నేరెళ్ల ఘటనపై మావోయిస్టు పార్టీ
రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్
సాక్షి, హైదరాబాద్: ఇసుక మాఫియాకు వ్యతిరేకంగా నేరెళ్ల గ్రామ ప్రజలు, దాని చుట్టు పక్కల గ్రామాల ప్రజలు చేస్తున్న పోరాటానికి మావోయిస్టు పార్టీ సంపూర్ణ మద్దతిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ పేర్కొన్నారు. మాఫియాకు వ్యతిరేకంగా మరింత ధైర్యంగా పోరాటాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు. వనరుల పరిరక్షణ ఉద్యమంలో నేరెళ్ల ప్రజల పోరాటం తెలంగాణ ప్రజలందరికీ ఆదర్శం అవుతుందని శుక్ర వారం ఓ లేఖలో పేర్కొన్నారు.
కోస్తాంధ్ర పెట్టుబడి దారులు కరీంనగర్, వరంగల్ జిల్లాల్లోని కొండలు, గుట్టలు, గోదావరి ఇసుకను తరలించి వేల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. ఈ రెండు జిల్లాల్లోని కొందరు ఎమ్మెల్యేలు, వాళ్ల కుటుంబాలు ఇసుక మాఫియా నడుపుతున్నారని, వీళ్లందరికీ నాయ కుడు మంత్రి కేటీఆర్ అని దుయ్యబట్టారు. వనరులను తరలించడానికి టీఆర్‌ఎస్ మాఫియాను తయారు చేసిందన్నారు. ఆ మాఫియాను అడ్డుకుంటున్న ప్రజలను బెదిరింపులకు గురిచేయడమే కాకుండా యాక్సిడెంట్ల పేరుతో హత్యలు చేస్తున్నారని ఆరోపించారు.
అదే ధైర్యంతో ఉద్యమించండి
Published Sat, Aug 5 2017 1:26 AM | Last Updated on Wed, Aug 8 2018 5:51 PM
Advertisement
Advertisement