నోటిఫికేషన్ జారీ చేసిన ఐసీడీఎస్ పీడీ
ఏడాదిన్నర తరువాత నియామకాలు
అంగన్‌వాడీలలో మెరుగు కానున్న సేవలు
రంగం సిద్ధం చేసిన అధికారులు
ఇందూరు : ఐసీడీఎస్‌లో కొలువు జాతరకు తెర లేచింది. ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులు, లింక్ వర్కర్ పోస్టులను భర్తీ చేయడానికి పీడీ రాములు చర్యలు ప్రారంభించారు. జిల్లాలోని పది ప్రాజెక్టులలో ఖాళీగా ఉన్న పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ మంగళవారం నోటీఫికేషన్ విడుదల చేశారు. పూర్తి వివరాలను సీడీ పీఓల నోటీసు బోర్డులలో ఉంచామని తెలిపారు.
మొత్తం 493 పోస్టులను భర్తీ చేస్తున్నామన్నారు. ఈ నెల 21లోగా సీడీపీఓ కార్యాలయాలలో దరఖాస్తులను అందజే యా లని సూచించారు. మెయిన్ అంగన్‌వాడీ కార్యకర్తకు పదవ తరగతి, మినీ అంగన్‌వాడీ కార్యకర్త, హెల్పర్, లింక్ వర్కర్‌కు ఏడవ తరగతి ఉత్తీర్ణత అర్హతగా నిర్ణ యించామన్నారు. దాదాపు ఏడాదిన్నర తరువాత ఐసీడీఎస్‌లో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ కానుండడంతో అంగన్‌వాడీ కేంద్రాలలో సేవలు మెరుగుపడనున్నాయి.
కొలువుల జాతర
Published Wed, Nov 12 2014 3:17 AM | Last Updated on Wed, Sep 19 2018 8:32 PM
Advertisement
Advertisement