'రాజకుమారుడు విహారయాత్రకు వచ్చి వెళ్లిపోయాడు'
నిజామాబాద్: రాజకుమారుడు విహారయాత్రకు వచ్చి వెళ్లిపోయాడంటూ' కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీని ఉద్దేశించి నిజామాబాద్ టీఆర్ఎస్ ఎంపీ కవిత సోమవారం వ్యాఖ్యలు చేశారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శించేందుకు రాహుల్‌గాంధీ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎంపీ కవిత రాహుల్ను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది.
అలాగే నిజాం షుగర్ ఫ్యాక్టరీ విషయమై ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. ప్రభుత్వపరం చేసేందుకు సర్కారు చర్యలు తీసుకోనున్నట్టు చెప్పారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ కార్మికులను కూడా పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చారు. త్వరలో నిజామాబాద్ జిల్లాలో పసుపు పార్క్ ఏర్పాటు చేస్తామని ఎంపీ కవిత పేర్కొన్నారు.