటరీ నిర్మించాడు. ఇప్పటికే అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో పాల్గొన్న ఆ డాక్యుమెంటరీ త్వరలో భారతప్రేక్షకుల కోసం రిలీజ్ కానుంది. ఈ డాక్యుమెంటరీ ఆడపిల్లలందరినీ చదివించక తప్పని స్ఫూర్తినిస్తుంది అంటున్నాడు వికాస్. అంతర్జాతీయ వంటగాడిగా ఖ్యాతి పొందిన వికాస్ ఖన్నాకు నానమ్మ వయసు ఉన్న వారు ఇచ్చే స్ఫూర్తి పట్ల ప్రత్యేకమైన ఆసక్తి ఉంది. ఎందుకంటే అతడు జన్మతః కాళ్లలో ఇబ్బందితో పుట్టాడు. అంటే 13 ఏళ్ల వరకు పరిగెత్తడం అతనికి సాధ్యం కాలేదు. దాంతో ఆడుకోవడానికి వెళ్లేవాడు కాదు. అందువల్ల అతడి నానమ్మ అతణ్ణి తన వంటగదిలో కూచోబెట్టుకుని వంటలు చేస్తూ మంచి మంచి కబుర్లు చెప్పేది. ఆమె వల్ల అతను స్ఫూర్తి పొందాడు. అంతే కాదు గొప్ప వంటవాడు అయ్యాడు. ఇప్పుడు బహుశా కేరళ కార్తాయని అమ్మను చూసినప్పుడు అతనికి తన నానమ్మ గుర్తుకు వచ్చి ఉంటుంది. కార్తాయని అమ్మ 96 ఏళ్ల వయసులో చదువుకోవాలని సంకల్పించింది. పల్లెల్లో వయోజనులు చదువుకోవడం గురించి ఆలోచనే ఉండదు. ఇక 90 దాటిన వారిని ‘ఇంకా పిలుపు రాలేదా’ అన్నట్టు చూస్తూ ఉంటారు కొందరు. అలాంటిది కేరళలోని అలెప్పి జిల్లా ‘చెప్పడ్’ అనే చిన్న ఊళ్లోని కార్తాయని అమ్మ అందరి అంచనాలు తారుమారు చేసింది. కేరళ ప్రభుత్వం వయోజనుల కోసం ఏర్పాటు చేసిన అక్షరాస్యతా కార్యక్రమం కింద ఇంట్లో ఉండి చదువుకుని నాలుగో తరగతిని వందకు 98 మార్కులతో పాసయ్యింది. 15 నుంచి 75 ఏళ్ల వయసు ఉన్నవారికి కనీస చదువు నేర్పాలనుకున్న ఈ కార్యక్రమంలో కార్తాయని అమ్మ ఉత్సాహంగా దూకింది. చదవడం (30 మార్కులకు పరీక్ష), రాయడం (40 మార్కులకు), లెక్కలు (30 మార్కులకు) ఈ మూడు అంశాల్లో ఉమ్మడిగా 100కు 30 మార్కులు వస్తే పాస్ చేస్తారు. కాని కార్తాయని అమ్మకు 98 మార్కులు వచ్చాయి. దాంతో ఆమెకు రాష్ట్రం మొత్తం సలామ్ చేసింది. ప్రతిష్ఠా్టత్మక కేంద్ర స్త్రీ శక్తి అవార్డు వరించింది. ‘ఏదైనా పట్టుబట్టి సాధించాలనుకునేవారికి ఆమెను మించిన స్ఫూర్తి లేదు’ అంటాకు వికాస్ ఖన్నా. ఇంతకు ముందు వికాస్ ఖన్నా ‘ది లాస్ట్ కలర్’ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ డాక్యుమెంటరీ అతడి రెండో ప్రయత్నం. ఉత్త కాళ్లతో ఆమె ఒక యోధురాలిగా పరీక్ష రాయడానికి స్థానిక స్కూలుకు వెళుతున్న ఫొటో ఎవరినైనా కట్టి పడేస్తుంది. ఆ పరీక్షలో పాసయ్యి గెలిచి ఆమె పట్టుదలకు సామ్రాజ్ఞి అయ్యింది. అందుకే వికాస్ ఖన్నా ఈ డాక్యుమెంటరీకి ‘బేర్‌ఫుట్ ఎంప్రెస్’ (ఉత్తకాళ్ల సామ్రాజ్ఞి) అని పెట్టాడు. నూరేళ్ల ఆయుష్షుకు చేరినా కార్తాయని అమ్మ ఇంకా చదువుకోవాలనే అభిలషిస్తోంది. ‘మరి అలాంటిది మన దేశంలో చిన్నారి ఆడపిల్లలు ఎంతమంది చదువుకోవాలని కోరుకుంటారో కదా. వారందరూ చదువుకోవాల్సిన అవసరాన్ని ఈ డాక్యుమెంటరీ చెప్తుంది’ అంటాడు వికాస్. ఇప్పటికే అనేక అంతర్జాతీయ ఫెస్టివల్స్‌లో పాల్గొన్న ఈ డాక్యుమెంటరీ త్వరలో మన దేశంలో బహుశా ఓటీటీ ద్వారా విడుదల కానుంది. -
చంద్రబాబు సర్కార్ కొత్త నాటకం
సాక్షి, నెల్లూరు: విధుల నుంచి తప్పించిన చిరుద్యోగులను ఎన్నికల ముందు ప్రసన్నం చేసుకొనేందుకు చంద్రబాబు ప్రభుత్వం చేసిన డ్రామాలు విస్మయ పరుస్తోంది. గతేడాది సాక్షర భారత్ మండల, గ్రామ కోఆర్డినేటర్ల ఉద్యోగాలు ఊడగొట్టి వారి జీవితాలను రోడ్డు పాల్జేసిన ప్రభుత్వం.. ఎన్నికల సమయంలో వారిని ఆకట్టుకొనేందుకు ఉద్యోగాల్లేని వారికి శిక్షణ ఇస్తున్నట్లు మెమో ఒకటి విడుదల చేసింది. ఒకవైపు ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా తొలివిడతగా సాక్షర భారత్ ప్రొగ్రామ్ మండల కోఆర్డినేటర్లకు వారం పాటు శిక్షణ ఇవ్వాలంటూ వయోజన విద్యా శాఖ మెమో నంబర్ 600ను విడుదల చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పది జిల్లాల్లో శిక్షణ కార్యక్రమం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, వైఎస్సార్, అనంతçపురం, కర్నూలు జిల్లాల్లోని 502 మండలాల్లో అక్షరాస్యత పెంపొందించేందుకు 502 కోఆర్డినేటర్లతో పాటు దాదాపు 20 వేల మంది గ్రామ కోఆర్డినేటర్లు పనిచేసేవారు. ఆ చిరుద్యోగులను చంద్రబాబు ప్రభుత్వం గతేడాది మార్చి 31 నుంచి నిర్దాక్షిణ్యంగా తొలగిస్తూ సర్క్యులర్ జారీ చేసింది. అప్పట్లో ఆ ఉద్యోగులు ఆందోళన చేశారు. అయినా ప్రభుత్వ పెద్దలు పట్టించుకోలేదు. తమకు జరిగిన అన్యాయాన్ని ప్రతిపక్షనేత వైఎస్ జగన్ దృష్టికి వారు తీసుకెళ్లారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక న్యాయం చేస్తానంటూ ఆయన వారికి హామీ ఇచ్చారు. ఎన్నికల ముందు ప్రభుత్వం కొత్త డ్రామాకు తెర తీసింది. విధుల్లో నుంచి తొలగించిన మండల కో ఆర్డినేటర్లకు శిక్షణ ఇవ్వాలంటూ గత నెల 3న వయోజన విద్యా శాఖ ద్వారా మెమో జారీ చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘన.. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా పాలనా పరమైన ఉత్తర్వులు విడుదల చేయకూడదన్న నిబంధనలు ఉన్నాయి. అయితే కోడ్‌ను ఉల్లంఘిస్తూ వయోజన విద్యా శాఖ శిక్షణ ఇవ్వాలని మెమో జారీ చేయడం చర్చనీయాంశమైంది. శిక్షణ కోసం పది జిల్లాలోని మండల కోఆర్డినేటర్లకు టీఏ, డీఏ ద్వారా ప్రతిరోజు రూ. 200 చొప్పున మెమోలో పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు వివాదస్పద మెమో జారీచేయడంపై ఆ శాఖ వర్గాల్లోనే విమర్శలు వినిపిస్తున్నాయి. -
ఆందోళన విరమించిన సాక్షర భారత్ ఉద్యోగులు
విజయవాడ : రాష్ట్ర ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా విధుల నుంచి తొలగించడంతో ఆందోళన బాట పట్టిన సాక్షర భారత్ ఉద్యోగులు ఎట్టకేలకు తమ ఆందోళనలను విరమించారు. శుక్రవారం వారితో అధికారులు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. తమ సమస్యలు పరిష్కరించి,15 రోజుల్లో విధుల్లోకి తీసుకుంటామని అధికారులు హామీ ఇవ్వడంతోనే ఆందోళన విరమించామని, సాక్షర భారత్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి మీడియాకు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన ఈ హామీ ప్రకారం పదిహేను రోజుల్లో ఉద్యోగులను విధుల్లోకి తీసుకోకపోతే మంత్రుల ఇళ్లు ముట్టడిస్తామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. సాక్షర భారత్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తొలిగించినట్లు ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. వయోజనులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు ఉద్దేశించిన కేంద్ర ప్రభుత్వ సాక్షర భారత్ పథకంలో భాగంగా రాష్ట్రంలోని ‘ఏపీ స్టేట్ లిటరసీ మిషన్ అథారిటీ’ పరిధిలో పని చేస్తున్న 20,503 మంది జిల్లా, మండల, గ్రామ సమన్వయకర్తల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తూ.. వారిని విధుల నుంచి తొలగించిన విషయం తెలిసిందే. ఆ స్థానంలో అధికార పార్టీ కార్యకర్తలను నియమించి, వచ్చే ఎన్నికల్లో ప్రయోజనం పొందేలా వ్యూహం కూడా రచించింది. సాక్షర భారత్ ఉద్యోగులందరినీ తొలగించాలని వయోజన విద్యావిభాగం డైరెక్టర్‌ను ఆదేశిస్తూ జూన్ 1న రాష్ట్ర ప్రభుత్వం మెమో (నం.574896/ ప్రోగ్రాం–3/2017) జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్రంలోని సమన్వయకర్తలను విధుల నుంచి తొలగిస్తున్నట్లు వయోజన విద్యా విభాగం డైరక్టర్ ఎం.