ఓ యువకుడు తాను మరణిస్తూ తన అవయవాలు దానంచేసి మరో ఐదుగురికి ప్రాణదానం చేశాడు.
హైదరాబాద్: ఓ యువకుడు తాను మరణిస్తూ తన అవయవాలు దానంచేసి మరో ఐదుగురికి ప్రాణదానం చేశాడు. నిమ్స్ జీవన్‌దాన్ ప్రతినిధి అనూరాధ తెలిపిన వివరాలప్రకారం...నల్లగొండ జిల్లా ఆత్మకూర్ మండలానికి చెందిన సోమేష్ చారి (35) ప్రవేట్‌ఉద్యొగి. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ నెల 4వ తేదీన నల్లగొండలో తన ద్విచక్రవాహనంపై వెలుతుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం అక్కడి స్థానిక ఆసుపత్రికి తీసుకువెళ్లగా పరిశీలించిన వైద్యులు మెరుగైన చికిత్స కోసం నగరంలోని కిమ్స్ ఆసుపత్రికి తీసుకువెళ్లాలని సూచించారు. కిమ్స్‌లో చికిత్స పొందుతున్న సోమేష్ చారి ఈ నెల 11వ తేదీన బ్రైయిన్‌డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఆసుపత్రి జీవన్‌దాన్ ప్రతినిధులు చారి కుటుంబసభ్యులకు అవయవదానం గురించి వివరించారు. వారు ఒప్పుకోవడంతో సోమేష్ చారికి శస్త్రచికిత్స నిర్వహించి అతని శరీరంలోనుండి రెండు కిడ్నిలు, కాలేయం, రెండు హార్ట్‌వాల్వ్స్ తొలగించి అవసరమైన వారికి అమర్చారు.