
సాక్షి, హైదరాబాద్ : ప్యారడైజ్ హోటల్ తమ కస్టమర్లకు బంఫర్ ఆఫర్ ఇచ్చింది. బిర్యానీ ప్రియులకు ఐపీఎల్ టిక్కెట్లు గెలుచుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. ప్యారడైజ్ హోటల్, కోకకోలా బెవరేజెస్ సంయుక్తంగా ప్యారడైజ్ సర్కిల్‌లో నమోదుచేసుకున్న రెగ్యులర్ కస్టమర్లకు బిర్యానీతో పాటు ఐపీఎల్ 2019 టిక్కెట్లు గెలుచుకునే అవకాశం కల్పిస్తోంది. ‘ప్యారడైజ్ సర్కిల్’ తమ రెగ్యులర్ కస్టమర్లను ఉత్సాహపరిచే విధంగా సోమవారం ఉప్పల్ వేదికగా రాజీవ్‌గాంధీ స్టేడియంలో జరగనున్న సన్‌రైజర్స్ వర్సెస్ కింగ్స్ పంజాబ్ మ్యాచ్ టిక్కెట్లను బహుకరించనుంది. ప్యారడైజ్ సీఈఓ గౌతమ్ గుప్త మాట్లాడుతూ..‘‘ మా కస్టమర్లకు చక్కటి అనుభూతి కలిగించటానికే మేము ప్రయత్నిస్తుంటాం.
కోకకోలాతో కలిసి ఇలా మా రెగ్యులర్ కస్టమర్లను సత్కరించటం సంతోషంగా ఉంది. గత 65 సంవత్సరాలుగా హైదరాబాద్ నగర సంస్కృతి, సంప్రదాయాలలో ప్యారడైజ్ భాగంగా ఉంది. ప్రతి ఒక సంతోషకర సందర్భాన్ని మాతో పంచుకున్న మా నమ్మకమైన కస్టమర్లకు ఏదైనా కానుక ఇవ్వాలనే ప్రయత్నమే టిక్కెట్ల బహుమతులు. ఇది కేవలం బిర్యానీ ప్రియులకు మాత్రమే కాకుండా హలీమ్ ప్రియులకు కూడా సదవకాశం. ఇప్పటివరకు దాదాపు 10 లక్షల మంది కస్టమర్లు ఈ కార్యక్రమంలో నమోదై ఉన్నార’’ని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment