మల్లన్న సన్నిధిలో అగ్నిగుండాలు
చేర్యాల, న్యూస్‌లైన్ : కొమురవెల్లి శ్రీమల్లికార్జునస్వామి ఆల యంలో వీరశైవ ఆగమ సాంప్రదాయం ప్రకా రం ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు అగ్నిగుండాలు నిర్వ హించారు. ఈ వేడుకను తిలకించేందుకు భక్తు లు భారీగా తరలివచ్చారు. జాతర బ్రహ్మోత్సవాలు మల్లికార్జునస్వామి కల్యాణంతో ప్రారంభమై అగ్నిగుండాలతో ముగుస్తాయి. మొదట ఆలయ అర్చకులు వీరభద్ర పళ్లెరానికి, దుర్గామాతకు, వీరభద్ర ఖడ్గానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం ఆలయ ప్రాంగణంలోని గంగిరేగు చెట్టు వద్ద భూమి పూజ, కలష పూజలు చేసి అగ్నిగుండాలను ముట్టించారు. సుమారు 50 క్వింటాళ్ల సమిదలకు కాల్చి నిప్పు లు తయారు చేశారు. భవాణయ్య, సిద్ధిమల్ల య్య, భవణేశ్వర్, ఆనందయ్య, భద్రయ్యస్వామి ఆధ్వర్యంలో అగ్నిగుండాల చుట్టూ ద్వార బంధనం చేసి గుమ్మడికాయలు పెట్టి పూజలు చేశారు.
అనంతరం ఆలయంలోని ఉత్సవ విగ్రహాలను అర్చకులు మహదేవుని మల్లికార్జున్, చిన్న మల్లికార్జున్, పడిగన్నగారి అంజయ్య, అకుల విజయ్‌కుమార్ డప్పు చప్పుళ్లతో తీసుకువచ్చి తెల్లవారుజామున అగ్నిగుండాల నుంచి నడిచారు. అనంతరం భక్తులు, శివసత్తులు ఒక్కొక్కరుగా అగ్నిగుండా లు దాటుతూ స్వామిని దర్శించుకున్నారు. ఉద యం గర్భగుడిలో స్వామివారికి అభిషేకాలు, జంగమార్చనలు, ప్రత్యేక పూజలు చేశారు.
భక్తులను అనుమతించని పోలీసులు
గతంలో జరిగిన అవాంఛనీయ సంఘటనలను దృష్టిలో పెట్టుకుని పోలీసులు భక్తులను అగ్నిగుండాలలోకి అనుమతించలేదు. రాజగోపురం వద్దే నిలిపివేశారు. దీంతో జాతరకు వచ్చే భక్తు ల మనోభావాలు దెబ్బతింటాయని ఆరోపణ లు వెల్లువెత్తడంతో కొద్ది మందిని మాత్రమే లోనికి అనుమతించారు. అనంతరం అగ్నిగుం డాలు దాటడానికి ఒక్కొక్కరిని పంపించారు. ఈ కార్యక్రమానికి ఆలయ ఈఓ కాటం రాజు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. వరంగల్ ఓఎస్‌డీ అంబర్ కిషోర్‌జా, జనగామ డీఎస్పీ కె.సురేందర్ పర్యవేక్షణలో నిర్వహించారు. అంతకు ముందు ఓఎస్‌డీ దపంతులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.