అమ్మాజీరావు జూన్ 14న సర్క్యులర్ మెమో (నెంబర్ 600) విడుదల చేశారు. అయితే ప్రభుత్వ నిర్ణయంపై మండిపడుతూ.. సాక్షర భారత్ ఉద్యోగులు గత కొన్ని రోజులుగా ఆందోళన చేపట్టారు. దీంతో రాజకీయంగా దుమారం రేగడంతో ప్రభుత్వం దిగొచ్చింది. -
అదే తీరు.. 9తోనే సరి
సాక్షి, చిత్తూరుఎడ్యుకేషన్ : ప్రజాసమస్యల పరిష్కారానికి ప్రతి మూడు నెలలకొకసారి జరిగే జెడ్పీ సర్వ సభ్య సమావేశం నిర్వహణలో తీరు మారలేదు. ఎప్పటి లాగే ప్రధాన అంశాలు చర్చకు రాలేదు. శనివారం స్థానిక అంబేడ్కర్ భవనంలో జెడ్పీ చైర్పర్సన్ గీర్వాణి అధ్యక్షతన జరిగిన జిల్లా పరి షత్ సర్వసభ్య సమావేశంలో చిన్న చిన్న సమస్యలపైనే చర్చించి, మమ అనిపించారు. సమావేశానికి పరిశ్రమలశాఖ మంత్రి అమరనాథరెడ్డి హాజరయ్యారు. ఎంపీ, టీడీపీ ఎమ్మెల్యేలు ఒక్కరు కూ డా సమావేశానికి కాకపోవడం గమనార్హం. ఇక జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు మాత్రం సమావేశానికి యథావిధిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో జేసీ గిరీషా, జెడ్పీ సీఈఓ రవికుమార్‌నాయుడు, ఏఓలు ప్రభాకర్‌రెడ్డి, వెంకటరత్నం, అధికారులు పాండురంగస్వామి, విజయకుమార్, రవిప్రకాష్‌రెడ్డి, కుర్మానాథ్, ఎమ్మెల్సీ గౌని వారి శ్రీనివాసులు, దొరబాబు, జిల్లా గ్రంథా లయ చైర్మన్ కన్నయ్యనాయుడు పాల్గొన్నారు. టీడీపీ జెడ్పీటీసీ సభ్యురాలి బైఠాయింపు జెడ్పీ పాలకవర్గం తమకు అనుకూలంగా ఉన్న వారికే నిధులు కేటాయిస్తోందని నాగలాపురం టీడీపీ జెడ్పీటీసీ సభ్యురాలు సుజాత సమావేశంలో స్టేజీ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. తాను బీసీ మహిళనని తనకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీసీ రోడ్లు, తదితర పనులను తమ మండలానికి కేటాయించడం లేదని తెలిపారు. తొమ్మిదింటితో సరిపెట్టేశారు జెడ్పీ సమావేశం ఉదయం 11.10 గం టలకు ప్రారంభమైంది. మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగిన ఈ సమావేశంలో టీడీపీ జెడ్పీటీసీ సభ్యుల కాంట్రాక్టులకు సంబంధించిన జీఎస్టీపై 45 నిమిషాలు గడిపేశారు. అనంతరం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు దేశాయ్ తిప్పారెడ్డి, సునీల్‌కుమార్, పుంగనూరు జెడ్పీటీసీ సభ్యుడు, వైఎస్సార్ సీపీ ఫ్లోర్‌లీడర్ వెంకటరెడ్డి యాదవ్ గళం విప్పారు. అజెండాలో 42 అంశాలు ఉండగా కేవలం 9 అం శాలపై మాత్రమే చర్చలు జరిపి తూతూ మం త్రంగా సభను ముగించేశారు. సాక్షరభారత్ రద్దుపై వాడివేడి చర్చ రాష్ట్ర ప్రభుత్వం సాక్షరభారత్పై కుట్రపన్ని ఆ కార్యక్రమాన్ని రద్దు చేసిందని పుంగనూరు జెడ్పీటీసీ సభ్యుడు వెంకటరెడ్డియాదవ్ ఆరోపించారు. దీనిపై మంత్రి అమరనాథరెడ్డి జోక్యం చేసుకుని ఆ నిర్ణయం తమది కాదని కేంద్రప్రభుత్వం రద్దు చేసిందని సమాధానమిచ్చారు. ఏ ఇతర రాష్ట్రాల్లో లేని రద్దు రాష్ట్రంలో మాత్రమే ఎందుకు విధించారని సభ్యులు ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరుకాకుండా ఇక్కడ మాట్లాడితే ఏం లాభముంటుందని మంత్రి అన్నారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డి మాట్లాడుతూ ‘నువ్వు వైఎస్సార్ సీపీ గుర్తుపై ఎమ్మెల్యేగా గెలిచి.. పార్టీ మారావు. నీవు మాకు నీతులు చెప్పడం ఏమిటి?.’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వైఎస్సార్ సీపీ, టీడీపీ జెడ్పీటీసీ సభ్యుల మధ్యవాదోపవాదాలు జరిగాయి. విద్యాశాఖపై సుదీర్ఘచర్చ అజెండాలో రెండో అంశమైన విద్యాశాఖపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ మధ్యాహ్నభోజన నిధులు విడుదల కావడం లేదని, విద్యాసంవత్సరం ప్రారంభమైనా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ అందించలేకపోయారన్నారు. ప్రభుత్వ సొమ్మును ఖర్చుపెట్టి ఇషా విద్యను నడపడం సబబు కాదన్నారు. రామసముద్రం జెడ్పీటీసీ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ జెడ్పీ పాఠశాల స్థలాలను ఎందుకు కాపాడుకోలేకపోతున్నారని ప్రశ్నించారు. ఎమ్మెల్యే సునీల్‌కుమార్ మా ట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయకనే దాన్ని టీడీపీ నాయకుల ఘనతగా పాఠ్యపుస్తకాల్లో ముద్రించాలనడం సరైన పద్ధతి కాదన్నారు. రైతులకు జిప్సం అందడంలేదు ఐరాల, పూతలపట్టు ప్రాంతాల్లో చాలా మంది రైతులకు జిప్సం అందడం లేదు. జిల్లా పరిషత్ సమావేశంలో ప్రజాసమస్యలపై మాట్లాడుతుంటే టీడీపీ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేయడం బాధాకరం. ప్రజా సమస్యలపై వారు చర్చించరు... మేము చర్చిస్తే విరుద్ధంగా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తారు. పాఠశాలల్లో కంప్యూటర్లు ఉన్నాయే గాని బోధించేందుకు టీచర్లు లేకపోవడం దారుణం. – సునీల్‌కుమార్, పూతలపట్టు ఎమ్మెల్యే మోడల్ స్కూళ్లలో అడ్మిషన్లు జరపడం లేదు మోడల్ స్కూళ్లల్లో పేద విద్యార్థులు చేరడానికి వెళుతుంటే అడ్మిషన్లు లేవని ప్రిన్సిపాళ్లు తిప్పి పంపుతున్నారు. 20 శాతం అధికంగా విద్యార్థులను చేర్చుకోవచ్చనన్న నిబంధన ఉన్నప్పటికీ అడ్మిషన్లు చేయడం లేదు. ఈ విషయంపై డీఈఓ మోడల్ స్కూల్ ప్రిన్సిపాళ్లకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాల్సిఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల కొరత ఉండడంతో పేద విద్యార్థులకు అన్యాయం జరుగుతోంది. – దేశాయ్ తిప్పారెడ్డి, మదనపల్లె ఎమ్మెల్యే ఫలితం దక్కడం లేదు ప్రతిసారీ సర్వసభ్య సమావేశానికి, స్థాయి సంఘ సమావేశాలకు హాజరవుతూనే ఉన్నాం. జెడ్పీకి ఎన్ని నిధులు వచ్చా యి... ఏఏ పనులకు ఖర్చు పె ట్టారు... అన్న వివరాలను చెప్పడం లేదు. పాఠశాలలో అదనపు తరగతులు అవసరమున్న చోట కట్టకుండా ప్రభుత్వ నిధులను వృథా చేస్తున్నారు. సర్వసభ్య సమావేశంలో ప్రజా సమస్యలపై చర్చిస్తున్నా ఫలితం దక్కడం లేదు. – వెంకటరెడ్డి యాదవ్, జెడ్పీటీసీ సభ్యుడు, పుంగనూరు -
రోడ్డున పడిన బతుకులు!
జాబ్ కావాలంటే బాబు రావాలన్నారు. ఇప్పుడు అదే చంద్రబాబు ఉన్న ఉద్యోగులను నిర్ధాక్షిణ్యంగా తొలగిస్తున్నారు. తాజాగా ప్రభుత్వం సాక్షరభారత్ పథకంలో ఎనిమిదేళ్ల నుంచి కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న మండల, గ్రామస్థాయికో ఆర్డినేటర్లను తొలగించి వారి కుటుంబాలను రోడ్డున పడేసింది. ఉన్నఫలంగా ఉద్యోగాల నుంచి తొలగించడంతో ఆ పథక సమన్వయ కర్తలు లబోదిబోమంటున్నారు. కోవెలకుంట్ల: 2010వ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం సాక్షరభారత్ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. గ్రామాల్లోని నిరాక్షరాస్యులైన వయోజనులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలన్నదే పథకం ఉద్దేశం. ఇందుకు గ్రామస్థాయి కో ఆర్డినేటర్ (వీసీఓ)లను నియమింంచారు. జిల్లాలో 53 మండలాల పరిధిలో 889 గ్రామ పంచాయితీలు ఉండగా గ్రామానికి ఇద్దరు చొప్పున నియమించారు. నిరక్షరాస్యులకు చదువు చెబుతున్నందుకు వీసీఓలకు నెలకు రూ. 2వేలు గౌరవ వేతనం కేటాయించారు. అభ్యాసకులకు చదువు చెప్పడంతోపాటు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వయెజన విద్యాకేంద్రాన్ని నిర్వహించాల్సి ఉంది. నెలల తరబడి గౌరవ వేతనం ఇవ్వకపోయినా వీసీఓలు ఊడిగం చేశారు. సాక్షరభారత్ పథకంతోపాటు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వారిని వివిధ ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రచార కార్యకర్తలుగా కూడా వినియోగించుకున్నారు. నిర్ధాక్షిణ్యంగా తొలగింపు: ఈ ఏడాది మార్చి నెలాఖరుతో ఏడవ విడత సాక్షరభారత్ కార్యక్రమం ముగియడంతో రాష్ట్ర వ్యాప్తంగా పథకం నిలిచిపోగా కర్నూలు జిల్లాలో మాత్రం కలెక్టర్ చొరవతో మరో మూడు నెలలు పొడిగించారు. ఈ మూడు నెలలు వీసీఓలు ఎలాంటి వేతనం ఆశించకుండా పనిచేసేందుకు ముందుకొచ్చారు. ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం సాక్షరభారత్ పథక ఎంసీఓలు, వీసీఓలను నిర్ధాక్షిణ్యంగా తొలగిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేయడంతో వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2010వ సంవత్సరం నుంచి పనిచేయించుకుని ఇప్పుడు ఎలాంటి కారణం లేకుండా తొలగించి తమ పొట్ట కొట్టారని వాపోతున్నారు. కొత్తవారిని తీసుకునే రాజకీయ ఎత్తుగడ: సాక్షరభారత్ పథకంలో పనిచేస్తున్న ఎంసీఓ, వీసీఓలను తొలగించి వారి స్థానాల్లో కొత్తవారిని ఎంపిక చేసుకునేందుకు సర్కార్ ఎత్తుగడ వేసినట్లు తెలుస్తోంది. గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకు పోస్టులు కట్టబెట్టి రానున్న ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు కుట్ర పన్నుతున్నట్లు అధికార వర్గాల సమాచారం. పనిచేస్తున్న వారిని తొలగించామన్న విమర్శ రాకుండా పథకాన్ని మార్పు చేసి ఎంసీఓ, వీసీఓల ఎంపికకు విద్యార్హత, వయస్సును పరిగణనలోకి తీసుకుని తమకు అనుకూలమైన వర్గాలకు కట్టబెట్టే ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. తొలగించడం అన్యాయం సాక్షరభారత్ పథకం ప్రారంభం నుంచి వీసీఓగా పనిచేస్తున్నాను. ఎనిమిది సంవత్సరాలపాటు పనిచేస్తే మమ్మల్ని తొలగించి అన్యాయం చేశారు. వందల మందికి చదువు నేర్పించి వారిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దితే ప్రభుత్వం మమ్నల్ని తొలగించి మా కుటుంబాలను రోడ్డున పడేసింది.– జర్మియ, ఎంసీఓ, దొర్నిపాడు -
చిరుద్యోగులపై పిడుగుపాటు
సాక్షి, అమరావతి: వయోజనులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు ఉద్దేశించిన కేంద్ర ప్రభుత్వ సాక్షర భారత్ పథకంలో భాగంగా రాష్ట్రంలోని ‘ఏపీ స్టేట్ లిటరసీ మిషన్ అథారిటీ’ పరిధిలో పని చేస్తున్న 20,503 మంది జిల్లా, మండల, గ్రామ సమన్వయకర్తల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా వ్యవహరించింది. వారిని విధుల నుంచి తొలగిం చింది. ఆ స్థానంలో అధికార పార్టీ కార్యకర్తలను నియమించి, వచ్చే ఎన్నికల్లో ప్రయోజనం పొందేలా వ్యూహం రచించింది. సాక్షర భారత్ ఉద్యోగులం దరినీ తొలగించాలని వయోజన విద్యావిభాగం డైరెక్టర్‌ను ఆదేశిస్తూ జూన్ 1న రాష్ట్ర ప్రభుత్వం మెమో (నం.574896/ ప్రోగ్రాం–3/2017) జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్రంలోని సమన్వయకర్తలను విధుల నుంచి తొలగిస్తున్నట్లు వయోజన విద్యా విభాగం డైరక్టర్ ఎం.అమ్మాజీరావు జూన్ 14న సర్క్యులర్ మెమో (నెంబర్ 600) విడుదల చేశారు. నిధులు కేంద్ర ప్రభుత్వానివే... సాక్షర భారత్ సమన్వయకర్తలు 15 ఏళ్లుగా తాత్కాలిక ప్రాతిపదికన పని చేస్తున్నారు. గ్రామ సమన్వయకర్తలకు నెలకు రూ.2,000, మండల, జిల్లా సమన్వయకర్తలకు రూ.6,000 చొప్పున గౌరవ వేతనం అందుతోంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధుల నుంచే రాష్ట్ర ప్రభుత్వం ఈ వేతనాలు చెల్లిస్తోంది. ఇన్నాళ్లూ అరకొర వేతనంతో జీవనం సాగించిన 20,503 మంది సమన్వయకర్తలపై రాష్ట్ర సర్కారు వేటు వేసింది. తొలగింపునకు గురైన సమన్వయకర్తల్లో 15 నుంచి 20 ఏళ్లకుపైగా సేవలందిస్తున్నవారు ఉన్నారు. తమకొచ్చే వేతనం అత్యంత స్వల్పమే అయినా ఏనాటికైనా పెరుగుతుందని ఆశగా ఎదురు చూస్తున్న వారిని ప్రభుత్వం ఒక్క కలం పోటుతో తొలగించింది. ఆంధ్రప్రదేశ్‌లో ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలు తప్ప మిగిలిన 10 జిల్లాల్లో సాక్షర భారత్ కార్యక్రమం అమలవుతోంది. నెలకు రూ.4.5 కోట్లు ఇవ్వలేరా? రాష్ట్రవ్యాప్తంగా 9,979 సాక్షర భారత్ కేంద్రాల్లో పనిచేస్తున్న 19,959 గ్రామ, 504 మంది మండల, 40 మంది జిల్లా సమన్వయకర్తలను తొలగించారు. విచిత్రం ఏమిటంటే ఈ ఉద్యోగులను మార్చి 31 నుంచి తొలగించేలా రాష్ట్ర ప్రభుత్వం జూన్ 1న ఆదేశాలు ఇవ్వగా, జూన్ 14న వయోజన విద్యా విభాగం డైరక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. మార్చి 31 నుంచి తొలగించినట్లు ఉత్తర్వులు ఇచ్చినా ఈ మూడు నెలల కాలంలో వీరితో ప్రభుత్వం పనులు చేయించుకుంది. వీరికి గతేడాది అక్టోబర్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు రూ.25 కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉంది. మార్చి 31 నుంచి విధుల నుంచి తొలగిస్తున్నట్లు మూడు రోజుల క్రితం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఏప్రిల్, మే నెలలతోపాటు జూన్‌లో పనిచేసిన రోజులకు వేతనాన్ని కోల్పోనున్నారు. మొత్తం బకాయిలు కలిపితే రూ.33 కోట్లు అవుతుంది. ఈ బకాయిలు ఇవ్వకుండా ప్రభుత్వం అకస్మాత్తుగా రోడ్డున పడేసింది. వేతనాల కోసం అడిగితే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాలేదని, తామేం చేయలేమని వయోజన విద్యా విభాగం అధికారులు చేతులెత్తేస్తున్నారు. కేంద్రం 2017 సెప్టెంబర్ వరకు రాష్ట్ర ప్రభుత్వానికి నిధులిచ్చింది. ఆయా నిధుల ఖర్చుకు సంబంధించిన వినియోగపత్రాలను(యూసీ)లను రాష్ట్రం సమర్పించలేదు. దీంతో కేంద్రం నుంచి నిధులు రావడం ఆగిపోయింది. సాక్షర భారత్ ఉద్యోగులందరికీ ఇచ్చే వేతనం నెలకు రూ.4.5 కోట్లు మాత్రమే. ప్రత్యేక విమానాల్లో విదేశీ యాత్రల కోసం రూ.