
సాక్షి, హైదరాబాద్: డిజిటల్ ఇండియాలో భాగంగా దక్షిణ మధ్య రైల్వే మరొక మైలు రాయిని అధిగమించింది. రైలు ప్రయాణంలో హ్యాండ్–హెల్డ్ టెర్మినల్స్ (హెచ్‌హెచ్‌టీ)ను ఉపయోగించు కుని టికెట్లను తనిఖీచేసే నూతన వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. ప్రయాణికుల వివరాలు, బెర్తుల వివరాలు తెలుసుకోవడానికి, స్టేషన్ స్టేషన్‌కు మధ్య ఏర్పడే ఖాళీ బెర్తులను ప్రయాణికులకు కేటాయించడానికి ఇది ఉపయోగపడనుంది.
హెచ్‌హెచ్‌టీ వ్యవస్థను దేశవ్యాప్తంగా 51 రాజధాని, శతాబ్ధి ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ప్రయోగాత్మకంగా అమలు చేశారు. ప్రస్తుతం దీన్ని దక్షిణ మధ్య రైల్వే పరిధిలో అమలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సికింద్రాబాద్–పుణే శతాబ్ధి ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్–హజ్రాత్ నిజాముద్దీన్ రాజధాని ఎక్స్‌ప్రెస్, చెన్నై సెంట్రల్–హజ్రాత్ నిజాముద్దీన్, బెంగళూర్–హజ్రాత్ నిజాముద్దీన్ ఎక్స్‌ప్రెస్‌లలో పనిచేసే తనిఖీ సిబ్బందికి గురువారం 40 హెచ్‌హెచ్‌టీ పరికరాలను రైల్వే అందజేసింది.
Comments
Please login to add a commentAdd a comment