కరీంనగర్ : తెలంగాణ ఉద్యమంలో చూపినా తెగువను రాష్ట్ర పునర్నిర్మాణంలోనూ చూపాలని, బంగారు తెలంగాణ నిర్మాణానికి బాటలు వేయాలని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ యువతకు పిలుపునిచ్చారు. రెవెన్యూ గార్డెన్స్‌లో శనివారం టీఆర్‌ఎస్వీ జిల్లా కార్యవర్గం ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన వారు మాట్లాడుతూ నదులు, నీళ్లు, ఉద్యోగాల కోసమే తెలంగాణ ఉద్యమం పుట్టిందని, కోట్లాడి సాధించుకున్న రాష్ట్రంలో అభివృద్ధే ఎజెండాగా ముందుకుసాగుదామని అన్నారు.
రాష్ట్రం కోసం పోరాడిన విద్యార్థులకు ఎన్నికల్లో టికెట్లు ఇచ్చి గెలిపించుకున్న ఘనత, నామినేటెడ్ పోస్టులిచ్చిన చరిత్ర సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. ఆర్నెల్లలోనే రైతులకు రుణమాఫీ, ఇన్‌పుట్ సబ్సిడీ, చెరువుల పునరుద్ధరణ, వాటర్‌గ్రిడ్ వంటి అనేక పథకాలు ప్రారంభించిన ఘనత టీఆర్‌ఎస్‌కే దక్కుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల విద్యార్థులకు జనవరి ఒకటి నుంచి సన్నబియ్యం అందిస్తామని వివరించారు.
తెలంగాణ పబ్లిక్ కమిషన్ ఏర్పాటైన నేపథ్యంలో వేలాది ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చే అవకాశముందన్నారు. టీఆర్‌ఎస్వీ జిల్లా అధ్యక్షుడు, ఇల్లంతకుంట జెడ్పీటీసీ సిద్ధం వేణు మాట్లాడుతూ విద్యార్థులకు పార్టీలో పదవులు ఇచ్చిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. విద్యార్థి జేఏసీ నాయకుడు ఏనుగు రవీందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కెమసారం తిరుపతి, బీఎస్‌ఎఫ్ నాయకులు రంజిత్, దుబ్బయ్య, దీకొండ నాగరాజు మాట్లాడారు. పొన్నం అనిల్‌గౌడ్, కాటం సురేశ్ కుమార్, సుదగోని శ్రీనాథ్ గౌడ్, కొంకటి శేకర్, రాజాంజనేయులు, రామడుగు రాజేశ్, ప్యాట సురేశ్, శేకర్‌బాబు, గోగుల గణేశ్, పటేల్ శ్రావణ్‌రెడ్డి, రవివర్మ, రవితేజ, ఫహద్, గణేశ్ తదితరులు పాల్గొన్నారు.
భారీ ర్యాలీ.. తెలంగాణ పాటల హోరు
పిడమర్తి రవి, ఎంపీ బాల్క సుమన్ జిల్లాకు తొలిసారి వచ్చిన నేపథ్యంలో టీఆర్‌ఎస్వీ కార్యకర్తలు వందలాది బైక్‌లతో ర్యాలీ నిర్వహించారు. గాయకుడు సుధీర్ ఆ లపించిన పాటలు ఉత్తేజం నింపాయి. రవి, బాల్క సు మన్ స్వయంగా వాహనాలు నడుపుకుంటూ వచ్చారు.
పలు సంఘాల సన్మానం ..
పిడమర్తి రవి, బాల్క సుమన్‌ను వివిధ కుల సంఘాలు, విద్యార్థి సంఘాలు సన్మానించాయి. తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర నాయకులు కంసాల శ్రీనివాస్, ముల్కల గంగారాం, కొంకటి శ్రీనివాస్ గజమాలతో సన్మానించారు. విద్యార్థి జేఏసీ పక్షాన సిద్దం వేణు, రవీందర్‌రెడ్డి, తిరుపతి, పొన్నం అనిల్, సురే శ్‌తో పోటాపోటీగా సన్మానించారు.
రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములమవుదాం
Published Sun, Dec 28 2014 2:16 AM | Last Updated on Sat, Aug 11 2018 5:13 PM
Advertisement
Advertisement