దొంగ ఓట్లతోనే ఓడిపోయా... | over 1 lakh, 76 thousand bogus voters found in kukatpally, says gottimukkala padmarao | Sakshi
Sakshi News home page

దొంగ ఓట్లతోనే ఓడిపోయా...

Published Fri, May 29 2015 10:22 AM | Last Updated on Wed, Apr 3 2019 5:52 PM

దొంగ ఓట్లతోనే ఓడిపోయా... - Sakshi

దొంగ ఓట్లతోనే ఓడిపోయా...

హైదరాబాద్ : గత సార్వత్రిక ఎన్నికల్లో దొంగ ఓట్ల కారణంగానే తాను ఓటమి పాలయ్యానని కూకట్పల్లి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఇన్ఛార్జ్ గొట్టిముక్కల పద్మారావు అన్నారు. కూకట్పల్లి నియోజకవర్గంలో 4 లక్షల 82వేల 41 ఓట్లు ఉండగా అందులో లక్షా 67వేల ఓట్లు దొంగ ఓట్లుగా తేలాయని ఆయన నిన్న ఇక్కడ విలేకర్ల సమావేశంలో అన్నారు.

టీఆర్ఎస్ అభ్యర్థిని అయిన తనకు 57వేల ఓట్లు వచ్చినప్పటికీ, డూప్లికేట్ ఓట్ల మూలంగా పరాజయం పాలైనట్లు గొట్టిముక్కల తెలిపారు. రెండు రాష్ట్రాలలో ఒకేసారి కాకుండా రెండు విడతలుగా ఎన్నికలు జరగడం వల్ల కర్ణుడి చావుకు అనేక కారణాలన్నట్లు ఓటమి చూశానన్నారు. ఇప్పటికే దొంగ ఓట్ల విషయంలో ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు ఆయన పేర్కొన్నారు.  ఎన్నికల కమిషన్ ఇప్పటికైనా దొంగ ఓట్లను తొలగించి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలతో పాటు ఆ నియోజకవర్గాలలో తిరిగి ఉప ఎన్నికలు జరిపించాలని గొట్టిముక్కల కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement