జిల్లా నీటి యాజమాన్య సంస్థ(డ్వామా) ప్రాజెక్ట్ డెరైక్టర్‌గా ఎన్.సునందరాణిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
మహబూబ్‌న గర్ వ్యవసాయం: జిల్లా నీటి యాజమాన్య సంస్థ(డ్వామా) ప్రాజెక్ట్ డెరైక్టర్‌గా ఎన్.సునందరాణిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు మంగళవారం జీఓ ఆర్టీ నెం.262 ద్వారా బదిలీ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
నల్గొండ జిల్లా డ్వామా పీడీగా పనిచేస్తున్న ఆమె గత కొద్ది కాలంగా సెలవులో ఉన్నారు. గతనెల 18న విధుల్లో చేరడంతో జిల్లాకు బదిలీచేశారు. గ తంలో జిల్లా డ్వా మా పీడీగా పనిచేసిన హరిత రాష్ట్ర మీసేవా విభాగం డెరైక్టర్‌గా బదిలీపై వెళ్లిన విషయం విధితమే.దీంతో అప్పటి నుంచి డ్వామా పీడీగా జిల్లా పంచాయతీ అధికారి రవీందర్ అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.