ఆర్డీవో కార్యాలయంలో జెండా వందనం చేస్తున్న ఆర్డీవో చెన్నయ్య
హుజూరాబాద్ : నియోజకవర్గ వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా హుజూరాబాద్ సబ్‌కోర్డులో సబ్ జడ్జీ ప్రదీప్‌నాయక్ జెండా ఆవిష్కరణ చేయగా, న్యాయమూర్తులు శ్రీలేఖ, గువ్వల రాధిక, గాండ్ల రాధికలు పాల్గొన్నారు. ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో బోయపాటి చెన్నయ్య, తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ నల్లా వెంకట్‌రెడ్డి, నగరపంచాయతీ కార్యాలయంలో కమిషనర్ స్వరూపారాణి, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో కృష్ణప్రసాద్, డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ కృపాకర్, మార్కెట్ కార్యాలయంలో మార్కెట్ చైర్మన్ ఎడవెల్లి కొండాల్‌రెడ్డి, పోలీస్‌స్టేషన్‌లో సీఐ రమణమూర్తి, వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏడీఏ దామోదర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో టీఆర్‌ఎస్ పట్టణాధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణశాఖ అధ్యక్షుడు కాసిపేట శ్రీనివాస్ జెండావిష్కరణ చేశారు. అలాగే పట్టణంలోని పలు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో గణతంత్ర వేడుకలు అంబరన్నాంటాయి. విద్యార్థులు దేశ నాయకుల వేషాదారణతో ఆకట్టుకున్నారు. ఆయ పాఠశాలల్లో విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక నృత్యాలు ఆకట్టుకున్నాయి. గణతంత్ర వేడుకలను పురుష్కరించుకొని విద్యార్థులకు నిర్వహించిన పలు ప్రతిభ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అలాగే ఆయా రాజ కీయపార్టీల నాయకులు, కుల సంఘాలు, యువజన, విద్యార్థి, మహిళా, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో నగరపంచాయతీ చైర్మన్ విజయ్‌కుమార్, ఎంపీపీ వొడితల సరోజినీ దేవి, వైస్ చైర్మన్ తాళ్లపల్లి రజిత, ఆయా పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
హుజూరాబాద్‌రూరల్ : కొత్తపల్లిలోని మార్కెట్ కమిటీ కార్యాలయంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఎడవెల్లి కొండాల్‌రెడ్డి, టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి బండ శ్రీనివాస్, పట్టణ శాఖ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, నాయకులు డిష్ రమేష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఖాలీద్ హుస్సేన్‌లు, పైర్ స్టేషన్ కార్యాలయంలో ఎస్సై అనంతరావు, సింగా పూర్ పశువైద్యాధికారి కార్యాలయంలో డాక్టర్ మాధవరావు, చెల్పూర్ పీహెచ్‌సీలో డాక్టర్ రాజమౌళి, కేసీ క్యాంపులోని హుజూ రాబాద్ పోలీస్ సబ్ డివిజనల్ అధికారి కార్యాలయంలో ఏసీపీ టి. కృపాకర్‌లతో పాటు పలు గ్రామపంచాయతీల ఆవరణలో గ్రామ సర్పంచులు జాతీయ జెండాలు ఎగరవేశారు. గణేష్‌నగర్ కాలనీలో కౌన్సిలర్ బర్మావత్ యాదగిరి, చెట్టి శ్రీనివాస్, నాయకులు అంపటి సుదీర్, మార్కెట్ డైరెక్టర్ ప్రభాకర్‌రెడ్డి, రియాజ్ తదితరులు ఉన్నారు.
కిట్స్ కళాశాలలో ..
సింగాపూర్‌లోని కిట్స్ ఇంజనీరింగ్‌కళాశాలలో వేడుకలు అంబరాన్నంటాయి. ఈ సందర్భంగా ఎన్‌సీసీ లెప్ట్‌నెంట్ అధికారి కల్లెం రవీంద్రబాబు ఆధ్వర్యంలో ఎన్‌సీసీ కెడెట్లు నుంచి కళాశాల ప్రిన్సిపాల్ కందుకూరి శంకర్ గౌరవ వందనం స్వీకరించారు.
ఇల్లందకుంటలో..
ఇల్లందకుంట: తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ రమేష్, పోలీస్ సేష్టన్‌లో సీఐ నారాయణ, గ్రామపంచాయతీ వద్ద సర్పంచ్ పెద్ది స్వరూపకుమార్, వ్యవసాయ కార్యాలయంలో ఏవో రజిత, ప్రా«థమిక సహకార సంఘంలో అధ్యక్షుడు వాసుదేవరెడ్డి, శ్రీసీతారామ చంద్ర స్వామి దేవాలయంలో ఈవో సులోచనతోపాటు ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు జాతీయ జెండాను ఎగురవేశారు. నాయకుల వేషధారణలో చిన్నారులు ఆకట్టుకున్నారు. ఒగ్గుకళాకారులు డప్పు చప్పుల్లతో అందరిని అలరించారు.
జమ్మికుంటలో..
జమ్మికుంట: పోలీసు స్టేషన్, నగర పంచాయతీ కార్యాలయం, గాంధీచౌక్, వ్యవసాయ మార్కెట్, సింగిల్‌విండో కార్యాలయం, వ్యవసాయ కార్యాలయం, ఎక్సైజ్ పోలీసు స్టేషన్, ఎంఈవో కార్యాలయం, ప్రభుత్వ, ప్రవేట్ కళాశాలలు, పాఠశాలలు, ఆటో యూనియన్లు, లారీ అసోసియోషన్, ఓడ్డెర కుల సంఘం, ఆగ్రి పాలి టెక్నిక్ కళాశాలల్లో జాతీయ జెండాలను ఏగురవేశారు.
వీణవంకలో..
వీణవంక: మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ తూము రవీందర్, ఠాణాలో ఎస్సై క్రిష్ణారెడ్డి, బస్టాండ్‌లో జెడ్పీటీసీ దాసారపు ప్రభాకర్, పీఏసీఎస్‌లో చైర్మన్ మాడ సాదవరెడ్డి, బేతిగల్ పీఎస్‌లో ఎంపీటీసీ గొట్టిముక్కుల ప్రేమలత రవీందర్‌రావు, మోడల్ స్కూల్‌లో ప్రిన్సిపాల్ డాక్టర్ వేణుగోపాల్‌రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించారు. కార్యక్రమంలో సర్పంచులు ఎక్కటి రాణమ్మ, చిన్నాల ఐలయ్య యాదవ్, సంపత్‌రావు, కాదాసు రాజమల్లయ్య, గెల్లు లక్ష్మిమల్లయ్య, ఎంపీటీసీలు తాండ్ర శంకర్, గెల్లు పద్మ, మండల టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ అ«ధ్యక్షుడు గంగాడి తిరుపతిరెడ్డి, నల్ల కొండాల్‌రెడ్డి, బత్తిని నరేశ్‌గౌడ్, మడుగూరి సమ్మిరెడ్డి, ఉపాధ్యాయ జేఏసీ కన్వీనర్ దాసారపు ప్రసాద్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment