సచివాలయ ఉద్యోగుల రికార్డులను తనిఖీ చేయండి!
హైదరాబాద్: తెలంగాణ ఉద్యోగుల వివరాలను సేకరించాలని అధికారులకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. సచివాలయ ఉద్యోగుల సర్వీస్ రికార్డులను తనిఖీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఉద్యోగుల సర్వీసు రికార్డుల తనిఖీ కోసం అధికారులతో ఓ ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని తీర్మానించారు. కమిటీ వివరాలు మరో రెండు మూడ్రోజుల్లో ఉత్తర్వులు వెలువడనున్నట్టు అధికారులు తెలిపారు.