వందల కోట్లు ఖర్చు పెడుతున్న పాలకులు తమకు అరకొర వేతనాలు సైతం ఇవ్వకుండా, విధుల నుంచి తొలగించడం ఏమిటని సాక్షర భారత్ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక టీడీపీ కార్యకర్తలే సమన్వయకర్తలు సాక్షర భారత్‌ను కేంద్రం నిధులు ఇవ్వకపోవడం వల్లే సమన్వయకర్తలను తొలగించామని అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం యూసీలు ఇవ్వనందువల్లే కేంద్రం నుంచి నిధులు రావడం లేదు. సాక్షర భారత్ అమలు కోసం కేంద్రం ఇచ్చిన సొమ్మును రాష్ట్ర సర్కారు దారి మళ్లించింది. ఈ సంగతి బయటపడుతుందనే భయంతోనే యూసీలు ఇవ్వకుండా జాప్యం చేస్తోంది. పొరుగున ఉన్న తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో సాక్షర భారత్ కార్యక్రమం యథాతథంగా కొనసాగుతోంది. కేంద్రం నిధులు విడుదల చేయకున్నా అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలే నిధులు సమకూరుస్తూ సమన్వయకర్తలకు వేతనాలు చెల్లిస్తున్నాయి. కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 8 నెలలుగా జీతాలు ఇవ్వకుండా మొండిచేయి చూపింది. ఏకంగా విధుల నుంచి తొలగించింది. ఈ వ్యవహారంలో టీడీపీ ప్రభుత్వ ఆంతర్యం మరోలా ఉన్నట్లు తెలుస్తోంది. తొలగింపునకు గురైన సాక్షర భారత్ సమన్వయకర్తల స్థానంలో అధికార పార్టీ కార్యకర్తలను నియమించి, వారికి ప్రభుత్వ ఖజానా నుంచి ప్రతినెల వేతనాలు చెల్లించేలా తెరవెనుక పావులు కదుపుతున్నట్లు సమాచారం. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాలను ప్రచారం చేసేందుకు, రానున్న ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా పనిచేసేందుకు వీరిని ఉపయోగించుకోనున్నట్లు తెలిసింది. అర్ధాంతరంగా తొలగిస్తే ఎలా బతకాలి? ‘‘సాక్షర భారత్ సమన్వయకర్తలతో ప్రభుత్వం చాలా ఏళ్లుగా పని చేయించుకుంటోంది. ఇప్పుడు అర్ధాంతరంగా విధుల నుంచి తొలగిస్తే వారి కుటుంబాలు ఎలా జీవించాలి? ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరించాలి. తొలగింపు ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలి. ఉద్యోగులకు వేతన బకాయిలు చెల్లించాలి. ఎప్పటిలాగే విధుల్లో కొనసాగించాలి’’ – విష్ణువర్దన్‌రెడ్డి, రాష్ట్ర సాక్షర భారత్ సమన్వయకర్తల సంఘం గౌరవాధ్యక్షుడు మమ్మల్ని ఆదుకోకపోతే పోరాటాలే శరణ్యం ‘‘రాష్ట్ర ప్రభుత్వం సాక్షర భారత్ సమన్వయకర్తల పట్ల దారుణంగా వ్యవహరించింది. ప్రభుత్వం అప్పగించిన విధులన్నీ నిర్వర్తించాం. 15–20 ఏళ్లుగా పని చేస్తున్న వేలాది మందిని తొలగించి రోడ్డున పడేయడం అన్యాయం. తొలగింపు ఉత్తర్వులను ఉపసంహరించుకొని, బకాయిలు చెల్లించి మమ్మల్ని ఆదుకోవాలి. లేకపోతే ఆందోళనలు, పోరాటాలకు దిగడం తప్ప మరో మార్గం లేదు’’ – సిద్ధారెడ్డి, అధ్యక్షుడు, రాష్ట్ర సాక్షర భారత్ సమన్వయకర్తల సంఘం అకస్మాత్తుగా తొలగించడం అన్యాయం ‘‘ప్రభుత్వం మాకు చెల్లించే వేతనాలు స్వల్పమే అయినా దీన్నే నమ్ముకొని చిత్తశుద్ధితో పని చేస్తున్నాం. సాక్షరతా కార్యక్రమాలతోపాటు ప్రభుత్వం అప్పగించే ఇతర విధులనూ నిర్వర్తిస్తున్నాం. గత ఏడాది అక్టోబర్ నుంచి వేతనాలు ఇవ్వకపోయినా పని చేస్తున్నాం. ఇప్పుడు అకస్మాత్తుగా తొలగిస్తున్నామని చెప్పడం అన్యాయం. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని మమ్మల్ని యథావిధిగా విధుల్లో కొనసాగించాలి. వేతన బకాయిలను వెంటనే చెల్లించాలి’’ – పీఎస్సార్ శాస్త్రి, రాష్ట్ర సాక్షర భారత్ సమన్వయకర్తల సంఘం కోశాధికారి గ్రామ స్థాయి సమన్వయకర్తలు 19,959 మండల స్థాయి సమన్వయకర్తలు 504 జిల్లా స్థాయి సమన్వయకర్తలు 40 నెలకు జీతాల ఖర్చు 4.5 కోట్లు -
‘ఆ మంత్రికి 10సార్లు ఫోన్ చేశా.. స్పందించలేదు’
సాక్షి, అమరావతి : రాష్ట్ర సాక్షర భారత్ పథకంలో పని చేస్తున్న 21వేల మంది ఉద్యోగులను ఒక లెటర్ ద్వారా తొలగించి వారిని రోడ్డున పడేసారని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ధ్వజమెత్తారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బాబు వస్తే జాబ్ అన్నారు.. 21వేల మందిని నిరుద్యోగులు చేశారని మండిపడ్డారు. ఉద్యోగాల నుంచి తొలగించిన వారికి భద్రత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాక వారిని తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలని విద్యాశాఖ మంత్రికి 10సార్లు ఫోన్ చేశామని తెలిపారు. అయిన ఈ విషయంపై వారు స్పందించలేదన్నారు. 21వేల ఉద్యోగుల ఉసురు తగులుతుందని విష్ణుకుమార్ రాజు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 24,470 మంది నిరుద్యోగులను మోసం చేసిందని బీజేపీ నేత విష్ణు వర్థన్ రెడ్డి మండిపడ్డారు. అంతేకాక ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు చీకటి రోజు అని ఆయన పేర్కొన్నారు. సాక్షర భారత్‌లో పని చేస్తున్న 21వేల మంది ఉద్యోగలను తొలగించారు.. 8ఏళ్ళుగా పనిచేస్తున్న వారిని ఉన్న ఫలంగా తీసేస్తే వారి పరిస్థితి ఏంటని ప్రభుత్వాన్ని ఆయన నిలదీశారు. వయోపరిమితి దాటిన వారికి అక్షరాలు నేర్పడం వారి పని.. కానీ వారితో ప్రభుత్వానికి సంబంధించిన పనులు చేయించుకున్నారని విమర్శించారు. ‘600మోమో కాపీని వారికి ఇవ్వకుండానే ఉద్యోగాల నుంచి తొలగించడం అన్యాయం. ఇది కూడా ప్రధాని నరేంద్ర మోదీ చేసిన పని అని చెప్పి విమర్శలు చేస్తారేమో. 21వేల మందిని తొలగించడం ప్రభుత్వంకు తెలుసో లేదో అర్ధం కావడం లేదు. రూ. 4కోట్ల రూపాయలు 21 వేలమంది ఉద్యోగులకు ప్రభుత్వం ఇవ్వలేదా? మానవతా దృక్పదంతో ఆలోచించి ప్రభుత్వం తక్షణమే స్పందించి మోమోని ఉపసంహరించుకోవాలని’ బీజేపీ నేత విష్ణు వర్థన్ రెడ్డి డిమాండ్ చేశారు. -
‘సాక్షర భారత్’ సమాప్తం!
అనంతపురం ఎడ్యుకేషన్: నిరక్షరాస్యులకు కనీస చదువు నేర్పాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన సాక్షరభారత్ మిషన్ పథకం కథ సమాప్తమైంది. మండల కోఆర్డినేటర్లు, గ్రామ కోఆర్డినేటర్లను తొలిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సాక్షర భారత్ మిషన్ గడువు ఈ ఏడాది మార్చి 31తో ముగిసిన నేపథ్యంలో అదే తేదీ నుంచి మండల, గ్రామ కోఆర్డినేటర్లను తొలిగిస్తున్నట్లు సాక్షరభారత్ మిషన్ డైరెక్టర్ అమ్మాజీరావు ఉత్తర్వులు జారీ చేశారు. మండలానికో కోఆర్డినేటర్‌తోపాటు ప్రతి పంచాయతీలో ఒకరిద్దరిని గ్రామ కోఆర్డినేటర్లను నియమించారు. ఈ క్రమంలో జిల్లాలో 60 మంది మండల కోఆర్డినేటర్లు, 1080 మంది గ్రామ కోఆర్డినేటర్లు పని చేస్తున్నారు. ఒక్కో గ్రామ కోఆర్డినేటర్ పరిధిలో ఐదుగురిని వలంటీర్లను ఏర్పాటు చేసి వారి ద్వారా నిరక్షరాసులకు చదువు నేర్పాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. మండల కోఆర్డినేటర్లకు రూ. 6 వేలు, గ్రామ కోఆర్డినేటర్లకు రూ. 2 వేలు వేతనం ఇస్తున్నారు. వస్తు సామగ్రి పాఠశాలల్లో అప్పగించాలి గ్రామ కోఆర్డినేటర్లకు ఇదివరకే ఫర్నిచర్, పుస్తకాలు తదితర వస్తువులను ప్రభుత్వం సరఫురా చేసింది. ఇవన్నీ ఆయా గ్రామ కోఆర్డినేటర్లు సమీపంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు అప్పగించి అక్నాలడ్జ్మెంట్ తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా జిల్లాలో 14 మంది సూపర్వైజర్లు పని చేస్తున్నారు. వీరంతా ప్రభుత్వ ఉపాధ్యాయులే. విద్యాశాఖ నుంచి సాక్షరభారత్ మిషన్‌కు బదిలీపై వచ్చారు. పథకం రద్దు కావడంతో వీరి పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. జీతాల బకాయి పేచీ మండల, గ్రామ కోఆర్డినేటర్ల జీతాల మంజూరుపై పేచీ నెలకొంది. వాస్తవానికి మార్చి 31 నాటికి గడువు ముగిసినా ఏప్రిల్, మే నెలల్లో కూడా వీరితో పని చేయించారు. ఇప్పుడేమో మార్చి 31 వరకు మాత్రమే జీతాలు (ఆర్నెళ్ల బకాయిలు) చెల్లించాలంటూ డైరెక్టరు ఉత్తర్వుల్లో పేర్కొనడంతో ఏప్రిల్, మే జీతాలపై కోఆర్డినేటర్లు ఆందోళన చెందుతున్నారు. పైగా కొనసాగిస్తామంటూ రెణ్నెళ్ల పాటు పని చేయించుకుని ఇప్పుడేమో తొలిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారంటూ వాపోతున్నారు. ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చాయి మార్చి 31 నాటికే సాక్షరభారత్ మిషన్ పథకం ముగిసింది. మండల, గ్రామ కోఆర్డినేటర్లను కొనసాగించేలా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించి వారిని అలాగే కొనసాగిస్తూ వచ్చాం. అయితే వారిని తొలిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా గ్రామ కోఆర్డినేటర్ల వద్ద ఉన్న వివిధ వస్తువులను సమీప పాఠశాలకు అప్పగించాలి. –ఉమాదేవి డీడీ సాక్షరభారత్ -
