Sri Mallikarjuna Swamy temple
-
పట్నాల మల్లన్నకు పదివేల దణ్ణాలు
తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన సిద్దిపేట జిల్లా కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం. భక్తులు కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. మల్లికార్జున స్వామి ఆయన సతీమణులు లింగ బలిజల ఆడబిడ్డ అయిన బలిజ మేడలమ్మ, యాదవుల ఆడబిడ్డ అయిన గొల్లకేతమ్మలు నిత్యం పూజలందుకుంటున్నారు. ప్రతీ యేడాది మూడు నెలల పాటు జాతర జరుగుతుంది. రెండు పద్దతుల్లో స్వామి వారికి కళ్యాణం నిర్వహిస్తారు. మార్గశిర మాసం చివరి ఆదివారం వీరశైవ ఆగమ పద్దతి ప్రకారం స్వామి వారి కళ్యాణం, మహాశివరాత్రి సందర్బంగా యాదవ సాంప్రదాయం ప్రకారం స్వామి వారి కళ్యాణం నిర్వహించనున్నారు. జనవరి 19 నుంచి మార్చి 24వ తేదీ వరకు తెలుగురాష్ట్రాలతో పాటు ఒడిశా, చత్తీస్çగడ్, కర్ణాటక నుంచి భక్తులు భారీగా తరలి రానున్నారు. పది ఆదివారాలు జాతర వారాలుగా నిర్వహిస్తారు. ఇదే విధంగా తెలంగాణలో ఐనవోలు, ఓదెలలో సైతం ఇదే విధంగా పట్నాలు వేసి మొక్కులు చెల్లించుకోవడం కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్న ఆనవాయితీ.కొమురవెల్లి మల్లన్నకు ప్రకృతి సిద్దమైన ఐదు రంగులను ఉపయోగించి పట్నం వేస్తారు. ఇందుకోసం పసుపు, కుంకుమ, గులాబీరంగు(బుక్క గులాల్), ఆకుపచ్చ పొడి (తంగేడు, చిక్కుడు ఆకులను ఎండబెట్టి పొడి చేస్తారు) తెల్ల పిండి (బియ్యం పిండి)ని వాడుతారు. పట్నాలు వేసేందుకు పసుపు, కుంకుమ, భక్తులు బస చేసిన ప్రాంతాల్లో వేసేది చిలక పట్నం. ఆలయంలోని గంగిరేణి చెట్టు వద్ద వేసేది నజర్ పట్నం. ఆలయం లోపల వేసేది ముఖ మండప పట్నం. మల్లన్నకు ప్రతి ఏడాది లేదా రెండు లేదా మూడేండ్లకు ఒకసారి పట్నాలు వేసి భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. మహాశివరాత్రి సందర్బంగా కొమురవెల్లిలోని తోట బావి దగ్గర పెద్ద పట్నం వేస్తారు. ఈ పెద్ద పట్నం 41 వరుసలతో దాదాపు 50 గజాల్లో వేస్తారు. జానపద రూపాల్లో ఒగ్గు పూజారులు కథను చెబుతూ పట్నం వేస్తారు. పట్నంలోకి మల్లికార్జునుడిని ఆహ్వానించి కల్యాణం చేసి తమ కోరికలను విన్నవించుకుంటారు. నుదుటిన బండారి పెట్టి కంకణాలు కట్టి ఒగ్గు పూజా కతువు నిర్వహిస్తారు. అలాగే స్వామివారి చరిత్రను సైతం వివరిస్తుంటారు. కొందరు ఇంటి వద్ద సైతం మల్లన్న పట్నాలు వేసి ఓ పండుగ లాగ బంధువులను పిలిచి చేస్తారు.పట్నంలో ఒకే కొమ్ము ఉన్న శూలంపెద్ద పట్నం వేసే ముందు ఒగ్గు పూజారులు తమ ఆచారం ప్రకారం గర్భాలయంలోని మూల విరాట్‌కు పట్టువస్త్రాలను సమర్పిస్తారు. స్వామివారిని పల్లకిలో ఊరేగింపుగా తీసుకువెళ్లి, కోనేట్లో స్నానం ఆచరింపజేస్తారు. పట్నం వేసే ప్రదేశంలో సుంకు పట్టిన తర్వాత, గొంగళిలో బియ్యం పోసి మైలపోలు తీస్తారు. స్వామివారు ధరించే ఒకటే కొమ్ము ఉన్న శూలం (ఒరగొమ్ము), డమరుకాన్ని నెలకొల్పుతారు. పసుపు, కుంకుమ, తెల్ల పిండి, సునేరు, పచ్చ రంగులను ప్రమథ గణాలుగా సమ్మిళితం చేసి, నిమ్మకాయతో చిత్ర కన్ను నెలకొల్పి శివలింగాన్ని చిత్రిస్తారు. రకరకాల డిజైన్లతో సర్వాంగ సుందరంగా పట్నాన్ని తీర్చిదిద్దుతారు.పట్నం దాటడం....ఆ తర్వాత ఉత్సవ విగ్రహాలను తీసుకొని పట్నం పై పెట్టి పూజారులు పూజలు నిర్వహిస్తారు. తర్వాత.. శివసత్తులు పట్నం దాటుతారు.. ఈ వేడుకను చూసేందుకు, పట్నం ముగ్గుపొడిని సేకరించుకొనేందుకు భక్తులు పోటీ పడతారు. ఈ ముగ్గును పొలాల్లో చల్లితే పంటలు బాగా పండుతాయని నమ్ముతారు. పట్నాల మొక్కుల తర్వాత భక్తులు అగ్ని గుండాల కార్యక్రమంలో నిప్పుల మీద నడుస్తారు. అనంతరం స్వామివారిని దర్శించుకుంటారు.– గజవెల్లి షణ్ముఖ రాజుసాక్షి, సిద్ధిపేట -
తనకు గాయం చేసిన భక్తుడి పేరునే తన క్షేత్రానికి పెట్టుకొన్న శివుడు!
