republicday celebrations
-
రిపబ్లిక్ డే వేడుకలు.. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలపై ఆంక్షలు
న్యూఢిల్లీ: జనవరి 26 గణతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలపై పలు ఆంక్షలు విధించింది. రిపబ్లిక్ డే సన్నాహాల కారణంగా జనవరి 19 నుంచి 26 వరకు ఉదయం 10.20 గంటల నుంచి 12.45 వరకు విమానాల టేకాఫ్, ల్యాండింగ్లను నిషేధిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు పౌరవిమానయానశాఖ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో ఢిల్లీ ఎయిర్‌పోర్టు ఒకటి. రిపబ్లిక్‌డే వేడకల కోసం రాజధానిలో భద్రతను కట్టుదిట్టం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆసారి వేడుకల్లో తొలిసారి సరిహద్దు భద్రతా దళానికి(బీఎస్ఎఫ్) చెందిన మహిళా అధికారులతో మార్చ్ నిర్వహించనున్నారు. అసిస్టెంట్ కమాండెంట్ ర్యాంక్ మహిళా అధికారితోపాటుఇద్దరు సబార్డినేట్ ఆఫీసర్లు.. మొత్తం 144 మంది మహిళా BSF కానిస్టేబుళ్లకు నాయకత్వం వహించనున్నారు. గణతంత్ర దినోత్సవ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు దేశ రాజధానిలో నిఘా పెంచారు. కాగా భారత 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు దేశ రాజధాని ముస్తాబవుతోంది. జనవరి 26న ఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో నిర్వహించే ఈ భారీ పరేడ్‌కు ఫ్రాన్స్ దేశాధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఫ్రాన్స్ అధ్యక్షుడిని ప్రధాని మోదీ ఆహ్వానించగా.. ఇందుకు మెక్రాన్ కూడా అంగీకరించారు. దీనిపై ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎక్స్(ట్విటర్)లో స్పందించారు. ‘నా ప్రియమైన మిత్రుడు మోదీ.. మీ ఆహ్వానానికి ధన్యవాదాలు. మీ గణతంత్ర దినోత్సవ సందర్భంగా మీతో వేడుకలను జరుపుకోవడానికి నేను వస్తున్నాను’ అని పేర్కొన్నారు. చదవండి: బిల్కిస్ బానో కేసులో దోషులకు సుప్రీంకోర్టు బిగ్ షాక్ -
జైట్లీ, సుష్మాకు విభూషణ్
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగింటి ముద్దుబిడ్డ పీవీ సింధును పద్మభూషణ్ పురస్కారం వరించింది. సింధు సహా తెలంగాణ నుంచి ముగ్గురిని, ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరిని పద్మ పురస్కారాలు వరించాయి. ప్రజావ్యవహారాల రంగం నుంచి మాజీ కేంద్ర మంత్రులు, దివంగత జార్జి ఫెర్నాండెజ్, అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్‌లకు కేంద్రం పద్మవిభూషణ్ పురస్కారం ప్రకటించింది. మాజీ కేంద్ర మంత్రి దివంగత మనోహర్ పారికర్‌కు పద్మభూషణ్ పురస్కారం ప్రకటించింది. ఇటీవల దివంగతులైన పెజావర మఠాధిపతి శ్రీవిశ్వేశతీర్థ స్వామీజీకి పద్మవిభూషణ్ పురస్కారం ప్రకటించింది. బాక్సింగ్ క్రీడాకారిణి మేరీకోమ్‌ను పద్మవిభూషణ్ పురస్కారం వరించింది. గణతంత్ర దినోత్సవ వేళ భారత అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మ పురస్కారాలను హోం శాఖ శనివారం ప్రకటించింది. పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మ శ్రీ అనే మూడు కేటగిరీల్లో ఈ అవార్డులను ప్రకటించింది. కళలు, సామాజిక సేవ, ప్రజా సంబంధాలు, సైన్స్ అండ్ ఇంజినీరింగ్, వర్తకం, వాణిజ్యం, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు, సివిల్ సర్వీస్ వంటి రంగాల్లో అత్యుత్తమ సేవ కనబరిచిన వారికి ఏటా కేంద్రం ఈ పురస్కారాలు ప్రకటిస్తుంది. రాష్ట్రపతి భవన్లో ఏటా మార్చి, ఏప్రిల్‌లో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి ఈ పురస్కారాలను అందజేస్తారు. ఈ ఏడాది మొత్తం 141 పురస్కారాలకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారని హోం శాఖ ప్రకటించింది. వీటిలో నాలుగు పురస్కారాలను ఇద్దరికీ కలిపి ప్రకటించారు. 