
గవర్నర్ ఢిల్లీ పర్యటన..సర్వత్రా ఆసక్తి
హైదరాబాద్: ఈ నెల 10, 11 తేదీలలో ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ న్యూఢిల్లీలో పర్యటించనున్నారు. ఓటుకు నోటు అంశంలో టీడీపీ ఎమ్మెల్యే వ్యవహారంపై కేంద్రానికి నివేదిక సమర్పించే నిమిత్తమై ఆయన ఢిల్లీకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి రాజ్నాధ్సింగ్లతో రేవంత్ విషయాన్ని నరసింహన్ చర్చించనున్నట్లు సమాచారం.