సాక్షర భారత్ కోఆర్డినేటర్ల నిరసన
కామారెడ్డి రూరల్: సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సాక్షరభారత్ గ్రామ, మండల కోఆర్డినేటర్ల ధీర్ఘకాల కామారెడ్డి కలెక్టరేట్ ఎదుట ధర్నాచౌక్ వద్ద చేపట్టిన రిలే నిరహార దీక్షలు మంగళవారం నాటికి రెండో రోజుకు చే రుకున్నాయి. కళ్లకు గంతలు కట్టుకుని తమ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం సాక్షరభారత్ కోఆర్డినేటర్ల జిల్లా అధ్యక్షుడు బత్తుల రవి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 8 సంవత్సరాల నుంచి చాలీచాలనీ వేతనాలు అందిస్తూ అవికూడా సంవత్సరాల కాలం పాటు చెల్లంచకుండా కోఆర్డినేటర్ల జీవితాలతో ఆడుకుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. అక్షరాస్యత అభివృద్ధి చెందకుండా బంగారు తెలంగాణ సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు అందించాలని దానిని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలన్నారు. ప్రభుత్వాలు తమకు న్యాయం చేసేంత వరకు ఉద్యమం కొనసాగిస్తామన్నారు. ప్రతిరోజు, రెండు మండలాల చొప్పున గ్రామ, మండల కోఆర్డినేటర్లు ఉద్యమాన్ని కొనసాగిస్తామన్నారు. తమ న్యాయమైన డిమాండ్లైన సాక్షరభారత్ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనసాగిస్తు కనీస వేతనం అమలు చేయాలని, ఉద్యోగభద్రత కల్పించాలని, çసమానవేతనం అందించాలని, వయోజనవిద్య, సాక్షరభారత్ కార్యక్రమాన్ని పంచాయితీరాజ్‌శాఖలో విలీనం చేయాలని వయోజన విద్యా కేంద్రాలను గ్రంథాలయాలుగా మార్చాలని డిమాండ్ చేశారు. మండల కోఆర్డినేటర్లు చంద్రశేఖర్, దత్తు, కామారెడ్డి, బిచ్కుంద మండలాలగ్రామకోఆర్డినేటర్లు పాల్గొన్నారు. -
నీరుగారుతున్న వయోజన విద్య
ముప్పాళ్ల: వయోజనులకు విద్య అందించాలనే లక్ష్యంతో సాక్షరభారత్ కార్యక్రమాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టాయి. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో నిరక్షరాస్యులైన వయోజనులకు, చదువు రాని వారికి ఉదయం, సాయంత్రం సమయాల్లో చదువు చెప్పే దిశగా 2010లో సాక్షరభారత్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆలోచనైతే బాగానే ఉంది కానీ ఆచరణలో మాత్రం అది అమలు కావటం లేదు. ఎప్పుడు కార్యక్రమం ఉంటుందో ఎప్పుడు తీసేస్తారో కోఆర్డినేటర్లకే అర్థం కాకుండా పోతోంది. ఈ కేంద్రాల్లో పనిచేసే మండల, గ్రామస్థాయి కో ఆర్డినేటర్లకు జీతాలు అందకపోవడంతో కేంద్రాల నిర్వహణ భారంగా మారింది. జీతం లేని కొలువు ఎన్నాళ్లు చేస్తామని పలువురు కోఆర్డినేటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారి విధులతో పాటుగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమల్లోనూ అదనపు విధులు నిర్వహిస్తుండటంతో మరింత భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు కార్యక్రమాన్ని కూడా ఎత్తివేసే ఆలోచనలో ప్రభుత్వాలు ఉండటం వయోజన విద్య మిథ్యగా మారిపోయింది. ఐదు నెలలుగా జీతాల కరువు.. జిల్లాలో మొత్తం 57 మండలాలకు గాను, 57 మంది మండల కోర్డినేటర్ లు, 1022 పంచాయతీలకు గాను ఒక్కో గ్రామానికి ఇద్దరు చొప్పున సాక్షరభారత్ కోఆర్డినేటర్లను నియమించారు. వీరిలో రాజకీయ కోణంలో కొన్ని చోట్ల ఖాళీలు అయినప్పటికీ వాటిని భర్తీ చేసిన దాఖలాలు లేవు. గ్రామ కోఆర్డినేటర్లు ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు విద్యాభోదన చేస్తారు. ఒక్కోసారి ప్రత్యేకంగా రెండు గంటల సమయం అదనంగా బోధనకు వెచ్చిస్తారు. మండల కోఆర్డినేటర్ జీతం నెలకు రూ.6 వేలు ఉండగా, గ్రామ కోఆర్డినేటరుకు రూ. 2 వేలు ప్రభుత్వం అందిస్తుంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో వీరికి గత ఏడాది డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు వేతనాలు అందడం లేదు. కొంతమంది కేవలం దీనిని నమ్ముకొనే ఉండటం వలన వారి భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. మరికొందరు చేసేదేమీ లేక అప్పులు తెచ్చుకొని ఇల్లు గడుపుకొంటున్న సందర్భాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ విద్యావంతులుగా మారే ఇలాంటి కార్యక్రమాలకు నిధులు మంజూరు చేయక పోవటం, జీతాలు సక్రమంగా చెల్లించక పోవటంతో కార్యక్రమంతో పాటు కోఆర్డినేటర్లు పరిస్థితి దయనీయంగా మారింది. ఉద్యోగ భద్రత కరువు ఐదు నెలలుగా వేతనాలు అందాల్సి ఉంది.అక్షరాస్యతతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాల నిర్వహణలో భాగంగా నిలుస్తున్నాం. అయినా మాకు ఉద్యోగ భద్రత లేదు. జీతాలు సకాలంలో రావడం లేదు. అధికారులు, పాలకులు స్పందించి జీతాలు విడుదల చేయాలి.–ఎం.బ్రహ్మానందం,సాక్షర్‌భారత్ మండల కో ఆర్డినేటర్ -
రాత్రిబడికి రాంరాం
ఖమ్మంకల్చరల్ : గ్రామాల్లోని నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చేందుకు కేంద్రప్రభుత్వం చేపట్టిన సాక్షరభారత్ పథకం (రాత్రి బడి)కి ఈనెల 31తో గడువు ముగుస్తుంది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో 1600 మంది సమన్వయకర్తలు పనిచేస్తున్నారు. పలు గ్రామాల్లో నిరక్షరాస్యులు రాత్రిబడికి రాకపోవడంతో కేంద్రాలను నెలల తరబడి తెరవని పరిస్థితి నెలకొంది. ఈనెల 31వ తేదీతో పథకం ముగియనుంది. ఇదే పేరుతో తిరిగి కొనసాగిస్తారా...? లేదా మూసివేస్తారా...? అనే అంశంపై తీవ్ర చర్చ జరుగుతోంది. గ్రామ, మండల సమన్వయకర్తలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కీలక భూమిక పోషిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 36 మండలాల్లో 631 గ్రామ పంచాయతీలు ఉండగా 36 మంది మండల సమన్వయకర్తలు, 1262 మంది గ్రామ సమన్వయకర్తలు పనిచేస్తున్నారు. ఖమ్మం జిల్లా పరిధిలో 427 గ్రామ పంచాయతీలు, భద్రాద్రి జిల్లాలో 204పంచాయతీలు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో అక్షరాస్యులు 14,33,894 మంది, నిరక్షరాస్యులు 3,99,153 మంది, ఖమ్మం జిల్లాలో అక్షరాస్యులు 8,32,320, కొత్తగూడెం జిల్లాలో 6,01,574 మంది ఉన్నారు. ఇక నిరక్షరాస్యులు ఖమ్మంలో 2,19,108 మంది, కొత్తగూడెం జిల్లాలో 1,80,045 మంది ఉన్నారు. లక్ష్యం చేరకముందే ముగిసే.. ప్రతి వ్యక్తి తనకుతాను సంతకం చేయడం, పత్రికలు, పుస్తకాలు చదివేలా చేయాలన్నదే సాక్షరభారత్ లక్ష్యం. గ్రామాల్లో స్త్రీ, పురుషుల వివరాలు సేకరించాలి. వారిలో చదువురాని వారిని గుర్తించి కేంద్రాలకు తీసుకొచ్చేందుకు ప్రోత్సహించాలి. గ్రామీణ ప్రాంతాల్లో వంత శాతం అక్షరాస్యత సాధించాలి. ప్రతి గ్రామంలో సాక్షర భారత్ కేంద్రాల ద్వారా స్త్రీలకు చదువు నేర్పాలి. అభ్యాసకుడికి పుస్తకం, నోట్‌బుక్ ,పెన్సిల్ ఇవ్వాలి. అయితే..పూర్తిస్థాయిలో ఇది లక్ష్యం చేరలేదు. వేతనాలు, కేంద్రాల నిర్వహణ బాధ్యతలను సర్పంచ్‌లు చూడాలి. కానీ స్థానిక ప్రజాప్రతినిధుల పర్యవేక్షణ కరువైంది. మూడు నెలలుగా వేతనాల్లేవ్.. ప్రతి గ్రామంలో ఇద్దరు గ్రామ సమన్వయకర్తలు ఉంటారు. ఒక్కొక్కరికీ రూ.రెండు వేలు, మండలానికి ఒక సమన్వయకర్త ఉండగా..రూ. 6 వేల చొప్పున వేతనాలు ఇవ్వాలి. మండల కోఆర్డినేటర్లకు టీఏ, డీఏలు నెలకు రూ. 500 అందిస్తారు. ఎంపీడీఓలు వీటిని మంజూరు చేస్తారు. అయితే గత మూడు నెలలు వీడి చెల్లింపులు నిలిచాయి. వేతనాలను అందజేయడంతో పాటు ఈ పథకం గడువు పెంచాలని వారు కోరుతున్నారు. పునరుద్ధరిస్తారనే నమ్మకముంది.. ఈనెల 31తో సాక్షరభారత్ గడువు ముగుస్తుంది. మరో సరికొత్త పేరు, ప్రణాళికతో ఈ పథకాన్ని కొనసాగిస్తారని భావిస్తున్నాం. ఇప్పుడు సాక్షరభారత్ కింద పనిచేస్తున్న సిబ్బందిని కొనసాగిస్తారా..? వేరే దేనికైనా బదాలయింపు చేస్తారా..? అనే విషయాలపై ఇంకా స్పష్టత లేదు. –ధనరాజ్, సాక్షరభారత్ డీడీ -
‘అక్షరం’రాలే..!
వయోజనులకు అక్షరాలు నేర్పించే సాక్షరభారత్ కేంద్రాల మూసివేత తప్పదా? సంపూర్ణ అక్ష్యరాస్యత సాధన కోసం 2010 సెప్టెంబర్ 8న కేంద్రప్రభుత్వం ప్రారంభించిన సాక్షరభారత్ మిషన్ గడువు 2015తోనే ముగిసింది. నిర్దేశిత లక్ష్యం సాధించలేదనే కారణంతో గతరెండేళ్లలో మూడుసార్లు దీని కాలపరిమితిని పొడిగిస్తూ వచ్చింది. ఇప్పుడు మరో ఐదురోజులే గడువు ఉండడంతో సర్కారు నేటికీ ఎలాంటి స్పష్టతనివ్వలేదు. దీంతో ఈనెల 31 తర్వాత అభ్యసన కేంద్రాల భవిష్యత్ ఏమిటనే దానిపై సర్వత్రా ఆందోళన నెలకొంది. సిరిసిల్ల: వేలిముద్రవేసే వారికి అక్షరాలు నేర్పించి అక్షరాస్యులగా తీర్చిదిద్దడమే సాక్షర భారత్ లక్ష్యం. 2009 సెప్టెంబరు 8న ప్రపంచ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా అప్పటి ప్రధాని మన్మోహన్సింగ్ సాక్షర భారత్ పథకం ప్రారంభించారు. క్షేత్రస్థాయిలో 2010 సెప్టెంబర్ 8న అభ్యసన కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లాలో గ్రామానికోటి చొప్పున 211 కేంద్రాలను నెలకొ ల్పారు. వీటి ద్వారా చదువుకున్న వయోజనులకు వి ద్యను నిరంతరం అందించడం, దినపత్రికలు, కథల పుస్తకాలు అందించి చదువు కొనసాగించడం ముఖ్య ఉద్దేశం. చదువురాని వారికి అక్షరాలు నేర్పించాలి. కానీ ప్రభుత్వ నిర్లక్ష్యం, సాక్షర భారత్ గ్రామ కో ఆర్డినేటర్ల అలసత్వంతో కేంద్రాలు మొక్కుబడిగానే సాగుతున్నా యి. ప్రతీ గ్రామంలో ఇద్దరు కో ఆర్డినేటర్లను నియమించారు. వీరికి నెలకు రూ.2000 వేతనం చెల్లిస్తున్నారు. మండలస్థాయిలో కో ఆర్డినేటర్లకు రూ.6000 వేతనం అందిస్తున్నారు. అయితే, 15 నెలలుగా వేతనాలు అందక కో ఆర్డినేటర్లు ఇబ్బందులు పడుతున్నారు. కొనసాగింపుపై సందిగ్ధం..! సాక్షర భారత్ కొనసాగింపుపై సందిగ్ధం ఉంది. దీని స్థానంలో కొత్త పథకం ప్రారంభించాలనే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉందని తెలుస్తోంది. వేతనాలు పెంచి సమర్ధవంతంగా పథకం నిర్వహించాలని భా విస్తున్నా.. ఎంత వేతనం ఇవ్వాలనే అంశంపై స్పష్టత లేదు. కొత్తజిల్లాలు ఏర్పాటైనా ఉమ్మడి జిల్లాలోనే నే టికీ ఈ పథకం నిర్వహణ సాగుతోంది. కొత్త మండలాల్లోనూ కేంద్రాల విభజన జరగలేదు. జెడ్పీ చైర్పర్సన్ అధ్యక్షతన, వయోజన విద్య డెప్యూటీ డైరెక్టర్ పర్యవేక్షణలో ఉండగా.. కొత్త జిల్లాలో పర్యవేక్షణ క రువైంది. వయోజనులు చదువుకునే సామాగ్రి కూడా సరఫరా కాలేదు. జిల్లాకు సూపర్వైజర్ రాంరెడ్డి వ్య వహరిస్తున్నా.. ఆయనఒక్కడే ఉండడంతో పనిఒత్తిడి పెరిగింది. జిల్లాలో ఆరు నెలలకోసారి ప్రారంభించా ల్సిన స్కీం(కొత్త బ్యాచ్)ల విషయంలోనూ నిర్లక్ష్యం చోటుచేసుకుంటోంది. నిజానికి జీతాలు సరిగా.. ఇవ్వకపోవడం.. పర్యవేక్షణ లోపంతో మొక్కు‘బడి’గా మారింది. కానీ చిత్తశుద్ధితో పనిచేస్తే.. క్షేత్రస్థాయిలో మంచిఫలితాలు రానున్నాయి. -
అక్షరంపై నిర్లక్ష్యం!
♦ ఓనమాలు నేర్చుకోని వయోజనులు ♦ చతికిలపడిన సాక్షర భారత్ ♦ నిధులు మంజూరు చేయని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ♦ జిల్లా అక్షరాస్యత శాతం 67.40 ♦ నేడు అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం అక్షరం ఆయుధం కన్నా గొప్పది. అక్షరం వ్యక్తికి ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. అభివృద్ధికి బాటలు వేస్తుంది. అయినా అక్షరంపై నిర్లక్ష్యం వీడడం లేదు. సమాజమంతా ఆన్లైన్ బాట పడుతున్నా, అ,ఆ,ఇ,ఈ అంటే తెలియని వారు ఎందరో ఉన్నారు. ఇంకా చాలా మంది వేలిముద్రలు వేస్తున్నారంటే మనమెక్కడ ఉన్నామో ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. అక్షరాస్యతపై లెక్కలు బాగానే ఉన్నా ఆర్థికంగా చేయూత లేకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. పాలకుల నిర్లక్ష్యం.. అధికారుల అలసత్వం.. నిరక్షరాస్యులకు అవగాహన లేవి.. వెరసి వేలిముద్రకు దారి తీస్తుంది. శుక్రవారం అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. బెల్లంకొండ : జిల్లాలో ఏ మండలంలో చూసినా అక్షరాస్యతా శాతం తగ్గుముఖం పడుతుంది. అధికారిక గణాంకాలు కేవలం పేపర్లకే పరిమితమవుతున్నాయి. 2020 నాటికి సంపూర్ణ అక్షరాస్యతా లక్ష్యంగా అట్టహాసంగా ప్రారంభమైన సాక్షర భారత్ కార్యక్రమం జిల్లాలో చతికిల పడింది. అధికారుల నిర్లక్ష్యానికి తోడుగా, రాష్ట్ర ప్రభుత్వం నిధుల మంజూరులో కోత వి«ధించడంతో కార్యక్రమం సజావుగా సాగడం లేదు. దీంతో వయోజనులు ఓనమాలు నేర్చుకోలేని పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో ఇదీ పరిస్థితి.. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో జనాభా 48,87,213గా ఉంది. ఇందులో పురుషులు 24,40,521 ఉండగా, స్త్రీలు 24,47,292 ఉన్నారు. అక్షరాస్యతా శాతం 67.40గా నమోదైంది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో జిల్లా అక్షరాస్యతా శాతం 7వ స్థానంలో ఉంది. 2010 సెప్టెంబర్ 22న జిల్లాలో సాక్షర భారత్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమం జిల్లాలో 57 మండలాల్లోని 712 గ్రామాల్లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా అన్ని గ్రామాల్లో 56,816 మందితో మొదటిగా అక్షరాలు దిద్దించారు. అయితే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం నిధుల మంజూరులో జాప్యం చేయడంతో నేడు వయోజన విద్యా కేంద్రాలు అలంకారప్రాయంగా మారాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే 2020 నాటికి సంపూర్ణ అక్షరాస్యతా మాట అటుంచితే అక్షరాస్యతలో 7 స్థానంలో ఉన్న జిల్లా అట్టడుగుకు చేరే ప్రమాదం ఉంది. వెనుకబడిన మహిళలు జిల్లాలో అక్షరాస్యతలో మహిళలు వెనుకబడి ఉన్నారు. 2001లో పురుషుల అక్షరాస్యత 71.24గా ఉండగా, మహిళల అక్షరాస్యత 53.74గా ఉంది. 2011లో పురుషుల అక్షరాస్యత 74.79 ఉండగా మహిళల అక్షరాస్యత 60.09 గా ఉంది. పురుషులతో పోలిస్తే మహిళలు అక్షరాస్యతలో 14.70 శాతం వెనుకబడి ఉన్నారు. నిధుల పంపిణీలో ప్రభుత్వం కొర్రీలు సాక్షర భారత్ నిర్వహణకు 75 శాతం కేంద్ర ప్రభుత్వం, 25 శాతం రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తున్నాయి. అయితే 2017–18కిగానూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని సంబంధిత అధికారులు చెబుతున్నారు. దీనికితోడు మండల స్థాయి, గ్రామ స్థాయిలో పనిచేసే కోఆర్డినేటర్లకు దాదాపుగా 11 నెలలుగా వేతనాలు చెల్లించడం లేదు. దీంతో వారు కేంద్రాల నిర్వహణకు శ్రద్ధ చూపడం లేదు. ఈ ఏడాది సాక్షర భారత్ ప్రోగ్రాంను ఎత్తేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందని ఉన్నతాధికారుల నుంచి కింది స్థాయి సిబ్బందికి సంకేతాలు వస్తున్నట్లు తెలిసింది. -
పుస్తకాలు వచ్చేశాయ్!
జిల్లాలకు పుస్తకాలు పంపిణీ చేస్తున్న వయోజన విద్యాశాఖ సాక్షి, హైదరాబాద్: సాక్షర భారత్ కార్యక్రమంలో కదలిక వచ్చింది. ఈ పథకం కింద జిల్లా కేంద్రాలకు పుస్తకాలు, మెటీరియల్ తదితరాలను రాష్ట్ర వయోజన విద్యా శాఖ చేరవేస్తోంది. కొంత కాలంగా ఈ పథకం నిలిచిన నేపథ్యంపై జూలై 31న సాక్షి ప్రధాన సంచికలో ‘అటకెక్కిన సాక్షర భారత్’కథనానికి యంత్రాంగం స్పందించి ఈ మేరకు చర్యలు చేపట్టింది. ఈనెల 20న ఎన్ఓఐఎస్ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్) పరీక్ష నిర్వహించనున్నట్లు ఆ శాఖ ప్రకటించింది. మరోవైపు పక్షం రోజుల్లో పరీక్షలుండగా... ఇంత ఆలస్యంగా పుస్తకాలు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం గమనార్హం. -
అటకెక్కిన ‘సాక్షర భారత్’!
