- కాంగ్రెస్, టీడీపీ, సీపీఎం అసంతృప్తి
సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గురు వారం శాసనసభకు ఇచ్చిన సమాధానం తీవ్ర నిరాశ కలిగించిందని నిరసన వ్యక్తం చేస్తూ కాంగ్రెస్, టీడీపీ, సీపీఎం సభ నుంచి వాకౌట్ చేశాయి. మరోవైపు సీఎం సమాధానం బాగుం దంటూ బీజేపీ, మజ్లిస్ అభినందించాయి. సీఎం సమాధానం అనంతరం కాంగ్రెస్ సభ్యుడు భట్టి మాట్లాడుతూ, ఆయన నుంచి స్పష్టమైన సమా ధానం రాలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర సాధన కోసం ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థు లకే ప్రభుత్వం అన్యాయం చేస్తోందన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల కాక విద్యార్థులు దిక్కుతోచని పరిస్థితిలో చిక్కుకున్నా రన్నారు. ఎస్సీ, ఎస్టీల విదేశీ విద్యకు స్కాలర్ షిప్‌లు మంజూరు చేస్తున్నా నిధులు విడుదల చేయడం లేదన్నారు.
సీఎం ప్రకటన పట్ల తాము కూడా నిరసన తెలుపుతున్నామని టీడీపీ, సీపీ ఎం పక్ష నేతలు రేవం త్‌రెడ్డి, సున్నం రాజయ్య ప్రకటించారు. కాంగ్రెస్ సభ్యులతో పాటు వాకౌ ట్ చేశారు. సీఎం సమాధానంపై తమకు విశ్వా సం ఉందని బీజేపీఎల్పీ నేత కిషన్‌రెడ్డి పేర్కొన్నా రు. అనాథశ్రమాల్లో చదువుకుంటున్న విద్యార్థు లు ఆదాయ ధ్రువీకరణ పత్రాలు పొందలేకపో తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాలేజీల నుంచి విద్యార్థుల సర్టిఫికెట్లు ఇప్పించాలన్నారు. తాము లేవనెత్తిన అంశాలకు సీఎం స్పష్టమైన జవాబిచ్చారని అక్బరుద్దీన్ ఒవైసీ కొ నియాడారు.
కాంగ్రెస్ వాకౌట్ శోచనీయం: సీఎం
కాంగ్రెస్ పార్టీ వాకౌట్ చేయడం శోచనీయమని కేసీఆర్ అన్నారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో విజయానికి 6 నెలల ముందు ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం తెచ్చి అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదని ఎద్దేవా చేశారు.