అంధకారంలో ఆదిలాబాద్
- ఈదురుగాలులు, వర్ష బీభత్సం
- 15 మండలాలకు నిలిచిపోయిన విద్యుతఖ సరఫరా
- సుమారు 500 ఇళ్లు ధ్వంసం.. వేల ఎకరాల్లో పంట నష్టం
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్: అకాల వర్షం.. ఈదురుగాలులు సృష్టించిన బీభత్సంతో ఆదిలాబాద్ చీకట్లో మగ్గుతోంది. సోమవా రం రాత్రి నుంచి మంగళవారం రాత్రి వరకు సుమారు 15 మండలాల్లో కరెంటఖ లేక ప్రజలు అంధకారంలో మగ్గుతున్నారు. మరో రెండు రోజుల పాటు విద్యుత్తు పునరుద్ధరణ జరిగే పరిస్థితులు కనిపించడం లేదు. గురువారం వరకు విద్యుత్తు పునరుద్ధరణ పనులు పూర్తి చేయగలమని ఉన్నతాధికారులే చెబుతుండడంతో.. అంతకంటే ఎక్కువ సమయమే పట్టేలా ఉంది.
సోమవారం రాత్రి బలమైన ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన జిల్లాను అతలాకుతలం చేసింది. ఈ వర్షం ధాటికి నిర్మల్ నుంచి ఆదిలాబాద్ డివిజన్కు విద్యుతఖ సరఫరా చేసే 132 కేవీ విద్యుత్తు లైను భారీ టవర్లు నేలకూలాయి. నిర్మలఖ మండలం ఎల్లారెడ్డిపేటఖ సమీపంలో రెండు టవర్లు (71డీ, 72 డీ) ధ్వంసమయ్యాయి. దీంతో జిల్లా కేంద్రంతోపాటు, 15 మండలాల పరిధిలో 300 గ్రామాలకు సోమవారం రాత్రి నుంచి విద్యుతఖ సరఫరా నిలిచిపోయింది. కరెంటఖ లేకపోవడంతో మంచి నీళ్లు కూడా దొరక్క ప్రజలు నానా అవస్థలు పడ్డారు. ప్రత్యామ్నాయ విద్యుత్తు లైనఖ ద్వారా మంగళవారం రాత్రి జిల్లా కేంద్రంలో కొన్ని గంటపాటు విద్యుత్తు సరఫరా చేయగలిగారు.
అంధకారంలో ఉన్న మండలాలివే..
ఆదిలాబాద్, జైనథ్, బేల, బోథ్, తలమడుగు, తాంసి, నేరడిగొండ, బజార్‌హత్నూర్, ఇచ్చోడ, గుడిహత్నూర్, ఉట్నూర్, ఇంద్రవెల్లి, నార్నూర్, జైనూర్, సిర్పూర్(యూ) మండలాల పరిధిలోని గ్రామాలు అంధకారంలో ఉండిపోయాయి.
సుమారు 500 ఇళ్లు ధ్వంసం..
ఈదురు గాలులకు జిల్లాలోని సుమారు 500 ఇళ్లు ధ్వంసమయ్యూరుు. నిర్మలఖ పరిధిలోని 4 మండలాల్లో వర్షం బీభత్సం సృష్టించింది. వర్షం రైతులను కూడా నిండా ముంచింది. అకాల వర్షానికి జిల్లా వ్యాప్తంగా వెయ్యి ఎకరాలకు పైగా పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. కాగా, వర్షం బీభత్సం సృష్టించిన నిర్మలఖ మండలాల్లో మంత్రులు జోగురామన్న, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి సందర్శించారు. ఇళ్లు ధ్వంసమైన బాధితులను పరామర్శించారు.