♦ రెండేళ్లుగా నిధులు విడుదల చేయని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ♦ నిలిచిపోయిన కార్యక్రమాలు.. మూతబడుతున్న కేంద్రాలు సాక్షి, హైదరాబాద్: సాక్షర భారత్ కార్యక్రమంపై నీలినీడలు కమ్ముకున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు ప్రాజెక్టుకు రెండేళ్లుగా నిధులు విడుదల చేయక పోవడంతో అమలు చేయాల్సిన కార్యక్రమాలు నిలిచిపోయాయి. ఫలితంగా గ్రామస్థాయిలో సాక్షర భారత్ కేంద్రాలు దాదాపు మూతపడ్డాయి. నిరక్షరా స్యులైన వయోజనులకు కనీస విద్య అందించాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం సాక్షర భారత్‌ను 2010లో అమల్లోకి తెచ్చింది. ఇందుకు గ్రామస్థాయి లో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసి.. వాటి నిర్వహ ణకు గ్రామ సమన్వయకర్తలను నియమించారు. రాష్ట్రంలో 443 మండలాల్లో 17,500 కేంద్రాలు ప్రారంభించారు. గ్రామ స్థాయి సమన్వయకర్తలకు రూ.2 వేలు, మండల సమన్వయకర్తలకు రూ.6 వేల గౌరవ వేతనం ప్రక టించారు. ప్రాజెక్టుకు ని ధులు కేటాయించక పోవడంతో అనేక కేంద్రాలకు తాళం పడింది. మండల, గ్రామ సమన్వయకర్తలకు గౌరవ వేతనమూ అందక వారు విధులకు హాజర వడం లేదు. స్వయం సహాయక సంఘాలు, ఉపాధి హామీ కూలీల్లో ఎక్కువగా నిరక్షరాస్యులున్నారని, కాబట్టి కార్యక్రమాన్ని గ్రామీణాభివృద్ధి శాఖకు అనుసంధానం చేయాలని సమన్వయకర్తలు కోరు తున్నారు. వేతనాలు, కార్యక్రమం అమలుపై ప్రభు త్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఆందోళన చేస్తామని, ఆగస్టులో దీనికి కార్యాచరణ ప్రకటిస్తామని గ్రామ సమన్వయకర్తల సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శు లు సురేందర్, వెంకటయ్య పేర్కొన్నారు. -
అక్షరం నేర్పని సాక్షరం
నిజామాబాద్: అందరికీ అక్షరజ్ఞానం కలిగించాలన్న ప్రభుత్వ ఆశయం క్షేత్రస్థాయిలో నెరవేరడం లేదు. సాక్షర భారతి కార్యక్రమం ద్వారా అక్షరం నేర్పకున్నా రూ.లక్షల ప్రజాధనం వృథా అవుతుంది. క్షేత్ర స్థాయిలో అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోంది. అనేక మంది నిరక్షరాస్యులను విద్యాభ్యాసం నేర్పించి వారికి పరీక్షలు కూడా నిర్వహించి అక్షరాస్యులుగా మార్చినట్లు లెక్కలు చూపిస్తున్నా అవి కాకిలెక్కలే అవుతున్నాయి. వయోజన విద్యాశాఖలో పర్యవేక్షణకు తగినంత సిబ్బంది లేకపోవడం అలాగే గ్రామ సమన్వయకర్తల పోస్టులు ఖాళీగా ఉండటం వలన నిరక్షరాస్యులకు అక్షరజ్ఞానం కలిగించేవారు లేకుండా పోయారు. ఐదు దశలు పూర్తయినా ఇందూరు జిల్లా 70 శాతం అక్షరాస్యతను కూడా చేరుకోక పోవడం ఆందోళనను కలిగిస్తోంది. నేడు అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా జిల్లాలో సాక్షరభారతి అమలుపై ప్రత్యేక కథనం. ‘అక్షరం’ పేరిట రూ.లక్షలు ఖర్చు జిల్లాలో ఇప్పటివరకు పూర్తయిన ఐదు దశల్లో జిల్లా వ్యాప్తంగా 5,67,200 మంది వయోజనులను అక్షరాస్యులుగా చేయాలని లక్ష్యం విధించుకున్నారు. ఇప్పటి వరకు 3,90,909 మందిని అక్షరాస్యులుగా చేశామని లెక్కలు చెబుతున్నారు. ఈ గణాంకాల ప్రకారం ఒక్కరికి అక్షరజ్ఞానం కలిగించడానికి సగటున రూ.626 ఖర్చు చేశారు. అలాగే అక్షరజ్ఞానం కలిగిన వారిలో 20 శాతం చదువుకున్న వారికే అక్షరాలు నేర్పి లెక్కలు చూపారని క్షేత్ర స్థాయి సర్వేలు చెపుతున్నాయి. సిబ్బంది తగిన సంఖ్యలో లేక పర్యవేక్షణ లేకపోవడం కొన్ని గ్రామాల్లో వయోజనులకు కేంద్రాలు ఎక్కడ ఉన్నాయో తెలియక పోవడం, సమన్వయకర్తల పనితీరు బాగా లేకపోవడం వంటి కారణాలతో రూ.లక్షలు ఖర్చు అవుతున్న లక్ష్యం చేరడం లేదు. వయోజన శాఖలో పనిచేస్తున్న ఇంత మంది సిబ్బంది పరీక్షలు, పుస్తకాలు, పెన్నుల పేరుతో, సమన్వయకర్తలకు అందించిన జీతాలను ఇవ్వకుండా అందినకాడికి దండుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అక్షరాస్యత సాధన కోసం రూ.కోట్లు వెచ్చిస్తున్నా కొందరు అధికారుల నిర్లక్ష్యం, అక్రమాలు, అవినీతి ప్రభుత్వ ఆశయాన్ని నిర్వీర్యం చేస్తున్నాయి. ఖాళీగా 120 గ్రామ సమన్వయకర్తల పోస్టులు జిల్లాలో ప్రస్తుతం 718 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. గ్రామానికి ఇద్దరు సమన్వయకర్తల చొప్పున 1,436 మంది ఉండాలి. 18 మండలాల్లో 120 గ్రామ సమన్వయకర్తల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సమన్వయకర్తలు పనిచేస్తున్న గ్రామాల్లో కేంద్రాలు రోజు ఉదయం 7 నుంచి 9 గంటల వరకు.. సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు తెరిచి వయోజనులకు అక్షరజ్ఞానం కలిగించాలి. జిల్లాలో 75 శాతం కేంద్రాలు మూసి ఉంటున్నాయి. లక్షలు ఖర్చు చేస్తున్న నిధులు సరైన సమయంలో రాక సమన్వయకర్తల వేతనాలు ఆలస్యంగా ఇస్తున్నందువల్ల వారు నిర్వహిస్తున్న విధుల పైన నిర్లక్ష్యం చూపుతున్నారు. జిల్లాలో సాక్షరత కేంద్రాలను నిరంతరం పర్యవేక్షించుటకు సిబ్బంది లేకుండా పోయారు. అసలు రథసారధి అయిన ఉప సంచాలకులు పోస్టు ఖాళీగా ఉంది. అలాగే ప్రాజెక్టు అధికారి పోస్టు కూగా ఖాళీగా ఉంది. అలాగే పర్యవేక్షణ పోస్టులు 15 ఉండగా అన్ని పోస్టులు ఖాళీగా ఉండటం వల్ల కేంద్రాల నిర్వహణ అధ్వాన్నంగా తయారైంది. దీనికితోడు సహాయ ప్రాజెక్టు అధికారి పోస్టు ఒకటి ఖాళీగా ఉంది. అలాగే రెండు మండలాల్లో మండల సమన్వయకర్తలు లేక మండల సాక్షరభారతి లక్ష్యం కుంటుపడుతున్నది. ఆదర్శ కేంద్రాలలో పరిస్థితే అధ్వానం గతేడాది జిల్లాలో డివిజన్‌కు రెండు చొప్పున ఆరు ఆదర్శ వయోజన విద్యాకేంద్రాలు ప్రారంభించారు. నవీపేట మండలం పొతంగల్, బాల్కొండ మండలం నల్లూర్, నిజాంసాగర్ మండలం మహమ్మద్‌నగర్, బాన్సువాడ మండలం హన్మాజీపేట, కామారెడ్డి మండలం క్యాసంపల్లి, ఎల్లారెడ్డి మండలం లక్ష్మాపూర్‌లో ఆదర్శ వయోజన విద్యాకేంద్రాలు నెలకొల్పారు. ప్రతి కేంద్రానికి రూ. 2.30 లక్షలతో కంప్యూటర్, ఫర్నిచర్, ఇతర సామగ్రి సరఫరా చేశారు. ఆరు కేంద్రాలకు రూ.13.80 లక్షలు ఖర్చు చేసిన అన్ని మూలకు చేరాయి. చాలా కేంద్రాలలో అంతర్జాల సౌకర్యం లేక గ్రామంలోని యువకులకు, వయోజనులకు ఈ –లెర్నింగ్ కలగానే మిగిలింది. జిల్లాలో మూడేళ్ల క్రితం ఒక్క కేంద్రానికి రూ. 1400 విలువ గల ఒక బీరువ, కార్పెట్, కుర్చీలు, క్యారంబోర్డు, పూలజూదం, కంజర కైలాసం, చెస్‌బోర్డు, పచ్చిసు, కోలాటం, చైవిస్చక్కర తదితర ఆటవస్తువులు అందించారు. అలాగే రూ.4,986 విలువ గల 500 వందల కథల పుస్తకాలు, విజ్ఞాన పుస్తకాలు అందించారు. అవన్ని ప్రస్తుతం మూలకు చేరాయి. అయితే సమన్వయకర్తలు మాత్రం కేంద్రానికి రావడం లేదని వయోజనులు సమాధానం చెబుతున్నారు. ఐదు దశల్లో ఇలా.. 1వదశ(2010–11) 70,000 50,839 2,28,42,348 1,55,60,000 2వదశ(2011–12) 79,000 62,500 5,98,68,928 3,73,44,000 3వదశ(2012–13) 3,00,000 1,86,789 5,32,50,213 3,34,43,377 4వదశ(2013–14) 75,120 55,025 7,21,72,761 3,48,76,836 5వదశ(2014–15) 43,080 35,756 3,65,79,345 2,59,10,990 ––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––– 5,67,200 3,90,909 24,47,13,595 14,71,35,203 ––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––– -
‘సాక్షరం’ సగమే..!
