తెలంగాణ ఇంక్రిమెంటుతో తమకు లాభం లేదని తెలంగాణ ఉద్యోగులు మండిపడ్డారు. సచివాలయం వద్ద తెలంగాణ ఉద్యోగుల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో లంచ్ అవర్ ర్యాలీ నిర్వహించారు. స్పెషల్ పేను అన్ని అలవెన్సులు వర్తించే రెగ్యులర్ ఇంక్రిమెంట్‌గా మార్చాలని ఉద్యోగులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
అలాగే, ఏపీ ప్రభుత్వంలో పని చేస్తున్న తెలంగాణ ఉద్యోగులను తక్షణమే తెలంగాణ ప్రభుత్వానికి మార్చాలని కోరారు. పీఆర్సీ, హెల్త్ కార్డులు వెంటనే అమలు చేయాలని అడిగారు. అయితే, ఉద్యోగుల ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.
'తెలంగాణ ఇంక్రిమెంటుతో మాకు లాభంలేదు'
Published Mon, Sep 15 2014 2:06 PM | Last Updated on Thu, Sep 6 2018 3:01 PM
Advertisement
Advertisement