హైదరాబాద్ : ఉపాధి హామీ పథకం ద్వారా కుటుంబానికి ఇచ్చే గరిష్ట పనిదినాలను రాష్ట్రంలో 150 రోజులకు పెంచుతూ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్పీ టక్కర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామీణ ప్రాంతాలలో కూలీలకు అవసరమైన పనులను కల్పించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకం ద్వారా సాధారణంగా ప్రతి కుటుంబానికి గరిష్టంగా వంద రోజుల పనులు కల్పిస్తారు. అయితే రాష్ట్రంలో ఈ ఏడాది కరువు పరిస్థితులు నెలకొన్న దృష్ట్యా ఈ ఆర్థిక ఏడాదిలో పనిదినాల సంఖ్యను పెంచాలని నిర్ణయించారు.