7 పద్మవిభూషణ్, 16 పద్మభూషణ్, 118 పద్మశ్రీ పురస్కారాలను ప్రకటించింది. ప్రధాని ప్రశంసలు.. ‘పద్మ’ పురస్కార గ్రహీతలను ప్రధాని మోదీ ప్రశంసించారు. మన సమాజానికి, దేశానికి మానవీయతకు అసాధారణ సేవలందించిన ప్రత్యేక వ్యక్తులు వీరు. వీరందరికీ శుభాకాంక్షలు’ అని ట్విట్టర్లో పేర్కొన్నారు. పద్మవిభూషణ్ (ఏడు) పురస్కారాలు: 1. జార్జి ఫెర్నాండెజ్(మరణానంతరం) 2. అరుణ్ జైట్లీ (మరణానంతరం) 3. అనిరు«ద్ జగ్నాథ్ జీసీఎస్కే 4. ఎం.సి. మేరీ కోమ్ 5. ఛన్నులాల్ మిశ్రా(హిందుస్తానీ గాయకుడు) 6. సుష్మా స్వరాజ్ (మరణానంతరం) 7. విశ్వేశతీర్థ స్వామీజీ (మరణానంతరం) పద్మభూషణ్ పొందిన వారిలో ప్రముఖులు: ఎం.ముంతాజ్ అలీ(ఆధ్యాత్మికం,–కేరళ) సయ్యద్ మౌజెం అలీ(మరణానంతరం), (ప్రజావ్యవహారాలు, బంగ్లాదేశ్), ముజఫర్ హుస్సేన్ బేగ్ (ప్రజా వ్యవహారాలు–జమ్మూకశ్మీర్), అజోయ్ చక్రవర్తి (కళలు–పశ్చిమ బెంగాల్), మనోజ్ దాస్ (సాహిత్యం, విద్య–పుదుచ్చేరి), బాల్కృష్ణ దోషి (ఆర్కిటెక్చర్–గుజరాత్), కృష్ణమ్మాళ్ జగన్నాథన్ (సామాజిక సేవ–తమిళనాడు), ఎస్.సి.జమీర్(ప్రజా వ్యవహారాలు, నాగాలాండ్), అనిల్ ప్రకాష్ జోషి (సామాజిక సేవ–ఉత్తరాఖండ్), త్సెరింగ్ లాండోల్ (వైద్యం, లదాఖ్), ఆనంద్ మహీంద్ర (వర్తకం, వాణిజ్యం–మహారాష్ట్ర), నీలకంఠ రామకృష్ణ మాధవ మీనన్ (మరణానంతరం) (ప్రజావ్యవహారాలు–కేరళ), మనోహర్ గోపాలకృష్ణ పారికర్ (మరణానంతరం) (ప్రజావ్యవహారాలు– గోవా), పి.వి.సింధు( క్రీడలు– తెలంగాణ), వేణు శ్రీనివాసన్ (వర్తకం, వాణిజ్యం–తమిళనాడు). 118 మందికి పద్మశ్రీ: మొత్తం 118 పద్మ శ్రీ పురస్కారాలను కేంద్రం ప్రకటించింది. ఇందులో తెలంగాణ నుంచి ఇద్దరికి ఈ పురస్కారం లభించింది. వ్యవసాయ రంగం నుంచి చింతల వెంకటరెడ్డి, సాహిత్యం మరియు విద్య రంగం నుంచి విజయసారథి శ్రీభాష్యం ఈ జాబితాలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరికి పద్మ శ్రీ పురస్కారం లభించింది. కళల రంగం నుంచి పౌరాణిక నటుడు యడ్ల గోపాలరావు, దళవాయి చలపతిరావులకు ఈ పురస్కారం లభించింది. దళవాయి చలపతిరావు తోలు బొమ్మలాట కథకుడిగా ప్రసిద్ధి చెందారు. ఇక బాలీవుడ్ సినీ ప్రముఖులు కంగనా రనౌత్, కరణ్ జోహార్, ఏక్తా కపూర్, అద్నన్ సమీ తదితరులకు పద్మశ్రీ పురస్కారం లభించింది. అరుణ్ జైట్లీ: 2019 మేలో ఈయన మృతి చెందారు. 2014–19 సంవత్సరాల మధ్య కేంద్ర కేబినెట్లో ఆర్థిక మంత్రిగా ఉన్నారు. సుప్రీంకోర్టు లాయర్ కూడా అయిన జైట్లీ ఆర్థిక మంత్రిగా వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) వంటి పలు విధానాలను ప్రవేశపెట్టారు. సాధారణ బడ్జెట్లోనే రైల్వే బడ్జెట్‌ను విలీనం చేశారు. సుష్మా స్వరాజ్: బీజేపీ సీనియర్ నేత, సుప్రీంకోర్టు లాయర్‌గా పనిచేసిన సుష్మా స్వరాజ్ గత ఏడాది చనిపోయారు. ప్రధాని మోదీ కేబినెట్లో విదేశాంగ శాఖ మంత్రిగా పనిచేసి అందరి ప్రశంసలు పొందారు. ఇందిరాగాంధీ తర్వాత విదేశాంగ శాఖ బాధ్యతలు చేపట్టిన రెండో మహిళ సుష్మా. జార్జి ఫెర్నాండెజ్: కార్మిక నాయకుడు, రాజకీయవేత్త, జర్నలిస్టు అయిన జార్జి మాథ్యూ ఫెర్నాండెజ్ లోక్‌సభలో అత్యధిక కాలం సభ్యునిగా కొనసాగిన వారిలో ఒకరు. 1967లో ముంబైలో ఆయన రాజకీయ జీవితం ప్రారంభమైనప్పటికీ బిహార్ నుంచే ఎక్కువ కాలం ప్రజాప్రతినిధిగా కొనసాగారు. శ్రీ విశ్వేశతీర్థ స్వామీజీ: ఉడుపి పెజావర మఠాధిపతి శ్రీ విశ్వేశతీర్థ స్వామీజీ దక్షిణాది ఆధ్యాత్మిక ప్రముఖుల్లో ఒకరు. దాదాపు 8 దశాబ్దాలపాటు ఆధ్యాత్మిక సేవ చేశారు. శ్రీ మధ్వాచార్యుడు స్థాపించిన ఉడుపి అష్ట మఠాల్లో పెజావర మఠం ఒకటి. విశ్వేశతీర్థ స్వామీజీ, ఛన్నులాల్ మిశ్రా, మనోహర్ పారికర్ అజ్ఞాత హీరోలు చండీగఢ్‌లోని పీజీఐ ఆస్పత్రి వద్ద రోగులు, వారి సహాయకులకు ఉచితంగా ఆహారం అందజేస్తున్న జగ్దీశ్ లాల్ అహూజా, దాదాపు 25 వేల అనాథ శవాలకు అంతిమ సంస్కారం జరిపిన ఫైజాబాద్‌కు చెందిన మొహమ్మద్ షరీఫ్, గజరాజుల వైద్యుడిగా పేరున్న అస్సాం వాసి కుషాల్ కొన్వర్ తదితర ఎందరో అజ్ఞాత హీరోలను ఈ ఏడాది పద్మశ్రీ వరించింది. 40 గ్రామాల్లోని ప్రత్యేక అవకరాలు కలిగిన 100 మంది పిల్లలకు 2దశాబ్దాలుగా ఉచిత విద్యనందిస్తున్న కశ్మీర్‌కు చెందిన దివ్యాంగుడు జావెద్ తక్, అడవుల్లోని సమస్త జీవజాతుల గురించి తెలిసిన, అటవీ విజ్ఞాన సర్వస్వంగా పేరు తెచ్చుకున్న కర్ణాటకకు చెందిన తులసి గౌడ(72)కు, 40 ఏళ్లుగా ఈశాన్య రాష్ట్రాల్లోని మారుమూల గ్రామాల్లో విద్యనందిస్తూ అంకుల్ మూసాగా పేరున్న అరుణాచల్‌కు చెందిన సత్యానారాయణ్కు ప్రభుత్వం పద్మశ్రీ ప్రకటించింది. -
బాలీవుడ్ పద్మాలు
గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 71వ పద్మ అవార్డులను ప్రకటించింది. అయితే అవార్డుల జాబితాలో తెలుగు చిత్రసీమకు సంబంధించిన వారెవరూ లేకపోవడం గమనార్హం. హిందీ చిత్రసీమకు నాలుగు పద్మాలు వరించాయి. ప్రముఖ దర్శక–నిర్మాత కరణ్ జోహార్, టీవీ టైకూన్ ఏక్తా కపూర్, ప్రముఖ కథానాయిక కంగనా రనౌత్, ప్రముఖ గాయకుడు అద్నాన్ సామీలను ‘పద్మశ్రీ’ వరించింది. శనివారం సాయంత్రం పద్మ అవార్డుల జాబితా వెలువడగానే ఈ నలుగురికీ ప్రశంసల వర్షం మొదలైంది. కంగ్రాట్స్ కరణ్ ఇండస్ట్రీకి పరిచయమై.. ఓ పేరు సంపాదించాలని.. ఓ మార్క్ సృష్టించాలని ఏ కళాకారుడైనా కోరుకుంటాడు. కానీ దర్శకుడు కరణ్ జోహార్ బాలీవుడ్ పరిచయమే ఓ ల్యాండ్‌మార్క్. ఆయన బ్యానర్లో పరిచయం కావడం ఆర్టిస్టులకు ఓ హాల్‌మార్క్. షారుక్ ఖాన్ ‘కుచ్ కుచ్ హోతా హై’ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు కరణ్ జోహార్. రొమాంటిక్ డ్రామాలో ఆ సినిమా ఒక ట్రెండ్ సృష్టించింది. ఆలియా భట్, సిద్ధార్థ్ మల్హోత్రా, వరుణ్ ధావన్, జాన్వీ కపూర్, సారా అలీఖాన్ వంటి స్టార్ కిడ్స్ను కరణ్ ఇండస్ట్రీకు పరిచయం చేశారు. ప్రస్తుతం వాళ్లు ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తున్నారు. నిర్మాత యశ్ జోహార్, హీరూ జోహార్ దంపతులకు జన్మించారు కరణ్. చిన్నప్పటి నుంచి సినిమా వాతావరణంలోనే తిరిగారు, పెరిగారాయన. చిన్నప్పటి నుంచే సినిమాల ప్రభావం ఆయన మీద ఉంది. షారుక్ ఖాన్ ‘దిల్వాలే దుల్హనియా లేజాయేంగే’ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశారు కరణ్. ఆ తర్వాత దర్శకుడిగా ‘కుచ్ కుచ్ హోతా హై, కభీ ఖుషీ కభీ గమ్, కభీ ఆల్విదా నా కెహ్నా, మై నేమ్ ఈజ్ ఖాన్, స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్, ఏ దిల్ హై ముష్కిల్’ సినిమాలు తెరకెక్కించారు. కరణ్ జోహార్‌కి స్క్రిప్ట్‌ని కమర్షియలైజ్ చేయడం తెలుసు. ఆడియన్స్ పల్స్ తెలుసు. అందుకే దర్శకుడిగా ఫ్లాప్ చూడలేదాయన. దర్శకుడిగా, నిర్మాతగా, నటుడిగా, టెలివిజన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుంటారు కరణŠ . ప్రస్తుతం బాలీవుడ్ పరిశ్రమలో ప్రముఖ పేరు కరణ్. 