సాక్షి, పెద్దపల్లి: ‘గజ్జల లాగులను ధరించిన ఓదెల మల్లన్న దండాలో.. మమ్మేలు మా స్వామి దండాలో.. ఆలుమిలా తారడో బోలుమియా గారడో..’ అంటూ గంతులు వేస్తూ తమ ఇలవేల్పును దర్శించేందుకు భక్తులు ఆ ఆలయానికి భారీగా తరలివస్తుంటారు. తనకు గాయం చేసిన భక్తుడి పేరునే తన క్షేత్రానికి పెట్టుకొన్న శివుడు.. మల్లన్నగా.. ఓదెల మల్లన్నగా పూజలందుకుంటున్నాడు. తెలంగాణ శ్రీశైలంగా ప్రసిద్ధి చెందాడు. అదే పెద్దపల్లి జిల్లా (Peddapalli District) ఓదెల మల్లికార్జునస్వామి ఆలయం. ఆ ఆలయ చరిత్ర తెలుసుకుందాం.నాగలి చేసిన గాయంతో..పూర్వం ఈ ప్రాంతం దండకారణ్యంగా (Deep Forest) ఉండేది. ఆ రోజుల్లో స్వయంభూలింగంగా వెలసిన మహాశివుడిని పంకజ మహామునీశ్వరుడు నిత్యం కొలుస్తూ తపస్సు చేసేవాడని ప్రతీతి. దీనికి నిదర్శనంగా ఆలయ స్తంభంపై మునీశ్వరుల బొమ్మలు, నామం చెక్కి కనిపిస్తాయి. ఆయన తర్వాత పూజ చేసేవారు లేక శివలింగంపై పెద్దఎత్తున పుట్ట పెరిగింది. అయితే, చింతకుంట ఓదెలు అనే రైతు వ్యవసాయం చేస్తుండగా.. నాగలి కర్ర పుట్టలోని శివలింగానికి తగిలింది. జరిగిన పొరపాటును ఓదెలు తెలుసుకొని, స్వామివారిని మన్నించమని వేడుకున్నాడు. దీంతో ఓదెలుకు శాశ్వత మోక్షాన్ని ప్రసాదించడమే కాకుండా, అతడి పేరుతోనే భక్తులకు దర్శనం ఇస్తానని స్వామివారు చెప్పినట్లు భక్తులు విశ్వసిస్తారు. ఇప్పటికీ శివలింగానికి నాగలి కర్ర చేసిన గాయాన్ని పోలిన మచ్చ ఉంటుంది. ఈ ఆలయ నిర్మాణ క్రమం, స్తంభ వర్ణ శిలలు, శిల్పాల ఆధారంగా సుమారు 1300 మధ్య కాకతీయుల కాలంలో ఆలయాన్ని పునర్నిర్మించినట్లుగా చారిత్రక ఆధారాలున్నాయని చెబుతున్నారు. ఆ సమయంలో దక్షిణ దిశగా శ్రీభ్రమరాంబ అమ్మవారిని, ఉత్తర దిశగా శ్రీవీరభద్రస్వామిని, క్షేత్రపాలకుడిగా శ్రీభైరవస్వామిని ప్రతిష్టించారు.మల్లన్న ఆలయానికి సమాంతరంగా సీతారామ చంద్రస్వామి విగ్రహాలుశ్రీసీతారాములు వనవాసం చేసే సమయంలో రామగిరిఖిల్లా నుంచి ఇల్లంతకుంటకు వెళ్లే దారిలో ఓదెల శ్రీమల్లికార్జునస్వామిని దర్శించుకున్నారని ప్రతీతి. దానికి ప్రతీకగా మల్లన్నస్వామి ఆలయానికి సమాంతరంగా శ్రీసీతారామచంద్రస్వామి వారి విగ్రహాలను ప్రతిష్టించారని స్థానికులు చెబుతుంటారు.సంతానం కోసం టెంకాయ బంధనం‘గండాలు తీరితే గండదీపం పెడతాం.. కోరికలు తీరితే.. కోడెలు కడతాం.. పంటలు పండితే.. పట్నాలు వేస్తాం.. పిల్లాజెల్ల సల్లంగా ఉంటే.. సేవలు చేస్తాం’ అని స్వామివారికి భక్తులు మొక్కుకుంటారు. వచ్చే భక్తుల్లో చాలామంది సంతానం కోసం ‘టెంకాయ బంధనం’ కట్టి వారికి సంతానం కలిగిన తర్వాత స్వామివారికి మొక్కుబడి చెల్లిస్తారు. మల్లన్నను దర్శించుకున్న తర్వాతే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రజాప్రతినిధులు ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేయడం ఆనవాయితీగా వస్తోంది.ఒగ్గుపూజారుల పట్నాలతో..