మోర్తాడ్/బాల్కొండ : సంపూర్న అక్షరాస్యత సాధించేందుకు ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. తొలుత అక్షర కిరణం, తర్వాత నిరంతర విద్యా కేంద్రాల ద్వారా వయోజనులకు విద్య తదితర కార్యక్రమాలు నిర్వహించింది. ఆ తర్వాత సాక్షర భారత్‌ను ప్రారంభించింది. ఏడేళ్ల క్రితం ప్రారంభమైన ఈ మిషన్ ఐదు విడతలుగా కొనసాగింది. ఆరో విడతపై సందిగ్ధం నెలకొంది. అయితే, సాక్షరభారత్ కేంద్రాల నిర్వహణపై నిర్లక్ష్యం నెలకొనడంతో లక్ష్యానికి అనుగుణంగా అక్షరాస్యత శాతం వృద్ధి చెందడం లేదు. జిల్లాలో ఇప్పటికీ అక్షరాస్యత శాతం 61.25 శాతం మాత్రమే. ప్రాథమిక విద్యను నిర్బంధం చేయడంతో మైనర్లలో నిరక్షరాస్యత శాతం తగ్గింది. అయితే నిరక్ష్యరాసులలో ఎక్కువ మంది వయోజనులే ఉన్నారు. నిరక్షరాస్యుల్లో మహిళల సంఖ్య ఎక్కువగా ఉండగా, పురుషుల సంఖ్య తక్కువగా ఉంది. జిల్లాలో పురుషుల అక్షరాస్యత 71.47 శాతం కాగా, మహిళల్లో 51.54 శాతంగా నమోదైంది. మహిళల్లో అక్షరాస్యత శాతం తక్కువగా ఉండటంతో వారిలో అక్షరాస్యతను పెంచడానికి సాక్షరభారత్ ద్వారా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. ప్రతీ గ్రామంలో కేంద్రాలు ఏర్పాటు చేసి, నిరక్షరాస్యత శాతం తగ్గించాలని భావించారు. అక్షరాస్యతను పెంచేందుకు ప్రతి గ్రామానికి ఇద్దరు కో–ఆర్డినేటర్లను నియమించారు. ప్రతి కో–ఆర్డినేటర్ ఒక్కో దశలో కనీసం 50 మందికి చదువు చెప్పాల్సి ఉంది. కాగా రాత్రిపూట ఎక్కువ మంది టీవీలకు అతుక్కుపోవడం, పొద్దంతా పని చేసి అలసిపోయి ఉండటంతో నిరక్ష్యరాసులు చదువుపై ఆసక్తిని చూపలేక పోతున్నారు. నిరక్షరాస్యులకు అవగాహన కల్పించి, వారిని చదువుకొనేలా ప్రోత్సహించే ప్రయత్నాలు పెద్దగా కనిపించట్లేదు. దీంతో అక్షరాస్యత శాతం వృద్ధి చెందలేకపోతుంది. అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, విద్యావంతులు చొరవ తీసుకొని అవగాహన సదస్సులు నిర్వహిస్తే కొంతలో కొంతైనా మార్పు వచ్చే అవకాశముంది. సంపూర్ణ అక్షరాస్యత సాధన దిశగా ఇకనైనా చకచకా అడుగులు వేయాల్సి ఉంది. మండలాల వారీగా అక్షరాస్యత శాతం.. మండలం పురుషులు మహిళలు మొత్తం ఆర్మూర్ 78.39 57.84 67.87 బాల్కొండ 72.62 51.64 61.61 బాన్సువాడ 70.51 53.13 61.42 భీమ్‌గల్ 72.85 50.16 61.14 భిక్కనూర్ 70.42 47.16 58.47 బిచ్కుంద 63.53 43.29 53.36 బీర్కూర్ 63.02 42.23 52.28 బోధన్ 74.38 60.25 67.31 ధర్పల్లి 68.72 45.29 56.40 డిచ్పల్లి 71.44 49.88 60.29 దోమకొండ 71.86 48.16 59.74 గాంధారి 60.03 37.24 48.66 జక్రాన్‌పల్లి 72.93 48.98 60.49 జుక్కల్ 59.39 41.08 50.40 కామారెడ్డి 82.29 63.20 72.56 కమ్మర్పల్లి 68.12 45.23 56.29 కోటగిరి 65.60 49.02 57.10 లింగంపేట్ 60.92 37.30 48.68 మాచారెడ్డి 63.42 41.11 51.88 మద్నూర్ 65.99 47.48 56.85 మాక్లూర్ 71.81 48.06 59.31 మోర్తాడ్ 70.05 48.64 58.91 నాగిరెడ్డిపేట్ 62.89 38.65 50.16 నందిపేట్ 69.50 46.13 57.21 నవీపేట్ 69.36 49.85 59.38 నిజామాబాద్ 81.54 66.24 73.81 నిజాంసాగర్ 63.48 39.22 50.89 పిట్లం 59.87 40.68 50.09 రెంజల్ 67.64 51.95 59.73 సదాశివనగర్ 69.17 44.13 56.30 సిరికొండ 64.41 43.09 54.27 తాడ్వాయి 63.82 42.29 52.58 వేల్పూర్ 73.26 49.42 60.63 వర్ని 66.23 47.45 56.58 ఎడపల్లి 69.86 52.55 60.91 ఎల్లారెడ్డి 68.87 46.03 57.10 మొత్తం 71.47 51.54 61.25 నిర్వహణ గాలికి.. సాక్షర భారతి కేంద్రాల నిర్వహణ గాలికొదిలేశారు. జిల్లా వ్యాప్తంగా 718 వయోజన కేంద్రాలు ఉన్నాయి. 1436 గ్రామ కో–ఆర్డినేటర్లు, 36 మంది మండల కో–ఆర్డినేటర్లు ఉన్నారు. రెండేళ్లుగా కేంద్రాల నిర్వహణకు చిల్లీ గవ్వ కూడా విదిల్చలేదు. వయోజన కేంద్రాల్లో నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దే క్రమంలో న్యూస్ పేపర్ తప్పకుండా వేయించాలి. అయితే, రెండున్నరేళ్లుగా ప్రభుత్వం పేపర్ బిల్లు చెల్లించట్లేదు. దీంతో చాలాచోట్ల పేపర్ వేయించడమే మానేశారు. మరోవైపు కో–ఆర్డినేటర్లకు గతేడాది అక్టోబర్ నుంచి వేతనాలు ఇవ్వలేదు. వేతనాలు రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కో–ఆర్డినేటర్లపైనే కేంద్రాల నిర్వహణ భారం పడడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. అన్నింటిలో వినియోగించుకుంటూ.. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అన్ని సంక్షేమ పథకాల అమలులో సాక్షర భారతి గ్రామ కో–ఆర్డినేటర్లను వినియోగించుకుంటున్నారు. జీవో నెం.203 ప్రకారం సాక్షర భారతి కో–ఆర్డినేటర్లు పూర్తి స్థాయి కాంట్రాక్ట్ పద్ధతి ఉద్యోగులు అని పేర్కొన్నారు. కానీ, వారికి కాంట్రాక్ట్ ఉద్యోగులకు వర్తించేవి ఏవీ కూడా అమలు చేయడం లేదు. హరితాహరంలో ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువగానే వీరినే వినియోగించుకున్నారు కానీ ఎలాంటి గుర్తింపు నివ్వలేదు. ‘ఆరో విడత’పై సందిగ్ధం సాక్షర భారతి ఆధ్వర్యంలో ఇప్పటివరకు ఐదు విడతలుగా కార్యక్రమాలు నిర్వహించారు. 6వ విడత కోసం నిరక్షరాస్యుల జాబితా సిద్ధం చేశారు. కానీ పుస్తకాల పంపిణీ కాని, నిర్వహణ కానీ లేకపోవడంతో ఇప్పటివరకు ప్రారంభం కాలేదు. ప్రారంభమవుతుందో.. లేదో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. వేతనాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న కో–ఆర్డినేటర్లు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 15న నుంచి సమ్మె నిర్వహించాలని నిర్ణయించారు. మండలాల వారీగా తిరుగుతు కో–ఆర్డినేటర్లతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి సాక్షరభారతి కేంద్రాల నిర్వహణతో పాటు తమ సమస్యలను పరిష్కరించాలని కో–ఆర్డినేటర్ల డిమాండ్ చేస్తున్నారు. 11 నెలల వేతనాలు రాలేదు.. 11 నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదు. దీంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. గ్రామ కో–ఆర్డినేటర్ల కు ఎలాంటి పని చెప్పలేక పోతున్నాం. వెంటనే వేతనాలు మంజూరు చేయాలి. – శ్రీనివాస్, కో–ఆర్డినేటర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు వచ్చినవి విడుదల చేయట్లేదు.. 11 నెలల వేతానల్లో రెండు నెలల వేతనాలు మంజూరయ్యాయి. కానీ ఆ వేతనాలు కూడా ఇప్పటి వరకు విడుదల చేయలేదు. అసలు చెల్లిస్తారో లేదో కూడా తెలియడం లేదు. – శ్రీధర్, ప్రధాన కార్యదర్శి కాంట్రాక్ట్ ఉద్యోగులుగా గుర్తించట్లేదు సాక్షర భారతి కో–ఆర్డినేటర్లను పూర్తి స్థాయి కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పేర్కొన్నారు. కానీ ఇప్పటివరకు ఎలాంటి గుర్తింపు ఇవ్వడం లేదు. అన్ని పథకాల అమలులో మా సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకుంటున్నారు. – శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు