100 శాతం పన్ను వసూలు గగనమే | not possible in 100 percent tax | Sakshi
Sakshi News home page

100 శాతం పన్ను వసూలు గగనమే

Published Mon, Mar 20 2017 2:11 AM | Last Updated on Tue, Sep 5 2017 6:31 AM

100 శాతం పన్ను వసూలు గగనమే

100 శాతం పన్ను వసూలు గగనమే

ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నా గ్రామాల్లో వసూలైంది 71 శాతమే
ప్రజాప్రతినిధుల నుంచి అధికారులకు లభించని సహకారం
పన్నులడిగితే ప్రజలు ఓట్లేయరనే భావనలో ప్రజాప్రతినిధులు


సాక్షి, హైదరాబాద్‌: గ్రామ పంచాయతీల్లో ఆస్తి పన్ను వసూలు ప్రక్రియకు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఓవైపు ఈ ఏడాది వందశాతం పన్ను వసూళ్లు చేయాలని ప్రభుత్వం అన్ని జిల్లాల్లోనూ ప్రత్యేక డ్రైవ్‌లు చేపట్టగా, మరోవైపు తమ గ్రామాల్లో ప్రభు త్వం ఎటువంటి అభివృద్ధి పనులు చేయనం దున పన్నులెందుకు కట్టాలని ప్రజలు ప్రశ్నిస్తు న్నారు.

పన్ను వసూళ్ల కార్యక్రమంలో ప్రజా ప్రతినిధుల సహకారం తీసుకోవాలని క్షేత్ర స్థాయి సిబ్బందికి ఉన్నతాధికారులు సూచిస్తుం డగా, పన్నులు కట్టమని ప్రజలను అడిగితే రాబోయే ఎన్నికల్లో తమకు ఓట్లు వేయరనే భావనలో ప్రజాప్రతినిధులు ఉన్నారు. అంతే కాకుండా రెండేళ్ల కిందట ‘గ్రామజ్యోతి’ పేరిట అన్ని గ్రామాల్లో అభివృద్ధి చేస్తామని ప్రజలకు ప్రభుత్వం ఎన్నో ఆశలు కల్పించిందని, ఆ మేరకు గ్రామాల అభివృద్ధికి సర్కారు నిధులు విడుదల చేయకపోవడంతో జనాల్లో నిరాశ నిస్పృహలు అలముకున్నాయని సర్పంచులు అంటున్నారు.

స్థానిక సంస్థలకు మూడేళ్లుగా ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం నుంచి అందలేదని, తాజా బడ్జెట్లోనూ కేటాయింపులు లేకపోవడం తమను మరింత నిరాశకు గురి చేసిందని ప్రజాప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆస్తి పన్నులు కట్టండంటూ ఇంటింటికీ తిరిగి చెబితే మరింత నవ్వులపా లవుతామని ఎంపీటీసీలు, సర్పంచులు అంటు న్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 8,695 గ్రామ పంచాయతీల్లో రూ.435కోట్ల ఆస్తి పన్ను వసూ లు లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించింది. అయితే.. మరో 10రోజులలో ఆర్థిక సంవత్సరం ముగి యనుండగా, ఇప్పటి వరకు కేవలం రూ.306.80 కోట్లు(71శాతం) మాత్రమే వసూ లైనట్లు అధికారులు లెక్కలు తేల్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement