సీఎం కేసీఆర్‌తో మాట్లాడతా | MP Ponguleti Srinivas Reddy district tour | Sakshi
Sakshi News home page

సీఎం కేసీఆర్‌తో మాట్లాడతా

Published Fri, Feb 13 2015 7:10 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM

సీఎం కేసీఆర్‌తో మాట్లాడతా - Sakshi

సీఎం కేసీఆర్‌తో మాట్లాడతా

అర్హులందరికీ రుణమాఫీ కోసం..
ఎంపీ, వైఎస్‌ఆర్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి

తక్కెళ్లపాడు (ఎర్రుపాలెం): అర్హులైన రైతులందరికీ రుణ మాఫీ కోసం సీఎం కేసీఆర్‌తో మాట్లాడతానని ఎంపీ, వైఎస్‌ఆర్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. తక్కెళ్ళపాడు గ్రామంలోని సొసైటీ కార్యాలయంలో గురువారం పొంగులేటిని రైతులు కలిసి, తమకు అర్హత ఉన్నప్పటికీ రుణమాఫీ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి ఎంపీ స్పందిస్తూ..

రాష్ట్రంలో చాలామంది అర్హులైన రైతులకు రుణం మాఫీ కాలేదని అన్నారు. దీనిపై త్వరలో సీఎం కేసీఆర్‌తో చర్చిస్తానన్నారు. తక్కెళ్ళపాడు గ్రామ సమీపంలో కట్లేరు కాల్వను కొందరు పూడ్చివేయడంతో తమ పొలాలకు నీళ్లు రావడం లేదని రైతులు ఫిర్యాదు చేశారు.సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానిని ఎంపీ చెప్పారు. అంగన్‌వాడీ భవన నిర్మాణ స్థల వివాదాన్ని పరిష్కరిస్తానన్నారు. పొంగులేటిని తక్కెళ్ళపాడు సొసైటీ కార్యాలయంలో రైతులు ఘనంగా సన్మానించారు. రామన్నపాలెం గ్రామంలో ఇటీవల మృతిచెందిన పార్టీ నాయకురాలు గుర్రాల లక్ష్మమ్మ వర్ధంతి సభలో ఆయన పాల్గొన్నారు. ఆమె చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
 
ఈ కార్యక్రమాలలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి అయిలూరి వెంకటేశ్వరరెడ్డి, మండల కన్వీనర్-జడ్పీటీసీ సభ్యుడు అంకసాల శ్రీనివాసరావు, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు  లక్కిరెడ్డి నర్సిరెడ్డి, మండల మహిళా కన్వీనర్ వేమిరెడ్డి త్రివేణి, సర్పంచులు శీలం లక్ష్మి, కర్నాటి వెంకటేశ్వరరెడ్డి, ఎంపీటీసీ సభ్యురాలు శీలం అక్కమ్మ తదితరులు పాల్గొన్నారు.
 
దళిత క్రిస్టియన్ల సమస్యలపై గళం విప్పుతా

వైరా: దళిత క్రిస్టియన్ల సమస్యలపై పార్లమెంటులో గళం విప్పుతానని ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. వైరా జూనియర్ కళాశాల ఆవరణలో గురువవారం రాత్రి సువార్త మహాసభలో మాట్లాడారు. దళిత క్రిస్టియన్ల సమస్యలపై పార్లమెంటులో ఇప్పటికే పలుమార్లు మాట్లాడినట్టు చెప్పారు. వీటి పరిష్కారానికిగాను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడతానన్నారు. ‘మీ ప్రార్థనలలో జగనన్న కుటుంబాన్ని, నన్ను గుర్తుంచుకోండి’ అని కోరారు.

పొంగులేటిని కృపా పెంతికోస్తు మినిస్ట్రీస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పాస్టర్ ఎస్ యోహాన్ దంపతులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో వైఎస్‌ఆర్ సీపీ వైరా నియోజకవర్గ కన్వీనర్ బొర్రా రాజశేఖర్, మండల కన్వీనర్ సూతగాని జైపాల్, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఎండి.ముస్తాపా, జిల్లా అధికార ప్రతినిధి ఎం.నిరంజన్‌రెడ్డి, గుండ్రాతిమడుగు సర్పంచ్ అప్పం సురేష్, పాస్టర్లు ఇర్మియాజాన్, పౌల్, ఏసుదాస్, ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement