ఆసరా హైజాక్ ! | Pensions are not eligible | Sakshi
Sakshi News home page

ఆసరా హైజాక్ !

Published Wed, Feb 18 2015 1:37 AM | Last Updated on Fri, May 25 2018 6:12 PM

ఆసరా హైజాక్ ! - Sakshi

ఆసరా హైజాక్ !

 అనర్హులకు పింఛన్లు ‘ఆధార్’ ఆధారంగా అక్రమాలు మార్పులు, చేర్పులతో మాయూజాలం  దళారులుగా మారిన అధికారులు  పలు ప్రాంతాల్లో వారే సూత్రధారులు  ఆఫీసర్లు, నాయకులకు వేర్వేరు లెక్కలు

మొన్న పరకాల.. ఇటీవల మొగుళ్లపల్లి... తాజాగా మరికొన్ని మండలాలు...  ‘ఆసరా’లో అక్రమాల పరంపర ఇలా జిల్లాను చుట్టేస్తోంది. అధికార యంత్రాంగం ఎంత పకడ్బందీ ఏర్పాట్లు చేసినా.... అక్రమాలకు అడ్డుకట్ట వేయలేక పోతోంది. కొత్త రకం అడ్డదారులతో అనర్హులు పింఛన్‌దారులుగా నమోదవుతుండగా... అర్హులకు  అన్యాయమే ఎదురవుతోంది. కొన్ని చోట్ల మండలాధికారులే దళారుల అవతారం ఎత్తగా... పలు గ్రామాల్లో నాయకులు తమ వాక్‌చాతుర్యంతో  ‘ఆసరా’ను హైజాక్ చేస్తున్నారు.  
 
చేసేది ఇలా..
 
ఆధార్‌కార్డుల్లో  వయసు మార్చి...  ప్రభుత్వ ఉద్యోగులున్నా ఏమార్చి...  చిరునామాలో మార్పు చేసి ఒకే ఇంట్లో ఇద్దరిని చేర్చి...  ‘సదరం’లో వైకల్య శాతం పెంచి...
 
వ్యక్తికో రేటు అధికారులైతే ఒక్కరికి  మొదటి నెల పింఛన్ నాయకులైతే రూ.2 వేల నుంచి రూ. 5 వేలు
 
 
హన్మకొండ అర్బన్/పరకాల :  రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆసరా పథకం లక్ష్యం తలకిందులవుతోంది. పింఛన్ల పంపిణీ అర్హులకు అందని ద్రాక్షగా మారగా... అనర్హులకు ఆసరాగా నిలుస్తోంది. అంతేకాదు.. దళారులుగా మారిన మండల అధికారులు, చోటామోటా నాయకులకు ఇది వరంగా మారుతోంది. అక్రమార్కుల చేతివాటంతో ఈ పథకంలో చీకటి కోణాలు అలుముకున్నాయి. తప్పుడు మార్గాల్లో చేతులు తడిపి ఆధార్‌కార్డులు, సదరం సర్టిఫికెట్లలో మార్పులు, చేర్పులు చేస్తుండడంతో ఈ పథకం పక్కదారి పడుతోం ది.  పింఛన్ల మంజూరుకు ప్రస్తుత ప్రభుత్వం ఆ ధార్ నంబర్ తప్పనిసరి చేసింది. ఈ క్రమంలో దళారులు ఆధార్ నుంచే అక్రమ తతంగానికి తెరలేపారు. ఆధార్‌లో ఉన్న వయసు, చిరునా మా మార్చేస్తున్నారు. ఆధార్ మాస్టర్ డాటాతో సంబంధం లేకుండా కొత్తగా మీ సేవా కేంద్రాల నుంచి తీసుకునే ప్రింట్‌పై మాత్రమే ఈ మా ర్పు కనిపిస్తోంది. ఈ విషయంలో డాటా ఎంట్రీ ఆపరేటర్లు కీలకంగా పనిచేస్తున్నట్లు సమాచా రం. అధికారులు కూడా ఈ అక్రమ తతంగం గర్తించలేక పోతుండడంతో అనర్హులు... అర్హులుగా మారి పింఛన్ పొందుతున్నారు. ఈ దం దాకు సంబంధించి మీసేవ కేంద్రాల ఆపరేటర్లు ఒక్కొక్కరికి రూ.2 వేల వరకు ముడుతున్నట్లు సమాచారం. ఇటీవల మొగుళ్లపల్లి మండలంలో ని ఓ మీసేవా కేంద్రంపై స్థానిక తహసీల్దార్ చర్యలు తీసుకోవడం ఇందుకు నిదర్శనంగా ని లుస్తోంది. అధికారులైతే ఒక్కరికి మొదటి నెల పింఛన్, నాయకులైతే రూ.2 వేల నుంచి రూ. 5 వేల వరకు ముట్టజెబుతున్నట్లు సమాచారం.
 
పరకాల నుంచి హన్మకొండకు మారిన కేంద్రం


గతంలో పరకాల పట్టణంలో ఓ ఇంటర్నెట్ సెంటర్‌లో ఆధార్ కార్డుల వయసును మార్చి ఇచ్చే కౌంటర్ ప్రారంభించారు. పోలీసులు, రెవెన్యూ ఉద్యోగులకు తెలియడంతో నిర్వాహకులను అదుపులోకి తీసుకోని కౌన్సెలింగ్ ఇచ్చారు. అయినా కొన్ని సెంటర్లలో నకిలీ ఆధార్‌కార్డుల సృష్టి సాగుతున్నట్లు సమాచారం. పరకాలలో నిఘా ఎక్కువగా ఉండడంతో ఇప్పుడు హన్మకొండ సుబేదారిలోని ఓ ఇంటర్నెట్ సెంటర్‌కు సీన్ మారింది. రామకృష్ణాపూర్, సీతారాంపురం, కంఠాత్మకూర్ గ్రామాల నుంచి అధికసంఖ్యలో ప్రజలు హన్మకొండకు వచ్చి ఆధార్‌కార్డుల్లో మార్పులు చేసుకుంటున్నారు.

సదరంలోనూ ఇదే తీరు.

వికలాంగ ధ్రువీకరణలో భాగంగా నిర్వహిస్తున్న సదరం క్యాంపుల్లోనూ  ఇలాంటి పరిస్థితే నెలకొంది. సదరం క్యాంపులో వికలాంగత్వ శా తం ఎక్కువ వేసేందుకు ఒక్కొక్కరికి రూ. 5వేలు పలుకుతున్నట్లు సమాచారం. 2012 క న్నా ముందు తేదీలతో చాలా వరకు సదరం సర్టిఫికెట్లు కొందరు నకిలీల చేతుల్లో ఉన్నట్లు అ ధికారులు ఇదివరకే గుర్తించారు. తాజాగా మరికొందరు వికలాంగత్వ శాతం పెంచుకునేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు.

పరిశీలన లేకుండానే మంజూరు

వాస్తవానికి పింఛన్ మంజూరు విషయంలో ఆధార్ కార్డు ఉన్నట్లయితే దాని మాస్టర్ డాటాతో మంజూరు విషయంలో అధికారులు పరిశీలన చేయాలి. ఈపని క్షేత్రస్తాయిలో ఎంపీడీఓ వద్ద గానీ, రాష్ట్ర స్థాయిలో గానీ జరగాలి. అయితే ఆధార్ కార్డుపై ఉన్న వివరాలే ప్రమాణికంగా అధికారులు మంజూరు ఇస్తున్నారు. లబ్ధిదారులు ఇచ్చిన ఆధార్ వివరాలు...  సదరు వ్యక్తి ఆన్‌లైన్ ఆధార్ వివరాలు సరిచూడకపోవడం వల్ల అక్రమార్కులకు మేలు జరుగుతోంది. ఆధార్ మాస్టర్ డాటా పూర్తి స్థాయిలో అధికారుల వద్ద అందుబాటులో లేక పోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. జిల్లాలో సమారు 34 లక్షల మంది ఆధార్ కార్డులు పొందితే... కేవలం 30 లక్షల మంది వివరాలు మాత్రమే మాస్టర్ డాటాలో అధికారుల వద్ద అందుబాటులో ఉన్నారుు.
 
అక్రమార్కులపై చర్యలు తప్పవు

ఆధార్ కార్డుల్లో డేట్ ఆఫ్ బర్త్ మార్పుల విషయం కొన్ని చోట్ల మా దృష్టికి వచ్చింది. వాటి విషయంలో ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. ఆధార్‌లో డేట్ ఆఫ్ బర్త్ మార్చాలంటే తప్పని సరిగా స్థానిక తహసీల్దార్ జారీచేసిన  పుట్టిన తేదీ సర్టిఫికెట్ ఉండాలి. ఈవిషయంలో తహసీల్దార్లు, మీసేవా నిర్వాహకులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఇక మాస్టర్ డాటాతో సంబంధం లేకుండా చేసే అక్రమాల విషయంలో ప్రత్యేక దృష్టి పెడుతున్నాం. రాష్ట్ర స్థాయిలో ఆధార్ మాస్టర్ డాటాతో సరిచూసినప్పుడు ఈ అక్రమాలు వెలుగులోకి వస్తాయి. అప్పుడు  బండారం బయట పడుతుంది. అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవు.  త్వరలో అక్రమార్కులను వెలికి తీసి, చర్యలు తీసుకుంటాం.
 - రాము, డీఆర్ డీఏ పీడీ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement