హైదరాబాద్: తెలంగాణ సీపీఎం తొలి రాష్ట్ర మహాసభలు వచ్చే ఫిబ్రవరి 26 నుంచి మార్చి 1 వరకు హైదరాబాద్‌లో జరగనున్నాయి. ఈ నెల 15న సుందరయ్య విజ్ఞానకేంద్రంలో ఆహ్వానసంఘం సమావేశం జరగనుంది. వచ్చే జనవరి 20 నుంచి ఫిబ్రవరి 10 వరకు రాష్ట్రంలోని మొత్తం పార్టీ కేడర్‌ను హైదరాబాద్‌కు తీసుకొచ్చి 3 వేల దళాలతో రాష్ట్ర మహాసభల ప్రచార కార్యక్రమాలను నిర్వహించనున్నారు. రాజధానిలోని కనీసం 10 లక్షల ఇళ్లకువెళ్లి సీపీఎం కార్యక్రమాల గురించి, మహాసభల గురించి కరపత్రాలు, ఇతర ప్రచార కార్యక్రమాలతో తెలియజేయనున్నట్లు ఆ పార్టీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ‘సాక్షి’కి చెప్పారు.
మార్చి 1న నిజాం కాలేజీలో బహిరంగసభను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా 50 వేల మందితో నగరంలో కవాతును నిర్వహిస్తామన్నారు. కాగా, వచ్చే ఏడాది ఏప్రిల్ 15-19 తేదీల మధ్య విశాఖపట్టణంలో సీపీఎం జాతీయమహాసభలు జరగనున్నాయి. ఈ విషయమై చర్చించేందుకు తెలంగాణ, ఏపీ శాఖల సెక్రటేరియట్ భేటీ ఆదివారం ఎంబీభవన్‌లో జరిగింది.
ఫిబ్రవరి 26 నుంచి తెలంగాణ సీపీఎం తొలి మహాసభలు
Published Sun, Oct 5 2014 11:48 PM | Last Updated on Sat, Sep 2 2017 2:23 PM
Advertisement
Advertisement