ఓదెల మల్లన్న సన్నిధిలో భక్తులు (Devotees) స్వామివారి పేరిట పట్నం వేస్తారు. ఒగ్గుపూజారుల చేతిలో ఢమరుకాన్ని మోగిస్తూ శ్రుతిని తలుస్తుండగా స్వామివారికి భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. మండపంలో ఒగ్గు పూజారులు గజ్జెలతో కుట్టిన లాగుల (నిక్కర్లు)తో పూసలు కట్టిన అంగీలు (చొక్కాలు), పూసల కుల్లాయి (టోపీ) సన్నని జాలిచెద్దరు, చేతిలో త్రిశూలం, దానికి చిరుగంటలు, మరోచేతిలో కొరడా (వీరకొల) వంటివి ధరించి భక్తి తన్మయత్వంతో పూనకాలతో ఊగుతూ, గంతులు వేస్తూ.. శివతాండవం చేస్తూ దేవున్ని ప్రత్యేకంగా కొలవడం విశేషం.పలు రాష్ట్రాల నుంచి భక్తుల రాకఏటా సుమారు రూ.2 కోట్లకుపైగా ఆదాయం సమకూరే ఓదెల శ్రీమల్లికార్జునస్వామి దేవాలయానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచే కాక రాష్ట్రంలోని అనేక జిల్లాల నుంచి, పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ నుంచి కూడా లక్షలాది మంది భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారు.భక్తుడి పేరుతో దర్శనం చింతకుంట ఓదెలు అనే భక్తుడి పేరు మీద మల్లన్న క్షేత్రం విరాజిల్లు తోంది. శ్రీరాముడు కూడా మల్లన్నను దర్శించుకొని పూజలు చేశాడని ప్రతీతి. శ్రీశైలం, ఓదెల ఆలయం రెండు ఒకే సమయంలో నిర్మించడంతో తెలంగాణ శ్రీశైలం అని ఈ ఆలయానికి పేరు వచ్చింది. కాకతీయుల కాలంలో ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు.– పంచాక్షరి, ఆలయ అర్చకులుబుధ, ఆదివారాల్లో రద్దీ ఉగాది పర్వదినం రోజున ఎడ్లబండ్లతో దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. ఆ తర్వాత జాతర ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా పెద్దపట్నాలు, అగ్నిగుండాలు దాటడంతో ఏటా జాతర సాగుతుంది. ఆలయంలో పలు అభివృద్ధి పనులు, నిర్మాణాలు కొనసాగుతున్నాయి. వాటి నిర్మాణాలకు సహకరించిన దాతలకు జాతర సమయంలో ప్రత్యేక గుర్తింపు కల్పిస్తాం.– బి.సదయ్య, ఈవో(403) -
‘ఐలోని’కి పోటెత్తిన భక్తజనం
ఐనవోలు: ఉగాది సమీపిస్తుండగా ప్రఖ్యాత ఐలోని శ్రీమల్లికార్జునస్వామి ఆలయానికి వారాంతపు జాతరలో భాగంగా ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. ఉదయం ఒగ్గు పూజారుల మేలు కొలుపుతో మల్లన్న సన్నిధిలో సందడి ప్రారంభమైంది. స్వామి వారికి నిత్య కై ంకర్యాలు శైవ ఆగమ పద్ధతిలో నిర్వహించి మహన్యాస పూర్వక రుద్రాభిషేకాలతో స్వామి వారిని అభిషేకించారు. శనివారం సాయంత్రమే ఆలయానికి చేరుకున్న భక్తులు పట్నాలు, బోనాల మొక్కులు చెల్లించుకుని ఆదివారం ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో స్వామి వారిని దర్శించుకున్నారు. కొంతమంది భక్తులు ఒగ్గు పూజారులతో పట్నాలు వేయించుకుని ఒగ్గు సంప్రదాయంలో స్వామి వారి కల్యాణం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు వారి పితృదేవతలను పూజించారు. బోనం