పాడి కౌశిక్‌రెడ్డి
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ అభ్యర్థిగా పాడి కౌశిక్‌రెడ్డిని ఆ పార్టీ అధిష్టానం ఆదివారం రాత్రి ప్రకటించింది. ఆయనకు బీ ఫారం అందించింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13 స్థానాలకుగాను 10 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ హుస్నాబాద్‌ను సీపీఐకి అప్పగించింది.
హుజూరాబాద్, కోరుట్ల స్థానాలకు పదిరోజులుగా సస్పెన్స్ కొనసాగుతోంది. టీపీసీసీ కేంద్ర ఎన్నికల కమిటీ సిఫార్సు మేరకు హుజూరాబాద్‌ను కౌశిక్‌రెడ్డికి.. కోరుట్ల జువ్వాడి నర్సింగరావుకు ప్రకటించారు. ఈ మేరకు ఇద్దరు అభ్యర్థులకు బీ ఫారాలను అందించినట్లు పార్టీ నాయకులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment