Suryapet bus stand
-
ముష్కర దాడికి ఏడాది
‘పేట’లో భద్రత డొల్ల..! హైటెక్ బస్టాండ్‌లో కానరాని పోలీస్ ఔట్‌పోస్టు.. నేతల హామీలు ప్రకటనలకే పరిమితం పనిచేయని సీసీ కెమెరాలు.. అత్యాధునిక ఆయుధాలు కరువు.. సరిగ్గా ఏడాది క్రితం.. ఏప్రిల్ 1వ తేదీన అర్ధరాత్రి సూర్యాపేట హైటెక్ బస్టాండ్‌లో సీఐ మొగిలయ్య ఆధ్వర్యంలో పోలీసులు తని ఖీలు చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ముగ్గురు వ్యక్తులు పోలీసులకు అనుమానాస్పదంగా కనిపించారు. వారిని కిందికి దించి విచారిస్తుండగా ఒక్కసారిగా బుల్లెట్ల వర్షం కురిపించారు. పోలీసులు తేరుకునే లోపే కానిస్టేబుల్ లింగయ్య, హోంగార్డు మహేష్ నేలకొరగగా.. సీఐ వై.మొగలయ్య, మరో హోంగార్డు కిషోర్ తీవ్రంగా గాయపడ్డారు. ముష్కర మూక దాడికి ఏడాది పూర్తయిన సూర్యాపేటలో భద్రత డొల్లగానే మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. - సూర్యాపేట రెండు రాష్ట్రాలను కలుపుతూ.. అత్యంత రద్దీగా ఉండే 65వ నంబర్ జాతీయ రహదారిపై ఉన్న ప్రముఖ పట్టణాల్లో సూర్యాపేట హైటెక్ బస్టాండ్ పేరుగాంచింది.ఈ బస్టాండ్‌కు నిత్యం వేలాది బస్సులు వచ్చిపోతుంటాయి.. లక్షలాది మంది ప్రయాణికులు బస్సుల్లో ప్రయాణిస్తుంటారు. ముష్కరులు దాడి చేసి పరారైన వెంటనే పోలీసులు ఉన్నతాధికారులు, హోంశాఖామంత్రి, మంత్రులు బస్టాండ్‌ను సందర్శించారు. అదే సమయంలో పేటలో, హైటెక్‌బస్టాండ్ ఆవరణలో పకడ్బందీగా పోలీస్ బందోబస్తును ఏర్పాటుచేయడంతో పాటు పోలీసులకు అత్యాధునిక ఆయుధాలను కూడా అందజేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఆ హామీ నేటికీ ప్రకటనలకే పరిమితమైంది. సూర్యాపేట పట్టణంలో కట్టుదిట్టమైన పోలీసు భద్రత కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. జాతీయస్థాయిలో చర్చించుకునే విధంగా ఈ ఘటన సూర్యాపేటలో చోటుచేసుకున్నప్పటికీ హైటెక్ బస్టాండ్‌లో నిఘా కరువైంది. వామ్మో.. హైటెక్ బస్టాండా.. సూర్యాపేట హైటెక్ బస్టాండ్ అంటే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితం. అలాంటి బస్టాండ్‌కు ప్రతిరోజు వేలాది బస్సులతో పాటు లక్షల్లో ప్రయాణికులు ప్రయాణం చేస్తుంటారు. బస్టాండ్ బయటి నుంచి మొదలుకుని ఆవరణలో సైతం పోలీసులు నిరంతరం ప్రయాణికులకు భద్రత కల్పించాల్సి ఉంది. కానీ బస్టాండ్‌లో కేవలం ఒక్కరిద్దరు హోంగార్డులు కూడా అడపాదడపా కనిపిస్తుంటారు. బస్టాండ్‌లో పోలీసు నిఘా లేకపోవడంతో రాత్రివేళ సూర్యాపేట హైటెక్‌బస్టాండ్ నుంచి ప్రయాణం చేసే ప్రయాణికులు, ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు బస్టాండ్‌కు వెళ్లే ప్రజలు, అడపాదడపా వెళ్లే పెట్రోలింగ్ చేసే పోలీసులు సైతం వణుకుతున్నారు. రాత్రి 12 గంటలు దాటితే ఆ వైపు కన్నెత్తి చూడాలంటేనే పోలీసులు జంకుతున్నారు. పోలీసులకు అత్యాధునిక ఆయుధాలు , సరిపడా పోలీసు సిబ్బంది లేకపోవడంతో బస్టాండ్‌లో నిఘా కరువైంది. కొన్ని రోజులకే.. ఉగ్రవాదుల దాడి జరిగిన కొన్ని రోజులకే ఓ గుర్తు తెలి యని కారును హైటెక్ బస్టాండ్ ఆవరణలో వదిలేసి వెళ్లినప్పటికీ దానిని గమనించడంలో పోలీసులు విఫలమయ్యారనే చెప్పవచ్చు. ఆ గుర్తు తెలియని కారులో నుంచి * కోటిన్నర బయటపడ్డ విషయం తెలిసిందే. ఇలాంటి వరుస ఘటనలు చోటుచేసుకుంటున్నప్పటికీ పట్టణ ప్రజల, ప్ర యాణికుల భద్రతకు అటు ఆర్టీసీ.. ఇటు పోలీసు యం త్రాంగం తీసుకున్న చర్యలు నామమాత్రం. అయినా బస్టాండ్‌లో పోలీస్ ఔట్‌పోస్టు ఏర్పాటుచేసి 24 గంటలు ప్రయాణికుల భద్రత కల్పించాల్సిన చర్యలు ఏవి తీసుకున్న దాఖలాల్లేవు. బస్టాండ్‌లో ఒక ఏఎస్ఐతో పాటు ము గ్గురు కానిస్టేబుళ్లు, ఇద్దరు హోంగార్డులు విధులు నిర్వహించాల్సి ఉండగా.. వారు ఏనాడు బస్టాండ్‌లో కన్పించిన దాఖలాలు లేవు. విధుల్లో భాగంగా బస్టాండ్ ఆవరణలో విధులు నిర్వహించాలి.. కానీ విధులకు వెళ్లిన సిబ్బంది ఎక్కువగా బస్టాండ్ బయట ప్రైవేటు వాహనాలను నిలిపి మామూళ్లు వసూళ్లు చేసేందుకే మక్కువ చూపుతున్నారనే ఆరోపణలు వెల్లివెత్తుతున్నాయి. సంఘటన జరిగినప్పుడు మాత్రమే కంటితుడుపు చర్యగా కొద్దిరోజులు పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించి.. కొద్దిరోజులు కాగానే యథావి థిగా వదిలేశారు. ఇక ఇంత పెద్ద బస్టాండ్‌లో ఎనిమిది సీసీ కెమెరాలు అమర్చినప్పటికీ అవి సరైన ప్రదేశంలో అమర్చకపోవడంతో ఎవరు వచ్చి వెళ్తున్నారో.. ఏం చేస్తున్నారో.. అందులో నిక్షిప్తం కావడం లేదు. దీంతో అవి నిరుపయోగంగా మారినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ అవి ప్రస్తుతం పనిచేయడం లేదనే విమర్శలు లేకపోలేదు. సంబంధిత అధికార యంత్రాంగం చొ రవ చూపి పేటలో పటిష్టభద్రత ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని పట్టణ ప్రజలు, ప్రయాణికులు కోరుతున్నారు. -
పోలీసులపై తూటా
ఇద్దరు పోలీసులను చంపి పరారైన దుండగులు సీఐతో పాటు హోంగార్డుకు తీవ్రగాయాలు యూపీ ముఠా పనా.. సుపారీ హంతకులా? ఘటనా స్థలంలో ఒడిశా రాష్ట్ర ఓటరు కార్డు సీసీటీవీ ఫుటేజీల్లోనూ స్పష్టత కరువు ఆధారాలు సేకరించిన ఫోరెన్సిక్ బృందం బాధిత కుటుంబాలను పరామర్శించిన మంత్రులు నాయిని, జగదీశ్‌రెడ్డి, డీజీపీ మృతిచెందిన కానిస్టేబుల్‌కు రూ. 40 లక్షలు, హోంగార్డుకు రూ. 10 లక్షల పరిహారం ఆసుపత్రిలో కోలుకుంటున్న సీఐ,హోంగార్డు, మరో బాధితుడు సాక్షి ప్రతినిధి, నల్లగొండ, హైదరాబాద్: అర్ధరాత్రి తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులపై కాల్పులు జరగడం రాష్ర్టవ్యాప్తంగా కల కలం సృష్టించింది. నల్లగొండ జిల్లా సూర్యాపేటలోని హైటెక్ బస్టాండ్‌లో బుధవారం రాత్రి 12:30 గంటల సమయంలో చోటుచేసుకున్న ఘటనతో పోలీస్ యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. బస్టాండ్‌లో తనిఖీ చేస్తూ ఇద్దరు వ్యక్తులను అనుమానించిన పోలీసులు.. వారిని బస్సు నుంచి కిందికి దింపి విచారిస్తుండగానే దుండగులు అకస్మాత్తుగా కాల్పులకు పాల్పడ్డారు. కానిస్టేబుల్ లింగయ్య, హోంగార్డు మహేశ్ అక్కడికక్కడే చనిపోయారు. సీఐ మొగిలయ్య, మరో హోంగార్డు కిశోర్ తీవ్రంగా గాయపడ్డారు. వీరిద్దరూ ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకుంటున్నారు. అంతా ఐదు నిమిషాల్లో జరిగిపోయిన ఈ ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాల్పులకు తెగబడిందెవరు? పోలీసులపై కాల్పులు జరిగిన తీరును కూడా స్పష్టంగా ఎవరూ చెప్పలేని పరిస్థితి నెలకొంది. పోలీసు వర్గాల కథనం ప్రకారం సీఐ మొగిలయ్య బృందం విచారిస్తున్న ఇద్దరు అనుమానితులు ఒక్కసారిగా కాల్పులు జరిపి బస్టాండ్ నుంచి పారిపోయారు. ఈ క్రమంలో అటుగా వస్తున్న ఓ కారును ఆపేందుకు ప్రయత్నించారు. అది ఆగకపోవడంతో కారు నడుపుతున్న పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం జగన్నాథపురం గ్రామానికి చెందిన ఎంపీటీసీ గన్నమని దొరబాబుపై కూడా కాల్పులు జరిపి పరారయ్యారు. దీంతో ఆయన చేతికి బుల్లెట్ గాయమైంది. ఇంత క్రూరంగా కాల్పులకు పాల్పడింది ఎవరనే దానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. గరుడ బస్సులే లక్ష్యంగా, మహిళల బంగారు ఆభరణాలను చోరీ చేసే ఉత్తరప్రదేశ్‌కు చెందిన దొంగల ముఠా సభ్యులే ఈ ఘాతుకానికి ఒడిగట్టి ఉంటారనేది ఒక వాదన. సూర్యాపేట పోలీసులు గతంలో ఈ ముఠాకు చెందిన వారిని పట్టుకోవడం ఇందుకు బలాన్ని చేకూరుస్తోంది. అయితే, ఘటనా స్థలంలో లభించిన ఓటరు కార్డు ఒడిశా రాష్ట్రానికి చెందినది కావడంతో ఆ రాష్ట్రానికి చెందిన వారే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారా అన్నది కూడా తేలాల్సి ఉంది. ఈ ఘటన అనుకోకుండా జరిగిందా లేక యూపీ ముఠాలను నియంత్రించడంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న సూర్యాపేట టౌన్ సీఐ మొగిలయ్యను టార్గెట్ చేసుకుని దాడి జరిగిందా అనే అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. దుండగులు పారిపోతూ సీఐ గన్‌మ్యాన్ కార్బైన్‌ను కూడా తీసుకెళ్లిపోవడం చర్చనీయాంశమైంది. దొంగలే అయితే పోలీసులపై కాల్పులు జరిపి, ఆయుధాన్ని తీసుకెళ్తారా అనే సందేహం వ్యక్తమవుతోంది. అయితే వారు సుపారీ తీసుకుని హత్యలు చేసే ముఠా సభ్యులై ఉంటారని, ఎలాగైనా పోలీ సులు పట్టుకుంటారన్న ఉద్దేశంతో కాల్పులు జరిపి పరారై ఉంటారనే చర్చ కూడా జరుగుతోంది. పోలీసులు మాత్రం ఇది ముందస్తు ప్రణాళిక ప్రకారం జరిగిన ఘటన కాదని చెబుతున్నారు. ఈ ఘటనలో మావోయిస్టుల ప్రమేయం లేదని కూడా కొట్టిపారేస్తున్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో మరో కానిస్టేబుల్ అరవింద్, సీఐ డ్రైవర్ ఉపేందర్ కూడా బస్టాండ్‌లోనే ఉన్నా వారు దూరంగా ఉన్నట్లు సమాచారం. అయితే అరవింద్ ఘటనా స్థలానికి వచ్చిన వెంటనే ఆందోళనకు గురై అస్వస్థత చెందాడు. ఈయన ప్రస్తుతం కోలుకున్నా వాస్తవం చెప్పలేకపోతున్నాడని పోలీసులంటున్నారు. మరోవైపు నిందితులను గుర్తించేం దుకు ప్రధాన ఆధారమైన సీసీటీవీ ఫుటేజ్‌లో కూడా ఎలాంటి స్పష్టత రాలేదు. బస్టాండ్‌లో ఉన్న 8 సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిం చినా పోలీసులు బస్సెక్కడం, ఇద్దరు దుండగులతో కలిసి బస్సు దిగడం వరకే కనిపిస్తోంది. ఆ తర్వాత పరిణామాలు రికార్డు కాలేదు. అయితే, సీసీటీవీ ఫుటేజీని బట్టి దుండగులు 25 ఏళ్లలోపు వారని తెలుస్తోంది. కాగా, అనుమానితులను విచారించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను పోలీసులు తీసుకోలేదని, వారి దగ్గర ఏమైనా మారణాయుధాలున్నాయా లేవా అని తనిఖీ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ఈ ఘటన జరిగిందని తెలుస్తోంది. ఇక దుండగులు వాడిన బుల్లెట్లను పోలీసులు సేకరించారు. ఫోరెన్సిక్ బృందం ఘటనా స్థలాన్ని, మృతదేహాలను పరిశీలించి ఆధారాలను సేకరించింది. హోంమంత్రి, జిల్లా మంత్రి సందర్శన దుండగుల చేతిలో హతమైన ఇద్దరు పోలీసుల కుటుంబసభ్యులను పరామర్శించేందుకు జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డితో కలిసి హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి సూర్యాపేట వచ్చారు. ఏరియా ఆస్పత్రి మార్చురీలో ఉన్న లింగయ్య, మహేశ్ మృతదేహాలపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడే ఉన్న వారి కుటుంబాలను పరామర్శించి ఘటనా స్థలమైన హైటెక్ బస్టాండ్‌కు వెళ్లారు. అక్కడ హోంమంత్రి మీడియాతో మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్‌కు చెందిన దొంగల ముఠా ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చామని చెప్పారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామన్నారు. చనిపోయిన కానిస్టేబుల్‌కు రూ. 40 లక్షలు, హోంగార్డుకు రూ. 10 లక్షలు పరిహారం, కుటుంబానికి ఒకరి చొప్పున ఉద్యోగం ఇస్తామన్నారు. పోలీసుల మృతదేహాలకు వారి స్వగ్రామాల్లో గురువారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. సీఐ, హోంగార్డుకు శస్త్రచికిత్స దుండగుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన సీఐ మొగిలయ్య, హోంగార్డు కిషోర్‌కు హైదరాబాద్‌లోని కిమ్స్ వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించారు. వారి శరీరాల్లోకి దూసుకెళ్లిన బుల్లెట్లను తొలగించారు. ప్రస్తుతం వారికి ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు స్పష్టం చేశారు. మరో రెండు మూడు రోజుల్లో వీరు పూర్తిగా కోలుకునే అవకాశముందని పేర్కొన్నారు. సీఐని, హోంగార్డును మంత్రులు నాయిని, జగదీశ్‌రెడ్డి, డీజీపీ అనురాగ్‌శర్మ, ఇతర ఉన్నతాధికారులు పరామర్శించారు. మరో బాధితుడు దొరబాబు కూడా హైదరాబాద్‌లోని మరో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నల్లగొండ ఎస్పీ బదిలీ సాక్షి, హైదరాబాద్: సూర్యాపేట బస్టాండ్‌లో పోలీసులపై కాల్పుల నేపథ్యంలో నల్లగొండ జిల్లా ఎస్పీ టి.ప్రభాకర్‌రావును రాష్ర్ట ప్రభుత్వం బదిలీ చేసింది. నేర పరిశోధన విభాగం(సీఐడీ) ఎస్పీగా బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే కౌంటర్ ఇంటెలిజెన్స్ ఎస్పీ విక్రమ్‌జీత్ దుగ్గల్‌ను నల్లగొండ ఎస్పీగా నియమించింది. ఇక ప్రస్తుతం వెయిటింగ్లో ఉన్న రాజేశ్‌కుమార్‌ను కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం ఎస్పీగా నియమించింది. 17 ప్రత్యేక బృందాలతో గాలింపు సాక్షి, హైదరాబాద్: పోలీసులపై కాల్పులకు తెగబడిన దుండగులను పట్టుకునేందుకు ముమ్మర గాలింపు చర్యలు మొదలయ్యాయి. ఇందుకోసం 17 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. గ్రేహౌండ్స్, టాస్క్‌ఫోర్స్, ఇంటెలిజెన్స్ తదితర విభాగాల్లోని మెరికల్లాంటి సిబ్బందితో పాటు నల్లగొండ జిల్లా పోలీసులతో ఏర్పాటైన ఈ బృందాలు నిందితుల కోసం తీవ్రంగా గాలిస్తున్నాయి. నల్లగొండ సరిహద్దు జిల్లాలు, హైదరాబాద్‌లో పోలీసులు విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు. జాతీయ రహదారుల్లో వాహనాల తనిఖీ చేపట్టి అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. డీజీపీ అనురాగ్ శర్మ ఎప్పటికప్పుడు కేసు పురోగతిని సమీక్షిస్తున్నారు. మృత్యుంజయుడు మొగిలయ్య నిజాంసాగర్(నిజామాబాద్): దుండగుల కాల్పుల్లో గాయపడిన సీఐ మచ్చుకూరు మొగిలయ్య మూడుసార్లు మృత్యుంజయుడయ్యారు. నిజామాబాద్ జిల్లా జుక్కల్ మండలం కండేబల్లూరు గ్రామానికి చెందిన ఆయన తొలుత నాలుగేళ్ల పాటు ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగారు. ఆ తర్వాత ఎస్ఐగా ఎంపికై పోలీస్ శాఖలో చేరారు. అప్పట్లో హోంమంత్రి మాధవరెడ్డిపై నక్సల్స్ కాల్పుల్లో మొగిలయ్య గాయపడ్డారు. తర్వాత నెల్లూరు జిల్లాలో జరిగిన మరో కాల్పుల ఘటనలోనూ గాయాలతో బయటపడ్డారు. తాజాగా సూర్యాపేట ఘటనలోనూ మృత్యుంజయుడిగా నిలిచారు. -
సీఐ మొగిలయ్యకు ఆపరేషన్ పూర్తి: కిమ్స్ వైద్యులు
హైదరాబాద్/నల్లగొండ: దుండగుల కాల్పుల ఘటనలో గాయపడ్డ సీఐ మొగిలయ్యకు చేసిన ఆపరేషన్ పూర్తియినట్టు కిమ్స్ వైద్యులు వెల్లడించారు. గురువారం దాదాపు నాలుగు గంటలపాటు ఏడుగురు వైద్యుల బృందం చికిత్స నిర్వహించినట్టు తెలిపారు. శరీరంలో ఇరుకున్న రెండు బుల్లెట్లును తీశామని చెప్పారు. మరో 48గంటలపాటు సీఐ మొగులయ్యను తమ పరిశీలనలో ఉంచామన్నారు. అలాగే దుండగుల కాల్పుల్లో గాయపడ్డ హోంగార్డ్ కిశోర్‌కు కాసేపట్లో చికిత్స నిర్వహిస్తామని కిమ్స్ వైద్యులు తెలిపారు. నల్లగొండ జిల్లాలోని సూర్యాపేట హైటెక్ బస్టాండులో బుధవారం రాత్రి 11 గంటల సమయంలో వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులపై కొందరు దుండగులు నాలుగు రౌండ్లు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ కాల్పుల్లో కానిస్టేబుల్ లింగయ్యతో పాటు హోంగార్డు మహేశ్ అక్కడికక్కడే మృతిచెందారు. సీఐ మొగిలయ్య, కానిస్టేబుల్ అరవింద్, హోంగార్డు కిశోర్ తీవ్రంగా గాయపడ్డారు. ఘటనలో తీవ్రంగా గాయపడిన సీఐ మొగలయ్యతో పాటు ఆయన గన్ మెన్ పరిస్థతి విషమంగా ఉండటంతో వారినీ హైదరాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రికి తరలించిన సంగతి తెలిసిందే. -
పోలీసులు ధైర్య౦గా పోరాడారు : జగదీశ్‌రెడ్డి
-
'నిలకడగా సీఐ , హో౦గార్డు ఆరోగ్య౦'
-
దోపిడీ దు౦డగుల భీభత్స౦ : డీజీపి
-
నిలకడగా సీఐ, హోంగార్డు ఆరోగ్యం
