కరీంనగర్ జిల్లాలోని ధర్మపురి నియోజకవర్గంలోని ధర్మారం మండలంలో 'మిషన్ కాకతీయ'కు సంబంధించి టెండర్‌లలో అవకత వకలు జరిగాయని..
కరీంనగర్: కరీంనగర్ జిల్లాలోని ధర్మపురి నియోజకవర్గంలోని ధర్మారం మండలంలో 'మిషన్ కాకతీయ'కు సంబంధించి టెండర్‌లలో అవకత వకలు జరిగాయని, దీనిపై విచారణ చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ ఒత్తిడికి లొంగి అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి రెండోసారి టెండర్లు పిలిచారని ఆరోపిస్తూ బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్స్ తరపున కాంపల్లి చంద్రశేఖర్, తాళ్లపల్లి రమేశ్ గౌడ్ అనే న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
( ధర్మపురి)