
రోత పుట్టిస్తున్న ఫిరాయింపులు: నాగం
తెలంగాణలో ఎమ్మెల్యేలు పార్టీలు మారుతున్న తీరును బీజేపీ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి తప్పుబట్టారు.
హైదరాబాద్: తెలంగాణలో ఎమ్మెల్యేలు పార్టీలు మారుతున్న తీరును బీజేపీ నాయకుడు నాగం జనార్దనరెడ్డి తప్పుబట్టారు. జంపింగ్ ల వ్యవహారం రోత పుట్టింస్తోందని దుయ్యబట్టారు. బీజేపీ నుంచి టీఆర్ఎస్ లోక ఎవరూ వెళ్లరని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
పార్టీ ఫిరాయింపులకు సీఎం క్యాంపు కార్యాలయం కేంద్రం కావడం దురదృష్టకరమన్నారు. టీఆర్ఎస్ సర్కారు పరిపాలనను గాలికొదిలేసిందన్నారు. రైతు ఆత్మహత్యలు, కరెంట్ కష్టాలు మరిచి పార్టీపైనే అధికార నేతలు దృష్టి పెట్టారని ఆరోపించారు. స్పీకర్ జోక్యం చేసుకుని రాజ్యాంగాన్ని రక్షించాలని నాగం జనార్దనరెడ్డి కోరారు.