హైదరాబాద్ : కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సీఐ మొగులయ్య, హోంగార్డు కిశోర్ ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని, ఆందోళన చెందాల్సిన పని లేదని డాక్టర్ భాస్కర్‌రావు తెలిపారు. సీఐ శరీరంలో ఉన్న రెండు బుల్లెట్లను ఆపరేషన్ చేసి తొలగిస్తామని ఆయన గురువారమిక్కడ చెప్పారు. సీఐ శరీరంలో బుల్లెట్లు దూసుకు పోవటంతో లివర్, కిడ్నీ ఎంతవరకూ దెబ్బతిన్నాయనే విషయం ఇంకా తెలియదన్నారు. ఆపరేషన్ చేసేటప్పుడు ఆ విషయం తెలుస్తుందన్నారు. ఇక హోంగార్డు కిశోర్ బాడీలో ఉన్న బుల్లెట్లు బయటకు వచ్చేశాయని డాక్టర్ భాస్కర్‌రావు తెలిపారు. ప్రస్తుతం వారిద్దరి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు చెప్పారు. కాగా నల్లగొండ జిల్లాలో అర్థరాత్రి దుండగులు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. తనిఖీలు చేస్తున్నపోలీసులపైనే కాల్పులు జరిపారు. దుండగుల కాల్పుల్లో కానిస్టేబుల్ లింగయ్య, హోంగార్డ్ మహేష్ అక్కడికక్కడే మృతి చెందారు. సీఐ మొగులయ్యతోపాటు మరో హోంగార్డు కిశోర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడినవారిని మొదట సూర్యాపేటలోని మెట్రో ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. -
అన్ని కోణాల్లో దర్యాప్తు, మావోల హస్తం లేదు: డీజీపీ
నల్లగొండ: నల్గొండ జిల్లా సూర్యాపేట హైటెక్ బస్టాండ్ ఘటనాస్థలిని డీజీపీ అనురాగ్‌శర్మ గురువారం పరిశీలించారు. స్థానిక అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ సాధారణ తనిఖీల్లో భాగంగానే బస్టాండ్‌లో పోలీసులు తనిఖీలు నిర్వహించారని తెలిపారు. బస్సులో తనిఖీలు చేస్తుండగా ఇద్దరు అనుమానితులుగా కనిపించటంతో వారిని ప్రశ్నిస్తున్న సమయంలో ఈ కాల్పులు జరిగాయన్నారు. దుండగులు వాడిని తూటాలను బట్టి, ఏపీ, బీహార్‌కు చెందిన ముఠా సభ్యులుగా అనుమానిస్తున్నామన్నారు. 7.65 బుల్లెట్లను ఉత్తర భారతంలో కొన్ని ముఠాలు నాటు తుపాకుల్లో వాడుతుంటాయని అనురాగ్ శర్మ తెలిపారు. కాల్పులు జరిపిన ముఠాను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు ఆయన చెప్పారు. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని, ఈ కాల్పుల వెనుక మావోయిస్టుల హస్తం ఉందనుకోవటం లేదని అనురాగ్ శర్మ తెలిపారు. అలాగే చనిపోయిన పోలీసుల కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. సీఐ మొగులయ్య కోలుకుంటున్నారని తెలిపారు. ఈ ముఠా...పోలీసులపై కాల్పులు జరిపిన పారిపోతూ అనంతరం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నుంచి హైదరాబాద్ వెళుతున్న జెడ్పీటీసీ దొరబాబు వాహనంపై కూడా కాల్పులకు పాల్పడినట్లు డీజీపీ తెలిపారు. ఆయన భుజంలోకి తూటా దూసుకు వెళ్లిందని ప్రస్తుతం హైదరాబాద్ లో చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. -
'అన్ని కోణాల్లో దర్యాప్తు, మావోల హస్తం లేదు'
-
'సూర్యాపేట కాల్పులు యూపీ గ్యాంగ్ పనే'
-
'సూర్యాపేట కాల్పులు యూపీ గ్యాంగ్ పనే'
