పార్టీలో చేరిన వారిని ఆహ్వానిస్తున్న ఎంపీ పొంగులేటి
సాక్షి, మధిర: రాయపట్నం గ్రామంలో వివిధ పార్టీలకు చెందిన 40 కుటుంబాల వారు ఆదివారం టీఆర్‌ఎస్‌లోకి చేరారు. వారికి ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గులాబీ కండువాలు కప్పి టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు. దూళిపాళ్ల వీరయ్యచౌదరి, జానీ, మస్తాన్, సైదులు, తేళ్ల మోహన్‌రావు, నర్సింహారావు, ఎడ్ల పూర్ణయ్య, రాయల సాంబయ్య తదితరులు టీఆర్‌ఎస్‌లోకి చేరారు. తేళ్ల కొండ, తేళ్ల వాసు, దూళిపాళ్ల వీరయ్యచౌదరి ఆధ్వర్యంలో ఎంపీ పొంగులేటికి పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. అర్చకుల వేదమంత్రోచ్ఛారణల మధ్య, కోలాట నృత్యాలతో పొంగులేటిని ఘనంగా గ్రామంలోకి ఆహ్వానించారు. అనంతరం పొంగులేటిని భారీ గజమాలతో సన్మానించారు. ఆ తరువాత గ్రామంలో రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ... టీఆర్‌ఎస్ పార్టీని నమ్మినవారికి ఎప్పుడూ అన్యాయం జరగదని, ప్రతిఒక్కరికీ తాను అండగా ఉంటానని చెప్పారు. కేసీఆర్ నాయకత్వంలో జిల్లా అత్యంత వేగంగా అభివృద్ధి చెందిందని, కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేశానని తెలిపారు. డప్పు వాయిద్యాలతో, మేళతాళాలతో రాయపట్నం గ్రామప్రజలు ఎంపీ పొంగులేటికి బ్రహ్మరథం పట్టారు. కార్యక్రమంలో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, జిల్లా రైతుసమన్వయ సమితి అధ్యక్షులు నల్లమల వెంకటేశ్వరరావు, అయిలూరి వెంకటేశ్వరరెడ్డి, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చావా రామకృష్ణ, టీఆర్‌ఎస్ మండల, పట్టణ అధ్యక్షులు దొండపాటి వెంకటేశ్వరరావు, దేవిశెట్టి రంగారావు, చీదిరాల వెంకటేశ్వర్లు, కోనా జగదీష్, ఈదర సుబ్బారావు, కనుమూరి వెంకటేశ్వరరావు, రావూరి శ్రీనివాసరావు, అలివేలు ఉమామహేశ్వరరెడ్డి, చావలి రామరాజు, కట్టా గోవిందరాజు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment