ఉస్మానియా యూనివర్సిటీలో ఈ నెల 10వ తేదీన విద్యార్థులు నిర్వహిస్తున్న బీఫ్ ఫెస్టివల్‌లో నిషేధిత గోమాంసం వండటం లేదని సీపీఐ గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి డాక్టర్ డి.సుధాకర్ తెలిపారు.
కాచిగూడ : ఉస్మానియా యూనివర్సిటీలో ఈ నెల 10వ తేదీన విద్యార్థులు నిర్వహిస్తున్న బీఫ్ ఫెస్టివల్‌లో నిషేధిత గోమాంసం వండటం లేదని సీపీఐ గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి డాక్టర్ డి.సుధాకర్ తెలిపారు. హిమాయత్‌నగర్‌లోని లిబర్టీ మీడియా సెంటర్‌లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
బీఫ్ ఫెస్టివల్‌లో గోమాంసం పెడుతున్నారంటూ కొంత మంది అనవసర రాద్ధాంతం చేస్తూ ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. బీఫ్ ఫెస్టివల్‌కు ఎలాంటి అనుమతులు అవసరం లేదని, ఫెస్టివల్‌ను అడ్డుకోవడమంటే ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమే అవుతుందన్నారు. బీఫ్ ఫెస్టివల్‌లో గోహత్య జరుగుతుందని తప్పుడు ప్రచారం చేసి ఘర్షణలు సృష్టించడం తగదని పేర్కొన్నారు.