హైదరాబాద్: బుధవారం రాత్రి దుండగుల కాల్పుల్లో గాయపడ్డ సీఐ, హోంగార్డులను తెలంగాణ హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి పరామర్శించారు. గురువారం ఉదయం ఆయన కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పోలీసులను నాయిని పరామర్శించారు. ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ.. బస్సుల్లో ప్రయాణించి దోపిడీలు చేస్తున్న అంతర్ రాష్ట్ర ముఠాల ఆటకట్టిస్తామని అన్నారు. సూర్యాపేట ఘటనలో పోలీసులు వ్యవహరించిన తీరును నాయిని ప్రశంసించారు. ఘటనకు పాల్పడిన నిందితులను తప్పకుండా పట్టుకుంటామని చెప్పారు. చనిపోయిన పోలీసుల కుటుంబాలకు రూ.25 లక్షల నుంచి రూ.40 లక్షలు పరిహారం అందజేస్తామని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ ప్రకటిస్తారని నాయిని చెప్పారు. గతంలోనే రూ.5 లక్షలను హోంగార్డులకు పరిహారంగా ప్రకటించామని హోంమంత్రి నాయిని గుర్తు చేశారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. నల్లగొండ జిల్లా సూర్యాపేట హైటెక్ బస్టాండ్‌లో బుధవారం రాత్రి 11 గంటల తర్వాత కాల్పులు చోటుచేసుకున్నాయి. వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులపై కొందరు దుండగులు నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారు. దాంతో కానిస్టేబుల్ లింగయ్యతో పాటు హోంగార్డు మహేశ్ అక్కడికక్కడే మృతిచెందాడన్న విషయం తెలిసిందే. పరామర్శించిన వారిలో తెలంగాణ రాష్ట్ర మంత్రి జగదీశ్ రెడ్డి కూడా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర డీజీపీ అనురాగ్ శర్మ సంఘటనా స్థలాన్న పరిశీలించారు. -
గాయపడ్డ పోలీసులకు నాయిని పరామర్శ
హైదరాబాద్: బుధవారం రాత్రి దుండగుల కాల్పుల్లో గాయపడ్డ పోలీసులను తెలంగాణ హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి పరామర్శించారు. గురువారం ఉదయం ఆయన కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పోలీసులను నాయిని పరామర్శించారు. నల్లగొండ జిల్లా సూర్యాపేట హైటెక్ బస్టాండ్‌లో బుధవారం రాత్రి 11 గంటల తర్వాత కాల్పులు చోటుచేసుకున్నాయి. వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులపై కొందరు దుండగులు నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారు. దాంతో కానిస్టేబుల్ లింగయ్యతో పాటు హోంగార్డు మహేశ్ అక్కడికక్కడే మృతిచెందాడన్న విషయం తెలిసిందే. -
పెను విషాదం
-
నల్లగొండజిల్లా అంతటా హై అలర్ట్
-
సూర్యాపేట ఘటనతో అంతా హై అలర్ట్
హైదరాబాద్ : పోలీసులు నగరంలో హైఅలర్ట్ ఉన్నట్లుగా కనిపిస్తోంది. హైదరాబాద్ లోని ప్రధాన కూడళ్లతో పాటు విజయవాడ జాతీయ రహదారిపై భారీగా పోలీసులను మోహరించారు. నగరంలో ప్రధాన ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. కొందరు అనుమానితులను అదుపులోనికి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ మీరట్ ప్రాంతానికి చెందిన ఇర్ఫాన్ ను పోలీసులు అనుమానితుడిగా భావిస్తున్నారు. కాగా, ఇర్ఫాన్ దొంగల ముఠా సభ్యుడై ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఘటనా స్థలంలో దొరికి ఓటర్ ఐడీ కార్డులు నకిలీవని పోలీసులు పేర్కొంటున్నారు. కాల్పులకు పాల్పడింది ఖచ్చితంగా నార్త్ ఇండియన్స్ అని తెలుస్తోంది. -
కారులోని దంపతులపై దుండగుల కాల్పులు
-
సూర్యాపేట బస్టాండ్‌లో పోలీసులపై కాల్పులు
-
కాల్పుల ఘటన మీరట్ ముఠా పని అయ్యుండొచ్చు..!
సూర్యాపేట: ఇర్ఫాన్ అనే వ్యక్తి సూర్యాపేట బస్టాండ్ లో కాల్పులకు పాల్పడిన దుండగులలో ఒకడయి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, ఇతడు ఉత్తరప్రదేశ్ లోని మీరట్ ప్రాంతానికి చెందినవాడని భావిస్తున్నారు. ఇతనికి ఈ ఘటనతో ఏమైనా సంబంధం ఉందేమోన్న కోణంలో పోలీసుల దర్యాప్తు చేస్తామని తెలిపారు. దుండగుల కాల్పుల్లో గాయపడిన సీఐ మొగులయ్యతో పాటు ఓ గన్‌మెన్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు నక్సల్స్ దాడులకు పాల్పడ్డారా అనే కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతోంది. నల్లగొండ జిల్లా సూర్యాపేట హైటెక్ బస్టాండ్‌లో బుధవారం రాత్రి 11 గంటల తర్వాత కాల్పులు చోటుచేసుకున్నాయి. వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులపై కొందరు దుండగులు నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారు. దాంతో కానిస్టేబుల్ లింగయ్యతో పాటు హోంగార్డు మహేశ్ అక్కడికక్కడే మృతిచెందాడన్న విషయం తెలిసిందే. -
సూర్యాపేట బస్టాండ్‌లో పోలీసులపై కాల్పులు
* కానిస్టేబుల్, హోంగార్డు అక్కడికక్కడే మృతి... * సీఐ, కానిస్టేబుల్, హోంగార్డుకు తీవ్ర గాయాలు సూర్యాపేట: నల్లగొండ జిల్లా సూర్యాపేట హైటెక్ బస్టాండ్‌లో బుధవారం రాత్రి 11 గంటల సమయంలో కాల్పులు చోటుచేసుకున్నాయి. వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులపై కొందరు దుండగులు నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారు. దాంతో కానిస్టేబుల్ లింగయ్యతో పాటు హోంగార్డు మహేశ్ అక్కడికక్కడే మృతిచెందారు. సీఐ మొగిలయ్య, కానిస్టేబుల్ అరవింద్, హోంగార్డు కిశోర్ తీవ్రంగా గాయపడ్డారు. ఘటనలో తీవ్రంగా గాయపడిన సీఐ మొగలయ్యతో పాటు ఆయన గన్ మెన్ పరిస్థతి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. వారినీ హైదరాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. అయితే కానిస్టేబుల్ కార్బన్ తుపాకీని దుండగులు ఎత్తుకెళ్లినట్టు పోలీసులు చెబుతున్నారు. ఇది ఒడిశా దొంగల ముఠా పని అంటున్నారు. తర్వాత దుండగులు పారిపోవడానికి హైవేపై వెళుతున్న కారును ఆపడానికి ప్రయత్నించారనీ, కానీ, కారు ఆపకపోవడంతో కారులో ఉన్న దంపతులపై ఒక్కసారిగా దుండగులు కాల్పులు జరిపినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో భర్తకు తీవ్రగాయాలయ్యాయి. అతన్ని ఆస్పత్రికి తరలించామని చెప్పారు. బాధితుడు తాడేపల్లి వాసి దొరబాబుగా పోలీసులు గుర్తించారు. సంఘటనా స్థలాన్ని ఐజీ నవీన్ చంద్, జిల్లా ఎస్పీ ప్రభాకర రావులు పరిశీలించారు. దాంతో హైవేలపై పోలీసులు ఆలర్ట్ ప్రకటించారు. కాగా, సూర్యాపేట కాల్పుల ఘటనలో ఓ కీలక ఆధారం లభ్యమైనట్టు పోలీసు అధికారులు తెలిపారు. సంఘటనా స్థలంలో దుండగుల ఓటర్ ఐడీ కార్డును స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. అయితే ఓటర్ ఐడీ కార్డు ఆధారంగా దుండగులు ఒరిస్సాకు చెందినవారుగా పోలీసులు అనుమానిస్తున్నారు. గత మూడు నెలల క్రితమే బదిలీపై సూర్యాపేటకు వెళ్లిన సీఐ మొగలయ్య రెండు బీహారీ ముఠాలను అరెస్ట్ చేసి రిమాండ్ పంపారు. అయితే ఒక కేసులో తప్పించుకున్న ఇద్దరు బీహారు ముఠా సభ్యులే కాల్పులకు తెగపడ్డట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.