వండి అమ్మవారికి సమర్పించి కోడెను కట్టి, శావ(రథం)లాగి మొక్కులు తీర్చుకోగా మరికొందరు వరం పట్టారు, వడి బియ్యం సమర్పించారు. టెంకాయ బందనం లాంటి కార్యక్రమాలు చేపట్టారు. వేలాది మంది భక్తులతో ఆలయ ప్రాంగణమంతా మల్లన్న నామస్మరణతో మార్మోగింది. భక్తుల రద్దీ అధికం కావడంతో ఎస్పై ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. స్వామి వారి దర్శనానికి నాలుగు గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు. సుమారు లక్షమంది భక్తులు స్వామివారి దర్శనం చేసుకున్నట్లు ఈఓ అద్దంకి నాగేశ్వర్రావు తెలిపారు. దేవాలయ అర్చక సిబ్బంది పాల్గొన్నారు. బోనాలు వండుతున్న మహిళలు శావ(రథం) లాగుతున్న భక్తులు మల్లన్న దర్శనానికి తరలివచ్చిన భక్తులు -
మల్లన్న సన్నిధిలో అగ్నిగుండాలు
చేర్యాల, న్యూస్‌లైన్ : కొమురవెల్లి శ్రీమల్లికార్జునస్వామి ఆల యంలో వీరశైవ ఆగమ సాంప్రదాయం ప్రకా రం ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు అగ్నిగుండాలు నిర్వ హించారు. ఈ వేడుకను తిలకించేందుకు భక్తు లు భారీగా తరలివచ్చారు. జాతర బ్రహ్మోత్సవాలు మల్లికార్జునస్వామి కల్యాణంతో ప్రారంభమై అగ్నిగుండాలతో ముగుస్తాయి. మొదట ఆలయ అర్చకులు వీరభద్ర పళ్లెరానికి, దుర్గామాతకు, వీరభద్ర ఖడ్గానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని గంగిరేగు చెట్టు వద్ద భూమి పూజ, కలష పూజలు చేసి అగ్నిగుండాలను ముట్టించారు. సుమారు 50 క్వింటాళ్ల సమిదలకు కాల్చి నిప్పు లు తయారు చేశారు. భవాణయ్య, సిద్ధిమల్ల య్య, భవణేశ్వర్, ఆనందయ్య, భద్రయ్యస్వామి ఆధ్వర్యంలో అగ్నిగుండాల చుట్టూ ద్వార బంధనం చేసి గుమ్మడికాయలు పెట్టి పూజలు చేశారు. అనంతరం ఆలయంలోని ఉత్సవ విగ్రహాలను అర్చకులు మహదేవుని మల్లికార్జున్, చిన్న మల్లికార్జున్, పడిగన్నగారి అంజయ్య, అకుల విజయ్‌కుమార్ డప్పు చప్పుళ్లతో తీసుకువచ్చి తెల్లవారుజామున అగ్నిగుండాల నుంచి నడిచారు. అనంతరం భక్తులు, శివసత్తులు ఒక్కొక్కరుగా అగ్నిగుండా లు దాటుతూ స్వామిని దర్శించుకున్నారు. ఉద యం గర్భగుడిలో స్వామివారికి అభిషేకాలు, జంగమార్చనలు, ప్రత్యేక పూజలు చేశారు. భక్తులను అనుమతించని పోలీసులు గతంలో జరిగిన అవాంఛనీయ సంఘటనలను దృష్టిలో పెట్టుకుని పోలీసులు భక్తులను అగ్నిగుండాలలోకి అనుమతించలేదు. రాజగోపురం వద్దే నిలిపివేశారు. దీంతో జాతరకు వచ్చే భక్తు ల మనోభావాలు దెబ్బతింటాయని ఆరోపణ లు వెల్లువెత్తడంతో కొద్ది మందిని మాత్రమే లోనికి అనుమతించారు. అనంతరం అగ్నిగుం డాలు దాటడానికి ఒక్కొక్కరిని పంపించారు. ఈ కార్యక్రమానికి ఆలయ ఈఓ కాటం రాజు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. వరంగల్ ఓఎస్డీ అంబర్ కిషోర్జా, జనగామ డీఎస్పీ కె.సురేందర్ పర్యవేక్షణలో నిర్వహించారు. అంతకు ముందు ఓఎస్డీ దపంతులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.