'విపక్షాలు వైఖరి మార్చుకోవాలి' | Opposition parties should their behaviour, says ramalingareddy | Sakshi
Sakshi News home page

'విపక్షాలు వైఖరి మార్చుకోవాలి'

Published Sat, Mar 11 2017 12:02 PM | Last Updated on Tue, Sep 5 2017 5:49 AM

Opposition parties should their behaviour, says ramalingareddy

హైదరాబాద్‌: రేవంత్‌ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య సస్పెన్షన్‌ సబబేనని.. ఇప్పటికైనా విపక్షాలు తమ వైఖరిని మార్చుకోవాలని అధికార పార్టీ ఎమ్మెల్యే రామలింగారెడ్డి అన్నారు. శనివారం మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడుతూ.. కాంగ్రెస్‌, టీడీపీలు ఒకే రీతిన వ్యవహరించాయని అన్నారు. జానారెడ్డి సభను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. ఆయన లాంటి సీనియర్‌ నేత అబద్ధాలు చెప్పడం సరికాదని అన్నారు. 
 
టీడీపీ సభ్యుల సస్పన్షన్‌పై కాంగ్రెస్‌, బీజేపీ, సీపీఎంల వాకౌట్‌ విడ్డూరంగా ఉందని అన్నారు. మహారాష్ట్ర గవర్నర్‌ ప్రసంగానికి అడ్డుపడ్డ సభ్యులను రెండేళ్ల పాటు సస్పెండ్‌ చేసిన విషయం కిషన్‌ రెడ్డికి తెలియదా? అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే ఆర్కే రోజా సస్పెన్షన్‌ను ఏపీలో టీడీపీ మిత్రపక్షంగా ఉన్న బీజేపీ ఎందుకు వ్యతిరేకించలేదు? ఇప్పటికైనా విపక్షాలు తమ వైఖరి మార్చుకోవాలని హితవు పలికారు. సస్పెండైన సభ్యులు బేషరతుగా సభకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement