'కేసీఆర్ సమాధానం చెప్పాలి' | tammineni veerabhadram slams on kcr | Sakshi
Sakshi News home page

'కేసీఆర్ సమాధానం చెప్పాలి'

Published Tue, Jan 27 2015 2:16 PM | Last Updated on Thu, Jul 11 2019 9:08 PM

'కేసీఆర్ సమాధానం చెప్పాలి' - Sakshi

'కేసీఆర్ సమాధానం చెప్పాలి'

హైదరాబాద్: మంత్రి వర్గం నుంచి రాజయ్యను తొలిగించడంపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు సమాధానం చెప్పాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. ఆయన మంగళవారమిక్కడ మాట్లాడుతూ...రాజయ్య బర్తరఫ్ పార్టీ అంతర్గతం కాదని,  దాని వెనుక ఉన్న మతలబు ప్రజలకు తెలియాలన్నారు.

భారత్ లో అమెరికా అధ్యక్షుడు ఒబామా పర్యటన వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని విమర్శించారు. ఇంటింటికి సీపీఎం కార్యక్రమానికి మంచి ఆదరణ లభించదని, ఇప్పటి వరకు ప్రజల నుంచి రూ. 1.20 కోట్ల విరాళాలు వచ్చాయని తమ్మినేని తెలిపారు. ఫిబ్రవరి 16 నుంచి తెలంగాణలో జరగబోయే మహాసభలకు అంతా సిధ్దమని తమ్మినేని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement