బీజేపీ కొత్త కార్యవర్గంపై నాగం గుస్సా! | nagam janardhan reddy serious on party body | Sakshi
Sakshi News home page

బీజేపీ కొత్త కార్యవర్గంపై నాగం గుస్సా!

Published Tue, Oct 28 2014 12:24 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

బీజేపీ కొత్త కార్యవర్గంపై నాగం గుస్సా! - Sakshi

బీజేపీ కొత్త కార్యవర్గంపై నాగం గుస్సా!

బీజేపీ కొత్త కార్యవర్గం కూర్పుపై ఆ పార్టీ నాయకుడు నాగం జనార్దనరెడ్డి మండిపడుతున్నారు. కేవలం ఒక్క ఏడాది కోసం వేసిన కమిటీలో కూడా తనవాళ్లకు చోటు లభించలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సామాజిక కూర్పు విషయంలో కూడా సరైన న్యాయం జరగలేదని, కేవలం అగ్రవర్ణాలకే కీలక పదవులు అప్పజెప్పారు తప్ప.. బీసీలు, ఎస్సీలను సరిగా పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు.

ఈ వ్యవహారంపై నాగం జనార్దనరెడ్డి అనుచరులు కూడా గుర్రుగా ఉన్నారు. తమకు కచ్చితంగా రావాల్సిన పదవులు కూడా రాలేదని అంటున్నారు. ఇటీవలి ఎన్నికల్లో నాగం ఓడిపోవడంతో ఆయన్ను పక్కన పెట్టాలనే ఇలా చేస్తున్నారన్నారు. రాష్ట్ర కమిటీలో చోటు లభించకుండా వేరే ఏమిచ్చినా ఎందుకని వాళ్లు అడుగుతున్నారు. అయినా తాము పార్టీలోనే ఉంటామని, పార్టీ కోసం కష్టపడతామని చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement