బుధవారం రాత్రి దుండగుల కాల్పుల్లో గాయపడ్డ పోలీసులను తెలంగాణ హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి పరామర్శించారు.
హైదరాబాద్: బుధవారం రాత్రి దుండగుల కాల్పుల్లో గాయపడ్డ పోలీసులను తెలంగాణ హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి పరామర్శించారు. గురువారం ఉదయం ఆయన కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పోలీసులను నాయిని పరామర్శించారు.
నల్లగొండ జిల్లా సూర్యాపేట హైటెక్ బస్టాండ్‌లో బుధవారం రాత్రి 11 గంటల తర్వాత కాల్పులు చోటుచేసుకున్నాయి. వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులపై కొందరు దుండగులు నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారు. దాంతో కానిస్టేబుల్ లింగయ్యతో పాటు హోంగార్డు మహేశ్ అక్కడికక్కడే మృతిచెందాడన్న విషయం తెలిసిందే.