రుణ గ్రహీతల్లో రాజకీయ నాయకులు, పైరవీకారులే అధికం
నకిలీ సర్టిఫికెట్లతో పొందినవారు మరికొందరు
అర్హులకు మొండిచేయి
బాన్సువాడ టౌన్ : ధన, రాజకీయ బలమున్న వారికే ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. నిరుద్యోగులకు, నిరుపేదలకు అందాల్సిన సబ్సిడి రుణాలను రాజకీయ నాయకులు, పైరవీకారులకు దక్కుతున్నాయి. కొందరైతే ఏకంగా నకిలీ సర్టిఫికెట్లతో సబ్సిడీ రుణాలు పొందుతున్నారు. ఇటీవల బాన్సువాడలో మంజూరైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ సబ్సిడీ రుణాలే నిదర్శనం. రుణం కోసం ఎస్సీ కార్పొరేషన్‌కు దరఖాస్తు చేసిన 30 మందిలో 15 మందికి మాత్రమే మంజూ రైంది.
ఎస్టీ కార్పొరేషన్‌కు 90 మంది దరఖాస్తు చేయగా 65 మందికి, బీసీ కార్పోరేషన్‌కు 80 మంది దరఖాస్తు చేయగా 16 మందికి, మైనార్టీ కార్పొరేషన్‌కు 96 మంది దరఖాస్తు చేయగా 73 మందికి మాత్రమే సబ్సిడీ రుణాలు మంజూరయ్యాయి. సంబంధిత కార్పొరేషన్ అధికారులను ‘మచ్చిక’ చేసుకున్న వారికి, పైరవీ చేసుకున్న వారికి మాత్రమే రుణాలు అందాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నారుు. కొందరు నకిలి సర్టిఫికెట్లతో సబ్సిడీ రుణాలు పొందారన్న ఆరోపణలు కూడా వినవస్తున్నారుు.
అన్ని అర్హతలున్నప్పటికీ రుణ మంజూరు జాబితాలో తమ పేరు లేకపోవడం, రాజకీయ నాయకులు.. పైరవీకారుల పేర్లు ఎక్కువగా ఉండడంపై మిగతా దరఖాస్తుదారులు ఆశ్చర్యం, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక్క లబ్ధిదారుడు/రాలు ఒక్కసారి సబ్సిడీ రుణం పొందినట్టయితే.. మరో ఐదేళ్ల వరకు పొందకూడదు. కానీ బాన్సువాడలో ప్రతి ఏటా సబ్సిడీ రుణాలు పొందుతున్న వారు అనేకమంది ఉన్నారు. వీటన్నింటిపై విచారణ జరిపించాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది.
ఐదేళ్లుగా తిరుగుతున్నా...
సబ్సిడీ రుణం కోసం ఐదేళ్లుగా మండల పరిషత్ కార్యాలయం చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నా. ఈసారైనా రుణం మంజూరవుతుందనే ఆశతో ఉన్నా. రుణం ఇస్తే ఏదైనా పనిచేసుకుని కుటుంబాన్ని పోషించాలనుకున్నా. నాయకులకు, ఆర్థిక బలం ఉన్నవారికే రుణాలు మంజూరయ్యూరుు. మాలాంటి గరీబోళ్లకు ఎవరూ న్యాయం చేస్తారు.
- పోల్కం రాజు
‘నకిలీ’లపై నివేదిస్తాం
నకిలి సర్టిఫికెట్లతో రుణాలు తీసుకున్నట్టరుుతే ఉన్నతాధికారులకు నివేదికలు పంపుతాం. వారికి మంజూరైన రుణాన్ని రద్దు చేస్తాం. దరఖాస్తుదారుల జాబితాను అధికారులకు పంపించాం. అక్కడి నుంచే తక్కువ మందికి రుణాలు మంజూరయ్యాయి.
- విజయభాస్కర్, ఎంపీడీఓ
‘కార్పొరేషన్’ రుణం.. ‘కొందరికే’ పరిమితం
Published Sat, Aug 1 2015 3:41 AM | Last Updated on Mon, Sep 17 2018 5:17 PM
Advertisement
Advertisement