47 ఏళ్ల కరణ్ పెళ్లి చేసుకోలేదు. సరోగసీ ద్వారా (యష్, రూహీ) ఇద్దరు పిల్లలున్నారు. శభాష్ సమీ ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’ సినిమాలో ‘ఏ జిల్లా ఏ జిల్లా... ఓ పిల్లా నీదీ ఏ జిల్లా’ పాట విన్న శ్రోతలకు ఆ పాట పాడిన గాయకుడి గొంతు కొత్తగా, ఆశ్చర్యంగా అనిపించింది. ఆ గొంతు రెగ్యులర్‌గా లేదు. విభిన్నంగా అనిపించింది. కానీ పాడుతుంటే వినాలనుంది. శభాష్.. గొంతు బాగుందన్నారు. ఆ గాయకుడి జిల్లా ఏంటి? అని వాకబు చేశారు. అతని పేరు అద్నాన్ సమీ అని తెలిసింది. లండన్‌లో పుట్టి పెరిగారు అద్నాన్ సమీ. అఫ్ఘాన్ మూలాలున్న తండ్రి, జమ్మూ కశ్మీర్ మూలాలున్న తల్లికి జన్మించారు ఆయన. తొమ్మిదేళ్లకే పియానో వాయించడం మొదలుపెట్టారు సమీ. హాలిడేలో ఇండియాను సందర్శించినప్పుడు క్లాసికల్ మ్యూజిక్‌పై ఆసక్తి ఏర్పరుచుకొని నేర్చుకున్నాడు అద్నాన్. తన చురుకుతనాన్ని గమనించి సంగీతంలోనే కొనసాగమని ప్రముఖ గాయని ఆశా భోంస్లే సూచించారు. అప్పటి నుంచి సంగీతంలో మరింత శ్రద్ధపెట్టారు. ఇండియన్, వెస్ట్రన్ క్లాసిక్ మ్యూజిక్‌లో పట్టు సాధించారు. ‘నౌషద్ మ్యూజిక్’ అవార్డు అందుకున్న పిన్న వయస్కుడు అద్నానే. అద్నాన్ తొలి కంపోజిషన్ 1986లో ‘రన్ ఫర్ లైఫ్’ సాంగ్ సూపర్ హిట్ అయింది. 1995లో ‘సర్గం’ అనే పాకిస్థానీ సినిమాకు సంగీతం అందించారు. అందులో నటించారు కూడా. అది బ్లాక్‌బస్టరే. ‘కబీతో నజర్ మిలావో’ అనే ప్రేమ పాటల్ని ఆశా భోంస్లేతో కలసి ఆల్బమ్‌గా చేశారు. శ్రోతల్ని ఉర్రూతలూగించింది. 2001 నుంచి బాలీవుడ్ సినిమాలకు పాడటం, కంపోజ్ చేయడం మొదలుపెట్టారు అద్నాన్ సమీ. 2004లో ‘శంకర్ దాదా’తో తెలుగుకి పరిచయమయ్యారు. ఆ తర్వాత ‘నచ్చావే నైజాం పోరీ (వర్షం), భూగోళమంతా సంచిలోనా (శంకర్ దాదా జిందాబాద్), కళ్లూ కళ్ళూ ప్లస్ (100ç% లవ్), ఓ ప్రియా ప్రియా (ఇష్క్), ఓ మధు ఓ మధు (జులాయి) వంటి పాపులర్ పాటలు పాడారాయన. సక్సెస్ఫుల్ క్వీన్ బాలీవుడ్లో కంగనా ఫైర్ బ్రాండ్. అనుకున్నది అనుకున్నట్లే చెబుతుంది. ఏవరేమనుకుంటే ఏంటి? అంటుంది. ఎవరు చిన్నబుచ్చుకున్నా, తన అభిప్రాయాలను వెలిబుచ్చడంలో ఎప్పుడూ సంకోచించదు కంగనా. డాక్టర్ అవ్వాలని ఇంట్లో అన్నారు. యాక్టర్ అవుతాను అంది కంగనా. ఇంట్లో వద్దన్నారు. నా ఆశను వదలనంది కంగనా. గాడ్ ఫాదర్ లేకుండా ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానం ఏర్పరుచుకుంది కంగనా. వచ్చిన అవకాశాలను మెట్లుగా చేసుకుని సూపర్ స్టార్‌గా ఎదిగింది. ‘గ్యాంగ్‌స్టర్’(2006) సినిమా ద్వారా బాలీవుడ్‌కి పరిచయమైంది కంగనా. 2007లో ‘లైఫ్ ఇన్ ఏ మెట్రో’ చిత్రం తనకు కావాల్సిన గుర్తింపుని ఇచ్చింది. ఆ మరుసటి ఏడాదే మధుర్ బండార్కర్ తీసిన ‘ఫ్యాషన్’ సినిమాలో సహాయనటిగా జాతీయ అవార్డు అందుకుంది కంగనా. ప్రభాస్ ‘ఏక్ నిరంజన్’ సినిమాతో తెలుగులోనూ పరిచయమైంది. ‘క్వీన్, తను వెడ్స్ మను’ సినిమాలకు జాతీయ ఉత్తమ నటి అవార్డులను అందుకుంది. కంగనా కేవలం నటిగానే కాదు ‘క్వీన్’ సినిమాకు మాటల రచయితగా, సిమ్రాన్‌కి సహ రచయితగా, ‘మణికర్ణిక’ సినిమా కొంత భాగానికి దర్శకత్వం వహించి, దర్శకురాలిగా తన ప్రతిభను చూపించింది. ప్రస్తుతం కంగనా చేతిలో ఉన్న రెండూ లేడీ ఓరియంటెడ్ సినిమాలే. ఫోర్బ్స్ ఇండియా 100 లిస్ట్‌లో ఆరు సార్లు చోటు సంపాదించారామె. ఆమె ఫ్యాషన్ సెన్స్ విచిత్రంగానూ, స్టయిల్ స్టేట్‌మెంట్‌లా ఉంటుంది. ఆమె స్టెట్మెంట్లు ఎక్కువ శాతం కాంట్రవర్శీలకు దారి తీసిన సందర్భాలున్నాయి. ఈ కాంట్రవర్శీ క్వీన్‌కి తిరుగులేదు. సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళుతున్నారు. టెలివిజన్ స్టార్ నిర్మాణం రిస్క్‌తో కూడుకున్నది. టెన్షన్స్‌తో కూడుకున్నది. కూడికలు, తీసివేతలతో కూడుకున్నది. మనుషుల్ని డీల్ చేయాలి. టెన్షన్‌ను హ్యాండిల్ చేయాలి. అందులో రాణించడం చాలా కష్టం. కానీ బాలీవుడ్ నిర్మాణంలో రాణిగా వెలుగుతున్నారు ఏక్తా కపూర్. సీరియల్స్, సినిమాలు, వెబ్ షోలు ఇలా ఎడతెరిపి లేకుండా కంటెంట్‌ని బుల్లితెరపై కురిపిస్తూ టెలివిజన్ క్వీన్‌గా ఉన్నారు ఏక్తా. బాలీవుడ్ నటుడు జితేంద్ర, శోభా కపూర్ కుమార్తె ఏక్తా కపూర్. 15 ఏళ్లకే దర్శకుడు కైలాష్ సురేంద్రనాథ్ దగ్గర చేరింది ఏక్తా. 1994లో తండ్రి ఇచ్చిన కొంత డబ్బును, తన ధైర్యాన్ని పెట్టుబడిగా పెట్టి బాలాజీ టెలీ ఫిల్మ్స్ నిర్మాణ సంస్థ స్థాపించింది ఏక్తా. సీరియల్స్ మీద సీరియల్స్. ఆ తర్వాత సినిమా నిర్మాణంలోకి దిగింది. బాలాజీ టెలీ ఫిలింస్ ద్వారా దాదాపు 130 సీరియల్స్‌ను నిర్మించింది. అందులో కొన్ని సీరియల్స్ పలు ప్రాంతీయ భాషల్లోనూ డబ్బింగ్ అయ్యాయి. ఆమె నిర్మించినవాటిలో ‘హమ్ పాంచ్, కహానీ ఘర్ ఘర్ కీ, జోధా అక్బర్, నాగినీ, కుంకుమ్ భాగ్య, కుందలీ’ వంటి పాపులర్ టీవీ సీరియల్స్ కొన్ని. సినిమాలు స్టయిల్ వేరు, సీరియల్స్ స్టయిల్ వేరు. సీరియల్స్‌లో ఎప్పటికప్పుడు సరుకు తయారవుతూనే ఉండాలి. అందుకే ఆమెను క్వీన్ ఆఫ్ టెలివిజన్ అంటారు. 2017లో ఎల్టీ బాలాజీ డిజిటల్ యాప్ స్టార్ట్ చేసి, ఇప్పటివరకు సుమారు 40 షోలు అందించింది. ‘హమ్ పాంచ్’ సీరియల్ ద్వారా విద్యా బాలన్‌ను పరిచయం చేసింది ఏక్తా. టెలివిజన్ ఇండస్ట్రీలో మోస్ట్ పవర్ఫుల్ లేడీగా ఎదిగింది ఏక్తా. 44 ఏళ్ల ఏక్తా కపూర్ పెళ్లి చేసుకోలేదు. సరోగసీ ద్వారా ఓ బాబుకి తల్లయ్యారు. – గౌతమ్ మల్లాది -
రెపరెపలాడిన మువ్వన్నెల జెండా
హుజూరాబాద్ : నియోజకవర్గ వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా హుజూరాబాద్ సబ్కోర్డులో సబ్ జడ్జీ ప్రదీప్‌నాయక్ జెండా ఆవిష్కరణ చేయగా, న్యాయమూర్తులు శ్రీలేఖ, గువ్వల రాధిక, గాండ్ల రాధికలు పాల్గొన్నారు. ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో బోయపాటి చెన్నయ్య, తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ నల్లా వెంకట్‌రెడ్డి, నగరపంచాయతీ కార్యాలయంలో కమిషనర్ స్వరూపారాణి, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో కృష్ణప్రసాద్, డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ కృపాకర్, మార్కెట్ కార్యాలయంలో మార్కెట్ చైర్మన్ ఎడవెల్లి కొండాల్‌రెడ్డి, పోలీస్‌స్టేషన్‌లో సీఐ రమణమూర్తి, వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏడీఏ దామోదర్‌రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణశాఖ అధ్యక్షుడు కాసిపేట శ్రీనివాస్ జెండావిష్కరణ చేశారు. అలాగే పట్టణంలోని పలు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో గణతంత్ర వేడుకలు అంబరన్నాంటాయి. విద్యార్థులు దేశ నాయకుల వేషాదారణతో ఆకట్టుకున్నారు. ఆయ పాఠశాలల్లో విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక నృత్యాలు ఆకట్టుకున్నాయి. గణతంత్ర వేడుకలను పురుష్కరించుకొని విద్యార్థులకు నిర్వహించిన పలు ప్రతిభ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అలాగే ఆయా రాజ కీయపార్టీల నాయకులు, కుల సంఘాలు, యువజన, విద్యార్థి, మహిళా, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో నగరపంచాయతీ చైర్మన్ విజయ్‌కుమార్, ఎంపీపీ వొడితల సరోజినీ దేవి, వైస్ చైర్మన్ తాళ్లపల్లి రజిత, ఆయా పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. హుజూరాబాద్‌రూరల్ : కొత్తపల్లిలోని మార్కెట్ కమిటీ కార్యాలయంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఎడవెల్లి కొండాల్‌రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి బండ శ్రీనివాస్, పట్టణ శాఖ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, నాయకులు డిష్ రమేష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఖాలీద్ హుస్సేన్‌లు, పైర్ స్టేషన్ కార్యాలయంలో ఎస్సై అనంతరావు, సింగా పూర్ పశువైద్యాధికారి కార్యాలయంలో డాక్టర్ మాధవరావు, చెల్పూర్ పీహెచ్సీలో డాక్టర్ రాజమౌళి, కేసీ క్యాంపులోని హుజూ రాబాద్ పోలీస్ సబ్ డివిజనల్ అధికారి కార్యాలయంలో ఏసీపీ టి. కృపాకర్లతో పాటు పలు గ్రామపంచాయతీల ఆవరణలో గ్రామ సర్పంచులు జాతీయ జెండాలు ఎగరవేశారు. గణేష్‌నగర్ కాలనీలో కౌన్సిలర్ బర్మావత్ యాదగిరి, చెట్టి శ్రీనివాస్, నాయకులు అంపటి సుదీర్, మార్కెట్ డైరెక్టర్ ప్రభాకర్‌రెడ్డి, రియాజ్ తదితరులు ఉన్నారు. కిట్స్ కళాశాలలో .. సింగాపూర్‌లోని కిట్స్ ఇంజనీరింగ్కళాశాలలో వేడుకలు అంబరాన్నంటాయి. ఈ సందర్భంగా ఎన్సీసీ లెప్ట్నెంట్ అధికారి కల్లెం రవీంద్రబాబు ఆధ్వర్యంలో ఎన్సీసీ కెడెట్లు నుంచి కళాశాల ప్రిన్సిపాల్ కందుకూరి శంకర్ గౌరవ వందనం స్వీకరించారు. ఇల్లందకుంటలో.. ఇల్లందకుంట: తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ రమేష్, పోలీస్ సేష్టన్‌లో సీఐ నారాయణ, గ్రామపంచాయతీ వద్ద సర్పంచ్ పెద్ది స్వరూపకుమార్, వ్యవసాయ కార్యాలయంలో ఏవో రజిత, ప్రా«థమిక సహకార సంఘంలో అధ్యక్షుడు వాసుదేవరెడ్డి, శ్రీసీతారామ చంద్ర స్వామి దేవాలయంలో ఈవో సులోచనతోపాటు ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు జాతీయ జెండాను ఎగురవేశారు. నాయకుల వేషధారణలో చిన్నారులు ఆకట్టుకున్నారు. ఒగ్గుకళాకారులు డప్పు చప్పుల్లతో అందరిని అలరించారు. జమ్మికుంటలో.. జమ్మికుంట: పోలీసు స్టేషన్, నగర పంచాయతీ కార్యాలయం, గాంధీచౌక్, వ్యవసాయ మార్కెట్, సింగిల్‌విండో కార్యాలయం, వ్యవసాయ కార్యాలయం, ఎక్సైజ్ పోలీసు స్టేషన్, ఎంఈవో కార్యాలయం, ప్రభుత్వ, ప్రవేట్ కళాశాలలు, పాఠశాలలు, ఆటో యూనియన్లు, లారీ అసోసియోషన్, ఓడ్డెర కుల సంఘం, ఆగ్రి పాలి టెక్నిక్ కళాశాలల్లో జాతీయ జెండాలను ఏగురవేశారు. వీణవంకలో.. వీణవంక: మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ తూము రవీందర్, ఠాణాలో ఎస్సై క్రిష్ణారెడ్డి, బస్టాండ్‌లో జెడ్పీటీసీ దాసారపు ప్రభాకర్, పీఏసీఎస్‌లో చైర్మన్ మాడ సాదవరెడ్డి, బేతిగల్ పీఎస్‌లో ఎంపీటీసీ గొట్టిముక్కుల ప్రేమలత రవీందర్రావు, మోడల్ స్కూల్లో ప్రిన్సిపాల్ డాక్టర్ వేణుగోపాల్‌రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించారు. కార్యక్రమంలో సర్పంచులు ఎక్కటి రాణమ్మ, చిన్నాల ఐలయ్య యాదవ్, సంపత్‌రావు, కాదాసు రాజమల్లయ్య, గెల్లు లక్ష్మిమల్లయ్య, ఎంపీటీసీలు తాండ్ర శంకర్, గెల్లు పద్మ, మండల టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ అ«ధ్యక్షుడు గంగాడి తిరుపతిరెడ్డి, నల్ల కొండాల్‌రెడ్డి, బత్తిని నరేశ్‌గౌడ్, మడుగూరి సమ్మిరెడ్డి, ఉపాధ్యాయ జేఏసీ కన్వీనర్ దాసారపు ప్రసాద్ పాల్గొన్నారు. -
ఆహ్లాదంగా గవర్నర్ తేనీటి విందు
సాక్షి, హైదరాబాద్: గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్‌భవన్‌లో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఇచ్చిన తేనీటి విందు ఆహ్లాదంగా సాగింది. శుక్రవారం సాయంత్రం గవర్నర్ ఇచ్చిన తేనీటి విందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతోపాటు తెలంగాణ మంత్రులు, ఆంధ్రప్రదేశ్ మంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబు హాజరు కాలేదు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు పెద్ద సంఖ్యలో హాజరు కావడంతో రాజ్‌భవన్‌లో సందడి నెలకొంది. తెలంగాణ శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, బీజేపీఎల్పీ నేత కిషన్ రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ, ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, ఎంఐఎం నుంచి హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ విందులో పాల్గొన్నారు. సాయంత్రం ఐదున్నర గంటలకు ప్రారంభమైన విందు.. రాత్రి ఏడు గంటల దాకా కొనసాగింది. గవర్నర్ నరసింహన్ దంపతులు మంత్రులతో పాటు దాదాపు అందరినీ పలకరిస్తూ, పరిచయం చేసుకుంటూ విందులో కలియదిరిగారు. సీఎం కేసీఆర్ కార్యక్రమం పూర్తయ్యే వరకు ఉన్నారు. అనంతరం ఆయన కొద్ది సేపు గవర్నర్‌తో భేటీ అయ్యారు. తేనీటి విందుకు కాంగ్రెస్ దూరం.. కాగా, సీఎల్పీ నేత జానారెడ్డి, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తేనీటి విందుకు హాజరు కాలేదు. ఇటీవల గవర్నర్, కాంగ్రెస్ మధ్య జరిగిన వివాదం కారణంగానే వీరు హాజరు కాలేదని ప్రచారం జరిగింది. గవర్నర్ ఇచ్చే తేనీటి విందుకు హాజరు కాకూడదని పార్టీలో అంతర్గతంగా చర్చించి నిర్ణయించుకున్నారని సమాచారం. రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్, మాజీ మంత్రి, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు దానం నాగేందర్ విందుకు వచ్చారు. పార్టీ నిర్ణయం తనకు తెలియదని, గాంధీభవన్ నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతోనే హాజరయ్యాయనని, పార్టీ నిర్ణయం తెలిసి ఉంటే హాజరయ్యే వాడిని కాదని ఆనంద్ భాస్కర్ మీడియాకు చెప్పారు. ఏపీ నుంచీ.. ఏపీ సీఎం చంద్రబాబు హాజరు కాకపోయినా, ఏపీ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్, డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, మంత్రులు కామినేని శ్రీనివాస్, పత్తిపాటి పుల్లారావు హాజరయ్యారు. వైఎస్సార్సీపీ నుంచి ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తేనీటి విందులో పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రులు కె.రోశయ్య, నాదేండ్ల భాస్కర్‌రావు, మండలి మాజీ చైర్మన్ చక్రపాణి, యలమంచిలి శివాజీ, మాజీ ఎంపీ సుబ్బిరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మంత్రి వర్గమంతా... తేనీటి విందుకు తెలంగాణ మంత్రివర్గం దాదాపుగా కదిలి వచ్చింది. గణతంత్ర వేడుకలకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కచ్చితంగా హాజరు కావాలని పార్టీ నుంచి సమాచారం ఇచ్చారు. ఉదయం పరేడ్ గ్రౌండ్లో ఉత్సవాలకు హాజరైన ఎమ్మెల్యేలు తిరిగి జిల్లాలకు వెళ్లిపోగా, మంత్రులు సాయంత్రం జరిగిన విందుకు హాజరయ్యారు. డిప్యూటీ సీఎంలు కడియం శ్రీహరి, మహమూద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, ఈటల రాజేందర్, హరీశ్‌రావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు, జగదీశ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, జూపల్లి కృష్ణారావుతోపాటు మండలి విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎంపీలు బి.వినోద్‌కుమార్, బాల్క సుమన్, రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ హాజరయ్యారు. ఎమ్మెల్యేలు సోలిపేట రామలింగారెడ్డి, ఎ.జీవన్‌రెడ్డి, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. -
అభివృద్ధి పథంలో ఏపీ
సాక్షి, అమరావతి: దేశంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతున్న రాష్ట్రమని, విభజన కష్టాలను సమర్థంగా ఎదుర్కొని, సంక్షోభాలను అవకాశాలుగా మలచుకుని అభివృద్ధి పథంలో ముందుకెళ్తోందని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ చెప్పారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో శుక్రవారం 69వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా పోలీసు బలగాల గౌరవ వందనాన్ని స్వీకరించిన గవర్నర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పరేడ్ అనంతరం ప్రసంగించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఏపీ ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు. రికార్డ్ స్థాయిలో 190 రోజుల్లో తాత్కాలిక అసెంబ్లీ, సెక్రటేరియట్ నిర్మాణం పూర్తి చేశామని, గ్రీన్‌ఫీల్డ్ అమరావతిని నిర్మిస్తామని వెల్లడించారు. కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు అసెంబ్లీలో తీర్మానం చేశామని గవర్నర్ తెలిపారు. వాల్మీకి, బోయలను ఎస్టీల్లో చేర్చాలని కేంద్రాన్ని కోరుతామన్నారు. ఎందరో మహనీయుల త్యాగ ఫలితంగా ఈ రోజు గణతంత్ర వేడుకలు జరుపుకుంటున్నామని గవర్నర్ తెలుగులో ఉపన్యాసం ప్రారంభించారు. కాగా దావోస్ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గణతంత్ర వేడుకలకు గైర్హాజరయ్యారు. సీఎం సతీమణి నారా భువనేశ్వరి మనవడు దేవాన్ష్‌తో కలసి హాజరయ్యారు. -
గణతంత్ర వేడుకకు10 దేశాల అధినేతలు
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: భారత 69వ గణతంత్ర వేడుకల్లో పాల్గొనేందుకు పది ఆగ్నేయాసియా దేశాల అధినేతలు ఢిల్లీకి రానున్నారు. సాధారణంగా ప్రతి గణతంత్ర దినోత్సవానికీ ఓ దేశాధినేతను భారత్‌కు ఆహ్వానించడం గత 60 ఏళ్లుగా ఆనవాయితీగా వస్తోంది. అయితే గతంలో ఎన్నడూ లేనట్లుగా ఈ ఏడాది ఏకంగా పది దేశాల అధినేతలు రాజ్‌పథ్‌కు రానున్నారు. బ్రూనై, కంబోడియా, ఇండోనేసియా, లావోస్, మలేసియా, మయన్మార్, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయ్‌లాండ్, వియత్నాం దేశాధినేతలు భారత్‌లో పర్యటించనున్నారు. ఆసియా ప్రాంతంలో పెరుగుతున్న చైనా ఆధిపత్యాన్ని నిరోధించడంలో భాగంగానే భారత్ ఈ ఏడాది ఇంత మంది అతిథులను ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఆగ్నేయాసియా దేశాలతో భారత్ సంబంధాలను ఏర్పరచుకుని 25 వసంతాలు పూర్తికావొస్తోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని జనవరి 25న స్మారకోత్సవాలను నిర్వహిస్తామనీ, అందరూ ఆ వేడుకలకు హాజరు కావాలంటూ నవంబరులోనే ప్రధాని మోదీ ఆసియాన్–భారత్ సదస్సులో కోరారు. -
అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలి
అనంతపురం అర్బన్ : జిల్లా అభివృద్ధి లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని అధికారులు, సిబ్బందికి జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మికాంతం సూచించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారం కలెక్టరేట్లో జాతీయ పతాకాన్ని ఆయన ఆవిష్కరించారు. జేసీ–2 సయ్యద్ ఖాజా మొహిద్ధీన్, డీఆర్ఓ సి.మల్లీశ్వరిదేవి పాల్గొన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ దేశ సార్వభౌమాధికారాన్ని పరిరక్షించడం ప్రతి పౌరుడి బాధ్యత అన్నారు. ఆ దిశగా అందరూ నడవాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ ఆనంద్, రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు జయరామప్ప, తహశీల్దార్లు వరప్రసాద్, హరికుమార్, సుబ్బయ్య, వెంకటనారాయణ, సర్వే శాఖ ఏడీ మశ్ఛేంద్రనాథ్, తదితరులు పాల్గొన్నారు. -
గణతంత్ర వేడుకల్లో అపశృతి
తాడిపత్రి (అనంతపురం జిల్లా) : తాడిపత్రి మండలం కావేరిసముద్రం గ్రామంలో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జాతీయజెండాను సరిచేసేందుకు ఇద్దరు విద్యార్థులు పక్కనే ఉన్న భవనం ఎక్కారు. సరిచేసే సమయంలో కరెంట్ తీగలు తగిలి వంశీవర్ధన్(13) అనే 8వ తరగతి విద్యార్థి అక్కడికక్కడే మృతిచెందగా..మనోజ్ అనే విద్యార్థికి గాయాలయ్యాయి. గాయపడిన విద్యార్థిని సమీప ఆసుపత్రికి తరలించారు.