హైదరాబాద్ : తెలంగాణలో జైళ్ల సంస్కరణలకు పెద్దపీట వేస్తామని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. ఆయన సోమవారం చర్లపల్లి జైలును సందర్శించారు. జైళ్ల అభివృద్ధి కోసం దేశంలోని జైళ్లకు ప్రత్యేక టీమ్లను పంపిస్తామన్నారు. క్షమాభిక్షకు అర్హులైన ఖైదీల విడుదలకు కసరత్తు చేస్తున్నామని, ఖైదీల క్షమాభిక్షపై ముఖ్యమంత్రితో చర్చిస్తామని నాయిని తెలిపారు. త్వరలో ఖైదీలను విడుదల చేయటం సాధ్యం కాకపోవచ్చన్నారు.
మార్గదర్శకాలను రూపొందించి అర్హులైన ఖైదీలను విడుదల చేస్తామన్నారు. ఈ సందర్భంగా జైలులోని బియ్యం, దుప్పట్లను ఆయన పరిశీలించారు. ఖైదీల భోజనంలో నాణ్యత పెంచుతామని ఆయన తెలిపారు. ఇక జైళ్లలో సెల్ఫోన్లు, గంజాయి వినియోగించే ఖైదీలు.... వారికి సహకరించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని నాయిని స్పష్టం చేశారు. జైళ్లలో వైద్యుల కొరతను తీరుస్తామని హామీ ఇచ్చారు.
అర్హులైన ఖైదీల విడుదలకు కసరత్తు
Published Mon, Jul 28 2014 2:11 PM | Last Updated on Sat, Oct 20 2018 5:05 PM
Advertisement
Advertisement