నిజామాబాద్ (సదాశివనగర్): ఈ నెల 12 న జరగనున్న ముఖ్యమంత్రి పర్యాటనకు సర్వం సిద్ధమైంది. మిషన్ కాకతీయలో భాగంగా ఏర్పాటు చేయనున్న కార్యక్రమానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిజామాబాద్ జిల్లా సదాశివపేటకు రానున్నారు. ఈ సందర్భంగా భద్రతా చర్యలను కట్టుదిట్టం చేసిన జిల్లా ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి మంగళవారం సీఎం సందర్శనించనున్న ప్రాంతాన్ని పరిశీలించారు.