క్రైస్తవ వివాహ పరిచయ వేదికకు అపూర్వ స్పందన | Platform in response to the introduction of the Christian Marriage | Sakshi

క్రైస్తవ వివాహ పరిచయ వేదికకు అపూర్వ స్పందన

Published Sun, Aug 17 2014 1:19 AM | Last Updated on Sat, Sep 2 2017 11:58 AM

క్రైస్తవ వివాహ పరిచయ వేదికకు అపూర్వ స్పందన

క్రైస్తవ వివాహ పరిచయ వేదికకు అపూర్వ స్పందన

‘సాక్షి’ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన క్రైస్తవ వివాహ పరిచయ వేదికకు అపూర్వ స్పందన లభించింది. పెళ్లికోసం తగిన జోడిని వెతుక్కోవడం కష్టతరమైన ఈ రోజుల్లో యువతి...

ఆర్‌కేపురం:  ‘సాక్షి’ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన క్రైస్తవ వివాహ పరిచయ వేదికకు అపూర్వ స్పందన లభించింది. పెళ్లికోసం తగిన జోడిని వెతుక్కోవడం కష్టతరమైన ఈ రోజుల్లో యువతి, యువకులు పెళ్లికోసం పరిచయ వేదికలపైన ఆధారపడాల్సిన పరిస్థతి ఏర్పడింది.

ఈ క్రమంలో కొత్తపేటలోని బాబుజగ్జీవన్‌రావ్ భవన్‌లో సాక్షి నిర్వహించిన క్రైస్తవ వివాహ పరిచయ వేదిక కార్యక్రమానికి రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు జంటనగరాల నుంచి భారీ సంఖ్యలో యువతి, యువకులు వారి తల్లిదండ్రులతో సహా హాజరయ్యారు. సాక్షి ఆధ్వర్యంలో ప్రతి నెలా వివాహ పరిచయవేదికలు నిర్వహించడం జరుగుతుందని ఈ వేదిక ద్వారా అనేక జంటలు ఒకటయ్యాయని సాక్షి అడ్వర్‌టైజ్‌మెంట్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఎం. సంతోష్‌కుమార్ అన్నారు.  కార్యక్రమంలో ఈవెంట్ మేనేజర్ భరత్‌కిషోర్, ప్రముఖ యాంకర్ వేటూరి కాంతి పాల్గొన్నారు.
 
‘సాక్షి’ వారు నిర్వహించిన ఈ వివాహ పరిచయ వేదిక వల్ల క్రిస్టియన్ కమ్యూనిటీలోని పెళ్లి కావాల్సిన వధూవరులకు, వారి తల్లిదండ్రులకు ఎంతో సౌలభ్యంగా ఉంది. వేర్వేరు చోట ఉన్న వారు ఒకే వేదికపై కలవడం వల్ల వారి అభిప్రాయాలు ఒకరికి ఒకరు పంచుకోవడం సులభమవుతుంది. ఇటువంటి వివాహ వేదికలు భవిష్యత్తులో మరిన్ని నిర్వహించాలి.
 (అబ్రహం- ఇండియన్ క్రిస్టియన్ మ్యాట్రిమోని డాట్ కామ్ సంస్థ అధినేత)
 
 భాగస్వామి ఎంపికకు దోహదం
 ఈ వివాహ పరిచయ వేదిక నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉంది. క్రైస్తవ అమ్మాయిలు, అబ్బాయిలకు ఎంతో సులువుగా వారి వారి భాగస్వాములను ఎంచుకునేందుకు ఎంతో దోహద పడుతుంది. ‘బైబిల్ ప్రకారం వివాహం అన్నిటిలో ఘనమైంది.     
 -రెవరెండ్ డా. బి.పి.శామ్యూల్
 
 సంబంధాలు త్వరగా కుదురుతాయి
 క్రైస్తవ వివాహ పరిచయ వేదిక ఏర్పాటు చేసినందుకు సాక్షి వారికి ధన్యవాదాలు. రిస్క్ లేకుండా ఒకే వేదికపై ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం వల్ల సంబంధాలు త్వరగా కుదురుతాయి.
 - కాపర్తి ప్రణీత
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement