గణతంత్ర వేడుకకు10 దేశాల అధినేతలు | 10 Asean heads of State/ Govt to participate in next year's Republic Day parade | Sakshi
Sakshi News home page

గణతంత్ర వేడుకకు10 దేశాల అధినేతలు

Published Tue, Dec 12 2017 3:40 AM | Last Updated on Wed, Aug 15 2018 2:32 PM

10 Asean heads of State/ Govt to participate in next year's Republic Day parade - Sakshi

సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: భారత 69వ గణతంత్ర వేడుకల్లో పాల్గొనేందుకు పది ఆగ్నేయాసియా దేశాల అధినేతలు ఢిల్లీకి రానున్నారు. సాధారణంగా ప్రతి గణతంత్ర దినోత్సవానికీ ఓ దేశాధినేతను భారత్‌కు ఆహ్వానించడం గత 60 ఏళ్లుగా ఆనవాయితీగా వస్తోంది. అయితే గతంలో ఎన్నడూ లేనట్లుగా ఈ ఏడాది ఏకంగా పది దేశాల అధినేతలు రాజ్‌పథ్‌కు రానున్నారు. బ్రూనై, కంబోడియా, ఇండోనేసియా, లావోస్, మలేసియా, మయన్మార్, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయ్‌లాండ్, వియత్నాం దేశాధినేతలు భారత్‌లో పర్యటించనున్నారు.

ఆసియా ప్రాంతంలో పెరుగుతున్న చైనా ఆధిపత్యాన్ని నిరోధించడంలో భాగంగానే భారత్‌ ఈ ఏడాది ఇంత మంది అతిథులను ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఆగ్నేయాసియా దేశాలతో భారత్‌ సంబంధాలను ఏర్పరచుకుని 25 వసంతాలు పూర్తికావొస్తోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని జనవరి 25న స్మారకోత్సవాలను నిర్వహిస్తామనీ, అందరూ ఆ వేడుకలకు హాజరు కావాలంటూ నవంబరులోనే ప్రధాని మోదీ ఆసియాన్‌–భారత్‌ సదస్సులో కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement